Take a fresh look at your lifestyle.

తెలంగాణలోనూ పటాకులపై బ్యాన్‌

బాణాసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
తెలంగాణలో బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిషేధం విధించింది. కొరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్‌ ‌చేసింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని న్యాయవాది ఇందప్రకాశ్‌ ‌హైకోర్టులో పిల్‌ ‌దాఖలు చేశారు. కొరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్‌ ‌పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాలు నిషేధం విధించాయని కోర్టుకు తెలిపారు. అయితే బాణాసంచాపై నిర్ధిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్టీసీ మార్గదర్శకాలు పాటిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇలాగే ఇప్పటి వరకు తెరిచిన దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.

ఇపట్పికే ఢిల్లీ,  రాజస్థాన్‌, ‌కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు పటాకుల అమ్మకాలు, విక్రయాలపై బ్యాన్‌ ‌విధించాయి. మహారాష్ట్రలో బాణాసంచాపై బ్యాన్‌ ‌విధించక పోయినా.. వాటికి దూరంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్‌లోనూ కాళీమాత పూజ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు విక్రయాలపై, కాల్చడాన్ని నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్‌ ‌కాలుష్య నియంత్రణ మండలి (డబ్ల్యూబీపీసీబీ) రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు వెయ్యి వరకు జీపీఎస్‌ అమర్చిన సౌండ్‌ ‌మానిటరింగ్‌ ‌పరికరాలను పంపిణీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply