Take a fresh look at your lifestyle.

కొవిడ్‌-19 ‌పాండమిక్‌ ‌పదకోశం

“కమ్యూనిటీ ట్రాన్స్ ‌మిషన్‌.. ‌సాంక్రమిక వ్యాధి ఎవరి నుండి ఎవరికి సంక్రమించిందో కనుక్కోవడం అసాధ్యమైన స్థితిని కమ్యూనిటీ ట్రాన్స్ ‌మిషన్‌ అం‌టారు. వ్యాధిని అంటించిన వ్యక్తిని కనుగొనడం సాధ్యం కాదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వైరల్‌ ‌వ్యాధిగ్రస్తుల స్థితిని తెలియచేస్తుంది. కాంటాక్ట్ ‌ట్రెసింగ్‌ ‌సాంక్రమిక వ్యాధికి లోనైన వ్యక్తితో కలిసి తిరిగిన, మాట్లాడిన వ్యక్తులను గుర్తించడాన్ని కాంటాక్ట్ ‌ట్రెసింగ్‌ అం‌టారు.వీరిని  క్వారంటైన్‌లోకి పంపిస్తారు.”

కొరోనా అనే వైరస్‌ ఇప్పుడు ఎలాంటి వివక్షతలను పాటించకుండా సకల జనావళిని   భీభత్స సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది.మానవ జీవితం తో ముడిపడి ఉన్న సమస్త వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నది. ఈ వైరస్‌ ‌పుట్టుక వ్యాప్తి నియంత్రణ నివారణ కు సంబందించిన వార్తలు చదువు తున్నప్పుడు, వింటున్నప్పుడు అనేక వైద్య శాస్త్ర పరిభాష పదాలు చోటు చేసుకుంతున్నాయి.సాధారణ పౌరులతో పాటు సగటు విద్యావంతులకు ఆ పదాలలో నిబిడీకృతమైన అర్ధం వివరణ అవగతం అవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొరోనా లేదా సాంక్రమిక వ్యాధులలో విరివిగా ఉపయోగించే సాంకేతిక పదకోశంలోని ముఖ్య పదాలను తెలుసుకుందాము.
కొవిడ్‌ -19 (covid-19) ఫిబ్రవరి 11, 2020 నా ప్రపంచ ఆరోగ్య సంస్థ covid-19 పదమును ప్రతిపాదించింది. కొరోనా వైరస్‌ ‌ను,కొరోనాను డీ డీసీజ్‌ అనగా వ్యాధిని సూచిస్తుంది. వైరస్‌ ‌పుట్టిన ప్రాంతానికి లేదా దేశానికి కళంకిత భావనను రానివ్వకుండా చేయడానికి వాటి ఆధారంగా జరిగే నామకరణ విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరిస్తుంది ఇంటర్నేషనల్‌ ‌కమిటీ ఆన్‌ ‌టాక్సానామి ఆఫ్‌ ‌వైరస్‌ ‌వారు 2003లో చైనా ఆగ్నేయాసియా దేశాలలో అకస్మాత్తుగా వ్యాపించిన సీవియర్‌ అక్యూట్‌ ‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌ SARS))అనే సార్స్ ‌వైరస్‌ ‌ను జన్యుపరంగా పోలి ఉన్నందున కోవిడ్‌-19 ‌కు సార్స్- ‌కోవ్‌ -2 అని నామకరణం చేశారు. ఎపిడమిక్‌ – ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో లేదా నిర్దిష్ట సముదాయానికి ఒక సాంక్రమిక వ్యాధికి సంబంధించిన సంఘటనలు అనూహ్యంగా వ్యాప్తి చెందే ప్రక్రియను ఎపిడమిక్‌ అం‌టారు .ఉదాహరణకు కరోనావైరస్‌ ‌చైనా లోని హుబే  ప్రావిన్స్ ‌లోని వూహన్‌ ‌నగరంలో మొదటగా వ్యాప్తి చెందడం. పాండమిక్‌ – ‌దీనినే తెలుగులో మహమ్మారిగా పిలుస్తారు.సాంక్రమిక వ్యాధులు వ్యాధి జనకాలు అనేక ఖండాలలో, దేశాలలో అతి వేగంగా వ్యాప్తి చెందే దృగ్విషయం ను పాండమిక్‌ అం‌టారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిగా మారింది.

