Take a fresh look at your lifestyle.

ట్యాంక్‌ ‌బండ్‌పై లాగా.. చార్మినార్‌ ‌వద్ద కూడా సన్‌డే ఫన్‌డే

ఏర్పాట్లను పరిశీలించిన సిపి అంజన్‌ ‌కుమార్‌, ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ అరవింద్‌కుమార్‌

ఇక నుంచి పాతబస్తీలోని చార్మినార్‌ ‌వద్ద కూడా ప్రతి ఆదివారం ‘సన్‌ ‌డే ఫన్‌ ‌డే’ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌డే ఫన్‌డేకు విశేష స్పందన లభిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు టాంక్‌బండ్‌పైకి వొచ్చి పిల్లలతో ఎంజాయ్‌ ‌చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీ చార్మినార్‌ ‌వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని విజ్ఞప్తులు వొస్తున్నాయని అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌విభాగం స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ అరవింద్‌కుమార్‌ ‌తెలిపారు. ఈ మేరకు గురువారం అరవింద్‌ ‌కుమార్‌తో పాటు నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీ కుమార్‌, ఎం‌పి అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు చార్మినార్‌ను సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు.

సండే ఫన్‌ ‌డే ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈసందర్భంగా కల్చరల్‌ ఈవెంట్‌లతో పాటు పార్కింగ్‌ ఏర్పాట్లను వారు పరిశీలించారు. చార్మినార్‌ ‌వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌, ఎం‌పీ అసదుద్దీన్‌ ‌సూచించినట్టు అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌విభాగా స్పెషల్‌చీఫ్‌ ‌సెక్రటరీ అరవింద్‌ ‌కుమార్‌ ఈ ‌సందర్భంగా తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో చార్మినార్‌ ‌వద్ద కూడా సన్‌డే ఫన్‌ ‌డే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Leave a Reply