Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యోగుల ఆశలు వమ్ము చేసిన సి పి ఎస్‌ ‌కొనసాగింపు జి ఓ

(‌సిపిఎస్‌ ‌కొనసాగింపు జీవో విడుదల అయిన నేపథ్యంలో..)

జీవితంలో సగ భాగాన్ని ఉద్యోగ నిర్వ హణ బాధ్యతలకు ధారపోసి సేవలం దిం చిన వ్యక్తుల కుటు ంబ భవి ష్యత్‌ ‌కు ఆర్ధిక భరోసా కల్పిం చడమే పెన్షన్‌ ‌ము ఖ్యోద్దేశం. పదవీ విరమణ చేయ నున్న వ్యక్తుల కుటుం బాల భరోసాకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గండి కొట్టిందా? ఇక వారి జీవితాలకు ఆసరా ఏది. నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా ఉద్యోగుల భవిష్యత్తును స్టాక్‌ ‌మార్కెట్‌ ‌కు తాకట్టు పెట్టి తీసుకువచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీమ్‌ ‌ను, యావత్‌ ‌తెలంగాణలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు సమాధి కట్టేందుకన్నట్లు, ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ ఎలాంటి మార్పులు చేయకుండా యధాతధంగా వర్తింప చేసేందుకు సిద్ధమైంది. ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్‌ ‌నిధిని నేషనల్‌ ‌సెక్యూరిటీ డిపాజిట్‌ ‌లిమిటెడ్‌(‌చీ•ణ•)లో జమ చేసుకోవడానికి వీలుగా ఒప్పందం చేసుకోవడానికి ట్రెజరీ డైరెక్టర్‌ ‌కు అధికారం కల్పిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి 2020 ఆగస్ట్ 23, ఆదివారం జీవో నెంబర్‌ 28 ‌జారీచేసారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీమ్‌ ‌ను కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు రద్దు చేసేందుకు సమాయత్తం అవుతుండగా, ప్రక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఈ అనుచిత విధానం రద్దు చేయడానికి ఒక్క అడుగు ముందుకు వేసి జీవో తీసుకువచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రం మాత్రం పాత పెన్షన్‌ ‌విధానాన్ని కొనసాగిస్తున్నది.
ఉద్యోగి అంటే అతని యావత్‌ ‌కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగిగా 58 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు వరకు కర్తవ్యం నిర్వహించి ఆ తర్వాత పదవీ విరమణ చేయడం చేయడం సహజం. జీవితంలో సగ భాగంపైగా ప్రభుత్వ సేవలకు అంకితం చేసిన కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత చివరి వేతనంలో సగం (మూల వేతనం) బేసిక్‌ ‌పే ను పెన్షన్‌ ‌గా లెక్కకట్టి వృద్ధాప్య సమయంలో జీవనభృతికి, బ్రతుక్కి భరోసా కల్పిస్తూ ఇచ్చేదే పాత పెన్షన్‌ ‌విధానం. ఈ విధానం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులకు మనుగడ సుఖాంతం అయ్యేది. పదవీ విరమణ అనంతరం ఉద్యోగి గౌరవప్రదంగా జీవించడానికి, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడానికి, వయసు మీరిన తరువాత ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవడానికి, పిల్లల పెళ్ళిళ్ళకు, చదువులకు, గృహనిర్మాణానికి ఉపయోగ పడేందుకు ఈ పెన్షన్‌ ‌సదుపాయం ముఖ్యోద్దేశం.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీం అంటే..
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు సామాజిక భద్రత నుండి వైదొలగి, కార్పొరేట్‌ ‌శక్తులకు చేయూతనిస్తూ సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసే క్రమంలో 2003లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌పథకాన్ని తెరపైకి తెచ్చింది. 2003 ఆగస్టు 23న పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ డెవలప్మెంట్‌ అథారిటీ(•ఖీ=ణ•) ఏర్పాటు చేసింది. ఈ విధానానికి 2003 సెప్టెంబర్‌ 6 ‌న లోక్‌ ‌సభ, సెప్టెంబర్‌ 9‌న రాజ్యసభ ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2004 నుండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో సెప్టెంబరు 1, 2004 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సి పి ఎస్‌ ‌ను అమలులోకి తెచ్చారు.

