Take a fresh look at your lifestyle.

రైతు కష్టానికి గౌరవమిచ్చిన సిపి మహేష్ భగవత్

తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా కోహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ నెలకొల్పుతున్నారు , కరోన వల్ల ఇక్కడ పలు ఏర్పాట్లు , రక్షణ చర్యలను పర్యవేక్షించడానికి *రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్* వచ్చారు , ఇందులో భాగంగా మార్కెట్లోకి వెళ్లే సమయంలో మామిడికాయలు రాసులుగా పోసిఉండటం , వాటిపైనుంచే మిగతా అధికారులు , సిబ్బంది తొక్కుకుంటూ వెళ్లారు..అయితే అలా వెళ్లడం ఇష్టం లేని కమిషనర్ మహేష్ భగవత్ గారు తన షూస్ ను (పాదరక్షలు) విడిచి తన చేతుల్తో పట్టుకొని ఇలా జాగ్రత్తగా ముందుకెళ్లారు…రైతు కష్టార్జితం అనుకున్నారో, అందరూ తినేవి అనుకున్నారో కానీ తన మృదుస్వభావం , మంచి మనసును ఇలా చాటుకున్నారు.. ఇంత పెద్ద హోదాలో వుండికూడా ఈయన చేసిన పని చాలా మంది మిడిమిడి జ్ఞానంతో విర్రవీగే వారికి , చిన్న చిన్న పదువులు , స్థాయిల్లో ఉండి తమను తాము ఎంతో గొప్పగా అనుకునే వారికి ఒక మార్గదర్శనం కావాలి.

- Advertisement -

Leave a Reply