పరిగి : తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్టుగా మారిపోయింది రైతన్న పరిస్థితి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో చేతికంద వచ్చిన పంట ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దెబ్బ తినడంతో రైతన్న తీవ్రంగా నష్ట పోయాడు. పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం ఈదురు గాలులతో కూడిన భారి వడగళ్ళ వర్షం కురిసింది. వర్షం కురవడంతో వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడగళ్ళ వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఏ విధంగానైనా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.