Take a fresh look at your lifestyle.

జోగులాంబ గద్వాల జిల్లా లో తీవ్ర విషాదం..!

జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున   కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి   ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.మరోఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు.ఈ ఘటనతో గ్రామ మొత్తం విషాదంలో మునిగి పోయింది. ఒక్కసారిగా ఐదుగురు మృతి చెందడం స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ పక్కనుండి ఆడుకునే చిన్నారులు కూడ మృత్యువాత పడడంతో స్థానికులు కంటతడి పెడుతున్నారు…

Leave a Reply