ఉద్యోగికి ఎంత నష్టం, ఎంత కష్టం
నూతన నిబంధనల ప్రకారం జనవరి 1 ,2004 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెప్టెంబర్‌ 1, 2004 ‌తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించి, ఆ మొత్తానికి ప్రభుత్వాలు పదిశాతం కలిపి నేషనల్‌ ‌సెక్యూరిటీ డిపాజిట్‌ ‌లిమిటెడ్‌ ‌ద్వారా పెన్షన్‌ ‌నిధిని జమ చేసి, వాటిని స్టాక్‌ ‌మార్కెట్లో పెడుతుంది. పదవి విరమణ పొందిన తరువాత ఉద్యోగులు పొందే మొత్తంలో, 60 శాతం మాత్రం చెల్లిస్తారు. ఆమొత్తంపైపై కూడా పన్ను విధిస్తారు. మిగతా 40 శాతం షేర్‌ ‌మార్కెట్లో ఉంచి, దాని మీద వచ్చే ఆదాయంతో పెన్షన్‌ ఇస్తారు. ఈ విధానంలో ఎంత మొత్తంలో పెన్షన్‌ ‌వస్తుందో తెలియదు. స్టాక్‌ ‌మార్కెట్‌ ‌మీద ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ ‌మార్కెట్‌ ‌వ్యాపారంలో లాభం వస్తే పెన్షన్‌ ‌పెరుగుతుంది. నష్టం వస్తే పెన్షన్‌ ‌తగ్గుతుంది. పాత పెన్షన్‌ ‌విధానంలో పదవి విరమణ తరువాత ఇచ్చే గ్రాట్యూటీ ఇప్పుడు ఉండదు. ఉద్యోగి చనిపోతే భార్యకి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ ఉం‌డదు. అయితే ఉద్యోగులలొ ఏర్పడిన వ్యతిరేకత దృష్ట్యా ఇటీవల కొంత సవరించి ఉద్యోగి సర్వీస్‌ ‌లో మరణిస్తే అతని భార్యకు ఫ్యామిలీ పెన్షన్‌ ఇస్తున్నారు. పాత పెన్షన్‌ ‌విధానం లో లాగా జనరల్‌ ‌ప్రావిడెంట్‌ ‌ఫండ్‌ ‌ఖాతా ఉండదు. అందువల్ల ఉద్యోగులు రిటైర్‌ అయిన తరువాత సామాజిక భద్రతతో గౌరవప్రదంగా బతికేందుకు సాధ్యం కాదు. ఈ నూతన విధానంలో ప్రభుత్వాలు ఉద్యోగులపై పెట్టే ఖర్చుప్రభుత్వానికి ఆదా అవుతుంది. జీతాల కంటే పెన్షన్ల భారం పెరిగిందని రిటైర్‌ ఉద్యోగులను తెల్ల ఏనుగులుగా భావించి ఉద్యోగుల పెన్షన్‌ ‌నిధిని కార్పొరేట్‌ ‌శక్తులకు పెట్టుబడిగా అందించడానికి ఉపయోగపడుతుంది. పెన్షనర్లకు బదులు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టవచ్చన్న భావనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌పథకాన్ని అమలు మొదలెట్టాయి.

పాత పెన్షన్‌ ‌విధానంలో భద్రత, భరోసాతో కూడిన మొత్తం పెన్షన్‌ ‌గా నిర్ణయిస్తారు.. ఎంత మొత్తం వస్తుందో ముందుగానే తెలుస్తుంది. కొత్త విధానంలో ఎంత మొత్తం పెన్షన్‌ ‌గా అందుతుందో తెలియదు. జమ అయిన నిధి స్టాక్‌ ‌మార్కెట్‌ ‌లో వచ్చే ఆటుపోటులకు గురవుతుంది. ఆ పెన్షన్‌ ‌కు అభద్రత ఏర్పడుతుంది. కొత్త విధానంలో రిటైర్‌ అయిన తర్వాత ఉద్యోగి చెల్లించిన 10%, ప్రభుత్వం చెల్లించిన 10% ద్వారా జమఅయిన మొత్తంలో 60 శాతం ఇస్తూ పన్ను కూడా లెక్క కడతారు. మిగతా 40 శాతం షేర్‌ ‌మార్కెట్‌ ‌లో పెట్టి వచ్చిన లాభాన్ని పెన్షన్‌ ‌గా చెల్లిస్తారు. అది అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారిలో ఇటీవల కొందరు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణించడం వల్ల వారి కుటుంబానికి ఉద్యోగం సౌకర్యం లేక, పెన్షన్‌ ‌కూడా కేవలం 650 రూపాయల నుండి 850 మధ్య మాత్రమే అందడంవల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి జీవచ్ఛవాలుగా తయారవడం హృదయవిదారకం. ప్రభుత్వాలు అందించే వృద్ధాప్య పెన్షన్‌ ‌మాత్రం కూడా మృతుల కుటుంబాలకు అందడంలేదు.

ఇటీవలికాలంలో సుమారు 300 మంది సిపిస్‌ ఉద్యోగులు మృతిచెందగా వెయ్యి మందికి పైగా రిటైర్‌ అయ్యారు. ఆ కుటుంబాలన్నీ ఆర్థిక సమస్యలతో అవస్థల పాలవుతున్నాయి. 30 సంవత్సరాలు జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యోగ చేస్తే అందని పెన్షన్‌ ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న వారు అందుకోవ్డం సమంజసమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాలేదని ప్రత్యేక తెలంగాణ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధనలో ఉద్యోగులు భాగస్వాములైన వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఆరు సంవత్సరాలుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోగా సకాలంలో డి.ఏ లు అందక, పిఆర్సి గడువు తీరి మూడేళ్ళైనా, ప్రమోషన్లు, బదలీలు లేక అల్లాడుతున్నారు. సంక్షోభ సమయంలో మూడు నెలలు సగం వేతనాలు కోల్పోయి ఉద్యోగులు మానసిక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితులలో సి పి ఎస్‌ ‌ను కొనసాగింపు ఉద్యోగుల నెత్తిన పిడుగు పడినట్లు అయింది. పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు చేసుకున్న విన్నపాలు అరణ్యరోదన గానే మిగిలాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్‌ ‌బిక్ష కాదని , ప్రాథమిక హక్కుగా గుర్తించి ఉద్యోగులకు పెన్షన్‌ అం‌దించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుకూల వైఖరితో సిపిఎస్‌ ‌కొనసాగింపు రద్దు చేసి, పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలు చేసతే ఉద్యోగులపట్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేది సాకారం అవుతుంది, అప్పుడే బంగారు తెలంగాణ సుసాధ్యమవుతుంది.

thanda sadhanandha
తండ సదానందం.
9989584665

Leave a Reply