Take a fresh look at your lifestyle.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెంటనే ఉప‌సంహ‌రించుకోవాలి: సిపిఎం ఎంపి జ‌ర్నాదాస్ బైద్యా

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెంటనే ఉప‌సంహ‌రించుకోవాలి అని రాజ్య‌స‌భ‌లో సిపిఎం ఎంపి జ‌ర్నాదాస్ బైద్యా డిమాండ్ చేసారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్ప‌డింద‌ని,  ఇందులో 32 మంది ప్రాణాలు అర్పించారని జ‌ర్నాదాస్ బైద్యా తెలిపారు. ఈ ప్లాంట్‌ సుమారు 20,000 మందికి ఉపాధి కల్పిస్తుందని, విశాఖపట్నం నగరంలో ఇతర పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించింద‌ని జ‌ర్నాదాస్ అన్నారు.

విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్‌ న‌వ‌రత్న సంస్థ, ఇది భార‌త‌దేశ‌పు మొద‌టి తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని ఆమె అన్నారు. 2015 వ‌ర‌కు లాభంలో ఉంద‌ని, సొంత గ‌నులు లేక‌పోవ‌డం వంటి విధానాల వ‌ల్ల‌నే వైజాగ్ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల బారిన ప‌డింద‌ని జ‌ర్నాదాస్ అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెంటనే మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ పూర్తి సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు తీసుకునేలా చూడాలని సిపిఎం డిమాండ్ చేస్తుంద‌న్నారు.

Leave a Reply