Take a fresh look at your lifestyle.

గ్యాస్‌ ‌ధరలపై సిపిఎం ఆందోళన

కట్టెల పొయ్యిపై వంటావార్పుతో నిరసన
విజయవాడ,జూలై 3 : కరోనా కష్ట కాలంలో
ఉపాధి కోల్పోయి ప్రజలు అల్లాడుతున్నారని, వారిపై గ్యాస్‌ ‌ధరలు మోపడం దారుణమని సిపిఎం నేతలు తెలిపారు. ధరలు పెంచుతున్న మోడీకి పేదలు కానరావడం లేదన్నారు. చాయ్‌వాలానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్‌ ‌బండ ధరల పెంపును వ్యతిరేకిస్తూ రాణిగారి తోటలో సీపీఎం వినూత్న నిరసన చేపట్టింది. గ్యాస్‌ ‌బండలు పక్కనపెట్టి, క్టటెల పొయ్యి ద మహిళలు వంట చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్‌ ‌మాట్లాడుతూ…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలుపడి ప్రజలపై భారాలను మోపుతున్నాయన్నారు. కార్పొరేట్‌ ‌సంస్థలకు ఊడిగం చేస్తూ పేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. కేవలం ఏడు నెలల్లో 250 రూపాయలు గ్యాస్‌ ‌ధర పెంచడం అమానుషమన్నారు.

ప్రభుత్వ చర్యలతో మళ్లీ గ్యాస్‌ ‌బండలు వదిలి పొయ్యి ద వంట చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ తానా అంటే సీఎం జగన్‌ ‌తందానా అంటున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏం చేసినా తలాడించడం తప్ప… తప్పు అని చెప్పే ధైర్యం లేకుండా పోయిందని ఆయన అన్నారు. మోదీ చెప్పుచేతల్లో జగన్మోహన్‌ ‌రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గ్యాస్‌ ‌పెట్రోలు ధరల పెంపు కారణంగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయన్నారు. బీజేపీ, వైసీపీల ప్రభుత్వాన్ని గ్దదె దింపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని దోనేపూడి కాశీనాథ్‌ అన్నారు.

Leave a Reply