నాగర్ కర్నూల్,మే 19.ప్రజాతంత్రవిలేకరి: మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో నాగర్ కర్నూల్ జిల్లా లోని 20 మండ లాలకు సంబంధించిన విత్తనాల డీలర్లతో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ డాక్టర్ సాయి శేఖర్ లు, రైతులకు వానకాలం విత్తనాల అమ్మకంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరి, మొక్కజొన్న ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అమ్మ వద్దని కలెక్టర్ విత్తనాల డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాన కాలంలో మొక్కజొన్న పంట వల్ల దిగుబడి కోల్పోవడమే కాకుండా రైతులకు ప్రభుత్వం రైతు బంధు కూడా అందజే యాలని, అలాంటి పరిస్థితుల్లో రైతులకు మొక్కజొన్న విత్త నాలు అమ్మి వారికి నష్టం వాటిల్లే విధంగా చేయకూడదని, వాటి ద్వారా రైతులకు ఏ మేరకు నష్టం జరుగు తుందో కలెక్టర్ వివరించారు.ఈనెల 21న ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమావేశం జరగనుందని ఆ సమావేశంలో ఏ జిల్లాలో ఏ పంట ఎంత వేయాలో ప్రభుత్వం నిర్ణయి స్తుందని ప్రభుత్వ నిర్ణయం తర్వాత, ఏరక మైన వరి, విత్తనాలు వెయ్యాలో అనే నిర్ణయం తర్వాత వరి విత్తనాలను అమ్మాలని, అంతవ రకు పత్తి కంది విత్తనాలను మాత్రమే అమ్మాలని కలెక్టర్ విత్తన డీలర్లకు ఆదేశించారు.గత సంవత్స రం బిజినపల్లి మండలం లడ్డుపల్లిలో మైక్రో వరిని, అమ్మి రైతులకు నష్టం కలిగించిన డీలర్ ను ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అందుకే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సమూల మార్పుల తో అధునాతన పద్ధతులతో రైతులకు లబ్ధి చేకూరేలా కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.21వ తేదీ సమావేశం తరువాత డివిజన్ స్థాయిలో మళ్లీ విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు వెయ్యాలో స్పష్టంగా తెలియజేస్తామని అంత వరకు కేవలం కంది, పత్తి విత్తనాలనే అమ్మాలని సూచించారు.ప్రభుత్వం నిర్ణయాలను ప్రతీ డీలర్ పాటించా లని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ సాయి శేఖర్ మాట్లాడు తూ జిల్లాలో రైతులకు నష్టం కలిగించే చర్యలు ఎవరు చేపట్టిన కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ సాయి శేఖర్ స్ప ష్టం చేశారు.రైతులకు ఫర్టిలైజర్స్ సీడ్స్ విత్తన ఎరువుల షా పుల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసారి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలో జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మవారి వివరాలను, ఏ ఈ ఓ లకు తెలియజేయాలని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపా రు. గతంలో నమోదు చేసిన కేసులు కోర్టులో కొనసాగుతు న్నాయని, నకిలీ విత్తనాలు అమ్మవారిపై కఠినచర్యలు ఉం టాయని తెలిపారు. సమాజంలో నేడు కొనసాగుతున్న పరిస్థితుల అధ్యయనం చేసుకుంటూ ఆరు నెలల తరువాత జరగనున్న తీవ్ర నష్టం పరిణామాలను ఇప్పటి నుండే గుర్తించుకొని విత్తనాల దుకాణదారులు మసలుకోవాలని హితవు పలికారు. జిల్లాలో రైతులకు లబ్ధి చేకూర్చేం దుకు ప్రతి ఒక్కరూ సహాయసహకారాలు అందించాలని ఎస్పీ సాయి శేఖర్ కోరారు. పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ డి ఆర్ అవిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర మార్పుల ద్వారా పంటలు జరిగేం దుకు ప్రభుత్వం నిర్ణయిం చిందని అందుకు అనుగుణంగానే విత్తనాలను రైతులకు అందజేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి బైరెడ్డి సింగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమావేశం అనంతరం ఏ రకమైన పంటల వేయాలో సమావేశాలు నిర్వహించి తెలియజేస్తామని తెలియజేశారు.