జంటనగరాల్లో ఆయుధ లెసెన్స్కలిగిన వారంతా తమ ఆయుధాలను వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లలో కానీ, అధికారిక ఆయుధ డీలర్లకు అప్పగించి సంబంధిత పోలీస్స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మార్చి 14వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
లైసెన్స్ కలిగిన ఆయుధరాలను ఎన్నికల పక్రియ పూర్తయిన తర్వాత మార్చి 24న తిరిగి వారు తీసుకోవచ్చని తెలిపారు. ఉత్తర్వులను పాటించని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.