కమ్యూనిటీ ట్రాన్స్ ‌మిషన్‌
‌సాంక్రమిక వ్యాధి ఎవరి నుండి ఎవరికి సంక్రమించిందో కనుక్కోవడం అసాధ్యమైన స్థితిని కమ్యూనిటీ ట్రాన్స్ ‌మిషన్‌ అం‌టారు. వ్యాధిని అంటించిన వ్యక్తిని కనుగొనడం సాధ్యం కాదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వైరల్‌ ‌వ్యాధిగ్రస్తుల స్థితిని తెలియచేస్తుంది. కాంటాక్ట్ ‌ట్రెసింగ్‌- ‌సాంక్రమిక వ్యాధికి లోనైన వ్యక్తితో కలిసి తిరిగిన, మాట్లాడిన వ్యక్తులను గుర్తించడాన్ని కాంటాక్ట్ ‌ట్రెసింగ్‌ అం‌టారు.వీరిని  క్వారంటైన్‌లోకి పంపిస్తారు.
=శీ – దీనిని ఆర్‌ ‌నాట్‌ ‌లేదా ఆర్‌ ‌జీరో అని పిలుస్తారు.ఇది కనీస ప్రత్యుత్పత్తి రేటును తెలియచేస్తుంది.ఒక నిర్దిష్ట కాల ప్రమాణంలో వ్యాధి విస్తరణను తెలియచేస్తుంది. – ఒకటి కంటే తక్కువగా ఉంటే జనాభాలో వ్యాధి ప్రబలడం ప్రారంభమయ్యిందని తెలియచేయస్తుంది.వైరస్‌ ‌సోకిన వ్యక్తి జనాభా లో ఇతరులకు వ్యాధిని అంటించే సామర్ధ్యాన్ని సూచిస్తుంది.ఆర్‌వో-2 విలువ  ఉంటే ఒక రోగి మరో ఇద్దరికి వ్యాధిని సంక్రమణ చేస్తున్నాడని అర్ధం.ప్రస్తుతం భారత్‌లో ఆర్‌ ఓ ‌విలువ 1.22 ఉంది. కోమార్బిడిటీస్‌ –  ‌నియంత్రణలో లేని మధుమేహం, హైపర్‌ ‌టెన్షన్‌ ,‌క్యాన్సర్‌, ‌స్థూలకాయం ,ఊపిరితిత్తుల వ్యాధులు అది నిరోధకత్వాన్ని తగ్గించి వైరల్‌ ‌వ్యాధులకు లోనయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి.  వీరికి సోకకుండా కాపాడుకోవడం సోకినవారిలో మరణాల రేటును తగ్గించడం  వైద్య వ్యవస్థలు ప్రత్యేక దృష్టిని సారిస్తాయి.

ట్రాన్స్ ‌మిషన్‌ –  ‌సాంక్రమిక వ్యాధులు వ్యాప్తి చెందే విధానమును ట్రాన్స్ ‌మిషన్‌ అం‌టారు. కోవిడ్‌ – 19 ‌శ్వాస సంబంధ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు దగ్గినప్పుడు చీదినప్పుడు వెలువడే ద్వారా వైరస్‌ ఇతరులకు సోకుతుంది మాస్కులు ధరించడం ,భౌతిక దూరం పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్‌ ‌ను దరిచేరకుండా చేసుకోవచ్చును. సూపర్‌ ‌స్ప్రెడర్‌•వైరల్‌ – ‌వ్యాధికి లోనైన వారిలో కొందరు అధిక మోతాదులో ఇతరులకు వ్యాధిని అంటించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరిని సూపర్‌ ‌స్ప్రెడర్స్ అం‌టారు. పాజిటివిటి రేటు –  వైరల్‌ ‌వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన వారిలో పాజిటివ్‌ ‌వచ్చిన వారి సంఖ్య ను పాజిటివిటి  రేటు అంటారు. ఇన్‌ ‌ఫెక్షన్‌ ‌ఫేటాలిటీ రేటు –  నిర్దిష్ట జనాభాలో వైరల్‌ ‌వ్యాధి సోకిన మరియు సోకని వారిలో సంభవించే మరణాల సంఖ్యను తెలుపుతుంది.కేసు ఫెటాలిటీ రేటు –  వైరల్‌ ‌వ్యాధి సోకిన వారిలో సంభవించే మరణాల రేటును తెలియజేస్తుంది.  కొవిడ్‌-19 ‌ద్వారా కలిగే వ్యాధి ని సీవియర్‌ అక్యూట్‌ ‌రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ అని పిలుస్తారు.

