Take a fresh look at your lifestyle.

కేరళలో సీపీఎం సిద్ధాంత వైరుధ్యం ..!

కార్పొరేట్‌ ‌కంపెనీల మీద..డబ్బున్న వాళ్ళ మీద టాక్స్ ‌వేయండి. ఆ వచ్చిన డబ్బుతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయండి అని సిపిఎం పార్టీ ఇక నుంచి చెప్పకూడదు. ఎందుకంటే ప్రజలు కట్టే టాక్స్ ‌లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అని ఆ పార్టీ కేరళలో చెబుతున్నది కనుక. కేంద్రం ఇంధన పన్ను మినహాయింపు చేసిన తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తాము విధించే వ్యాట్‌ను తగ్గించాయి. పెట్రోల్‌ ‌మరియు డీజిల్‌పై ఎక్సైజ్‌ ‌సుంకాన్ని లీటరుకు 5 రూపాయలు 10 రూపాయలు చొప్పున తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యను అనుసరించి మొత్తం 18 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఆటో ఇంధనంపై పన్నులను తగ్గించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ‌పంజాబ్‌, ‌తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌కేరళ, జార్ఖండ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ వంటి రాష్ట్రాలు పెట్రోల్‌ ‌డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)‌ను తగ్గించలేదు.

ఇంధన పన్నును తగ్గించకూడదని నిర్ణయించుకున్న రాష్ట్రాలలో సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రం గమనార్హం. సీపీఎం ప్రభుత్వం కేరళలో పన్ను కోత విధించేది లేదని తెగేసి చెప్పింది. ఇంధనంపై అదనపు పన్ను తగ్గించకూడదన్న కేరళ రాష్ట్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ, గత ఆరేళ్లుగా కేరళ పెట్రోల్‌ ‌మరియు డీజిల్‌పై రాష్ట్ర-పన్ను పెంచలేదని, వాస్తవానికి ఒకసారి తగ్గించిందని కేరళ ఆర్థిక శాఖ మంత్రి కె యన్‌ ‌బాలగోపాల్‌ ‌చెబుతున్నారు. అంతే కాకుండా కోవిడ్‌ -19 ‌వలన ఇటీవలి సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సహాయ ప్యాకేజీలను ప్రారంభించిందని, అలాగే డియర్‌నెస్‌ అలవెన్స్‌ను 6 శాతం పెంచిందని, ఇంధన ధరలపై పన్నులు తగ్గిస్తే ఇవన్నీ కేరళ ప్రభుత్వం అందించ లేదని ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి చెప్పుకొచ్చారు.

కేరళ ఆర్ధిక శాఖ మంత్రి మరెన్నో వివరణలు ఇస్తూ పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్ను విధానాలు వేర్వేరుగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గించినా ఇంధన ప్రాథమిక ధరను తగ్గించినా, సహజంగానే రాష్ట్ర పన్నులో దామాషా పద్దతి మేరకు తగ్గుతుంది అని సెలవిచ్చారు. అంచేత రాష్ట్రం మళ్లీ అధనంగా పన్ను తగ్గించాల్సిన అవసరం లేదు అని చెప్పారు •• కేంద్రం డీజిల్‌ ‌పెట్రోల్‌పై వరుసగా రూ. 10 మరియు రూ. 5 తగ్గించితే దామాషా పద్దతి మేరకు కేరళలో రూ. 12.30 మరియు రూ. 6.56 పేరుతో డీజిల్‌ ‌ధరలు తగ్గించబడినాయి అని ఆయన చెప్పారు. మంత్రి ఇన్ని మాటలు చెబుతున్న కేరళ ప్రజలు పెట్రోల్‌ ‌డీజల్‌ ‌పై పన్ను తగ్గించాలి అని అడుగుతున్నారు. సీపీఎం పదే పదే చెప్పే మాట కేంద్రం కార్పొరేట్‌ ‌కంపెనీల మీద పన్నులు విధించి ధనవంతులపై టాక్స్ ‌వేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అని. ప్రస్తుతం పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌పై వ్యాట్‌ ‌తగ్గించాలి అని ప్రజలు డిమాండ్‌ ‌చేస్తే మాత్రం, మీ ప్రజలు టాక్స్ ‌కట్టాలి ఆ వచ్చిన డబ్బుతో మీ కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అనడం హాస్యాస్పదంగా వుంది. ఈ వైఖరి ఆ పార్టీ చెప్పేదానికి చేసేదానికి మధ్య వైరుధ్యాన్ని తెలుపుతున్నది.

Aruna-journalist
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

Leave a Reply