సైటకోన్‌ ‌స్టార్మ్ ‌వైరస్‌ – ‌సంక్రమణ చెందినప్పుడు శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ సైటకోన్‌ అనే ప్రత్యేక ప్రోటీన్లను విడుదల చేస్తుంది ఇవి వైరస్‌ ‌ప్రభావాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉంటాయి. వైరస్‌ ఇం‌కా ఎక్కువ మోతాదులో తుఫాను ప్రవాహంగా సైటకోన్స్ ‌మరియు ఇతర ప్రతి దేహాలు విడుదలవుతాయి. ఇవి దూకుడును పెంచి  చెల రేగిపోయి వైరస్లను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. అయితే ఇదే క్రమంలో  దేహంలోని మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండెపై దాడి చేసి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా మరణం సంభవిస్తుంది. ఈ ప్రక్రియలో జరుగుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది రక్త ప్రవాహం తగ్గుతుంది ఆక్సిజన్‌ ‌వినియోగం తగ్గుతుంది ఆక్సిజన్‌ అం‌దక సకల వ్యవస్థలు దెబ్బతింటాయి ఒక రకంగా చెప్పాలంటే వైరస్‌ ‌కంటే వాటిని ఎదుర్కోవడానికి విడుదలయ్యే సైటకోన్‌ ‌తుఫాన్‌ ‌వల్ల మరణం కలుగుతుంది.
RT-PCR-దీని విస్తరణ రూపం రివర్స్ ‌ట్రాన్స్ ‌క్రిప్టెజ్‌ ‌పాలిమరేజ్‌ ‌చైన్‌ ‌రియాక్షన్‌.‌కొవిడ్‌ -19 ‌ని నిర్ధారించే పరీక్ష.ఈ వైరస్‌ ‌రైబో న్యూక్లిక్‌ ఆమ్లం ను కలిగి ఉంటుంది.  ప్రక్రియ ద్వారా దీనిలోని జన్యుక్రమానికి సంపూరకంగా డి యన్‌ ఏ ‌తయారవుతుంది.జన్యుక్రమం పొలిఉంటే కొవిడ్‌ ‌పాజిటివ్‌ ‌గా నిర్ధారిస్తారు.  ఆంటిబాడీ పరీక్షలు –  రక్తంలో నిర్దిష్ట వ్యాధిని కలిగించే వ్యాధి జనకం ను నిరోదించే ప్రతిదేహాలను గుర్తించే పరీక్ష. కన్వాలసెంట్‌ ‌ప్లాస్మా థెరపీ-కొవిడ్‌ ‌వైరస్‌ ‌నుండి కోలుకున్న వ్యక్తి నుండి సేకరించిన ప్రతిదేహాలను కలిగి ఉన్న ప్లాస్మాతో కొవిడ్‌ ‌రోగులను నయం చేసే పద్ధతి.

హైడ్రాక్సిక్లోరొక్వీన్‌ – ‌నోటి ద్వారా స్వీకరించే మలేరియా డ్రగ్‌. ‌కొవిడ్‌ ‌నియంత్రణలో ఈ డ్రగ్‌ ‌ప్రభావం పై ప్రయోగాలు జరుగుతున్నాయి.దీని ఫలితాలు అంతటా ఒకే రకంగా లేవు. ప్లాటనింగ్‌ ‌కర్వ్ ‌కరోనా ఉధృతి ని తగ్గించే ప్రక్రియ.ఎగసిపడుతున్న కొరోనా సోకిన రోగులకు చికిత్సఇవ్వడానికి  తగిన ఆరోగ్య వ్యవస్థలు లేనప్పుడు లాక్‌డైన్‌, ‌షట్‌డౌన్‌•లతో వ్యాప్తి చెందే వేగాన్ని తగ్గించే ప్రక్రియను ప్లాటనింగ్‌ ‌కర్వ్ అం‌టారు.
హెర్డ్ ఇమ్యునిటి – జనాభాలో కొవిడ్‌ ‌సోకినా వ్యాధి నిరోధకతతో తట్టుకోవడాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు.ఇది సహజంగా గాని, వాక్సినేషన్‌ ‌ద్వారా కలుగుతుంది. PPE(PERSONAL PROTECTIVE EQUIPMENT)-
కోవిడ్‌-19 ‌సోకిన వారికి చికిత్సను అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ధరించడానికి ప్రత్యేక వస్త్రంతో రూపొందించిన దుస్తులు. సానిటైజర్స్-‌ప్రోపనాల్‌, ఇథనాల్‌ ‌వంటి ఆల్కహాల్స్ ‌తో తయారు చేస్తారు. ఇవి వైరస్‌ ‌ల కవచాలను విచ్చిన్నం చేస్తాయి.వీటితో చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్‌ ‌లు నశిస్తాయి.
వెంటిలేటర్‌ ‌సార్స్ ‌వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువైనప్పుడు శ్వాస తీసుకోవడంలో ఉపయోగపడే నాసిక నోరు వాయుగొట్టం పని చేయనప్పుడు ఆక్సిజన్‌ ‌ను ఉపిరితిత్తులలో ప్రవేశపెట్టే వైద్య పరికరం..చికిత్సవిధానంలో అంతిమ దశ .ఒక అధ్యయనం ప్రకారం వెంటిలేటర్‌ ‌చికిత్సలో కోలుకున్న వారి శాతం కేవలం 11.9% మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరగని బీభత్స భయానహా పరిస్థితిని సృష్టిస్తున్న కోవిడ్‌19 ‌ను శాస్త్రీయ అవగాహనతో ఎదుర్కొం దాము.ఆవరణ వ్యవస్థ అనుకూల జీవన విధానాన్ని నిత్య జీవితంలో భాగం చేద్దాము. చరిత్ర ప్రగతి శీలకరమైంది. మనమంతా క్రమ శిక్షణ పట్టుదల శాస్త్రీయ వైఖరులతో మెలిగి కోవిడ్‌19 ‌పై జయభేరిని మోగిద్దాము.

Asnala srinivas
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం
9652275560

Leave a Reply