Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ 19 – ‌దంత రోగులు, దంత వైద్య నిపుణులు తీసుకోవలసిన జాగ్రత్తలు – నియమాలు

నావల్‌ ‌కొరోనా వైరస్‌, ‌డిసెంబర్‌ 19, 2019 ‌లో చైనా లోని వ్యూహాన్‌ ‌నుండి ప్రారంభమై అంతర్జాతీయంగా  ఒక సవాలుగా, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారింది. వైరస్‌ ‌మరింతగా వ్యాప్తి చెంద కుండా నివారించడానికి, వ్యాధి పరిస్థితిని నియంత్రించడంలో సహాయపడడానికి సంక్రమణ, నియంత్రణ చర్యలు అవసరం. కోవిద్‌-19  ‌ప్రభావిత ప్రాంతాలలో దంత వైద్య విధానాలు, ఆసుపత్రుల కోసం కఠినమైన, సమర్థవంతమైన సంక్రమణ, నియంత్రణ, నిర్వహణ నియమాలు అత్యవసరం. కోవిద్‌-19 అదుపులోకి వచ్చే వరకు సాధారణ వైద్య విధానాలన్నీ నిలిపి  వేయబడ్డాయి.  నోటి ఆరోగ్యం, దంత వ్యాధుల లక్షణాల కారణంగా, దంత వైద్యులు సహాయకులు దంత రోగుల మధ్య క్రాస్‌ ఇన్ఫెక్షన్‌ ‌ప్రమాదం చాలా ఎక్కువగా వుండే అవకాశం వుంది. ప్రధానంగా శ్వాసకోశ బిందువులు తాకడం వల్ల, బదలీ ద్వారా సంభవించే వ్యాధులు అంటే వ్యక్తుల మధ్య పరస్పర బదలీ ద్వారా వ్యాధులు సంక్రమించడానికి అవకాశం వుంది.
ఈ సమయంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నివారించడం, సిబ్బందిని రక్షించడం, వ్యక్తిగత సంరక్షణ పరికరాలు ((PPE) వినియోగించడం, కోవిద్‌-19 ‌సంక్రమణ ఫై అనుమానాలు వచ్చినపుడు, ఆరోగ్య సంరక్షణ సమయంలో సంక్రమణ, నివారణ ల ఫై మార్గదర్శకాలు అవసరం. కొవిడ్‌ -19 ‌వ్యాధి వ్యాప్తి అవుతున్న కాలంలో దంత సేవలను అందించడంపై ఇప్పటివరకు ఏకాభిప్రాయం లేదు. దంత వైద్యులు  వ్యక్తిగత రక్షణ చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు బిందువులు, తుంపరలును ((aerosols)) విడుదలచేసే శస్త్ర చికిత్సలను  నివారించాలి.
కోవిడ్‌ -19 ‌రోగ లక్షణాలున్న  రోగులు రోగ వ్యాప్తికి ప్రధాన వనరులు. ఇటీవలి పరిశీలనలలో లక్షణాలు లేని వ్యక్తులు, ఇంక్యూబేషన్‌ ‌పీరియడ్‌ ‌లో వున్న వారిని కూడా వాహకాలుగా పరిగణిస్తున్నాము. కోవిడ్‌ ‌రోగులలో చాలా మంది జ్వరం, పొడి దగ్గు తో భాధపడుతుంటారు. మరికొందరు ఊపిరి సల్పకపోవడం, అలసట, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి ఇతర లక్షణాలను కూడా కలిగి వుంటారు. రోగుల సగటు వయస్సు 49 మరియు 56 సంవత్సరాల మధ్య ఉంటుంది. పిల్లలలో ఈ వ్యాధి ప్రబలడం అరుదుగా కనిపిస్తున్నప్పటికీ వ్యాధి సోకె ప్రమాదం ఎక్కువే. రక్త పీడనం ((B.P.),.), మధుమేహం (Diabetes) కలిగిన రోగులు ఈ వ్యాధి గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణ చరిత్ర వున్నవారు, చైనా దేశానికి ప్రయాణించి ఉన్నవారు, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ ‌లో వున్న వ్యక్తిగా పరిగణించాలి. అలాంటి వ్యక్తులను వెంటనే ఆరోగ్య సంరక్షణ కోసం, సంక్రమణ నియంత్రణ కోసం స్థానిక వైద్య అధికారులకు తెలియపరచాలి.

దంత పరీక్షలు – వ్యాధి సంక్రమణను నియంత్రిచడం:
ఆసుపత్రి వాతావరణం ద్వారా  సంక్రమణ – ప్రమాదం  (Nosocomial Infection)దగ్గు, తుమ్ములతో బాధ పడే దంత రోగులకు హై స్పీడ్‌ ‌హ్యాండ్‌ ‌పీస్‌  ‌లేదా అల్ట్రా సోనర్‌  ‌పరికరాల వాడకం ద్వారా చికిత్సను చేస్తున్నపుడు లాలాజలం, రక్తం తుప్పిరులు (Aerosols) పరిసరాలకు వ్యాపిస్తాయి. దంత ఉపకరణాలను వినియోగించిన తర్వాత వివిధ వ్యాధి కారక సూక్ష్మ జీవులతో కలుషితం కావచ్చు. లేదా క్లినిక్‌ ‌కలుషితమైన వాతావరణానికి గురికావచ్చు. ఆ తర్వాత పదునైన పనిముట్లను వినియోగించడం వల్ల,  శ్లేష్మ పొరలు, కలుషితమైన చేతుల ద్వారా వివిధ రకాల వ్యాధులు సంభవిస్తాయి. వైరస్‌ ‌లు భూమి ఉపరితలం రకంను బట్టి, ఉష్ణోగ్రత, గాలిలో తేమను బట్టి, కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల వరకు భూ ఉపరితలంపై జీవించివుండే అవకాశం వుంది. అందువల్ల క్లినిక్‌ ‌ను  క్రిమి సంహారులతో  స్టెరిలైజ్‌ ‌చేయాలి. ప్రత్యేకమైన దంత ప్రక్రియల కారణంగా, ఎక్కువగా తుంపరలు, బిందువులు, ఉత్పత్తి చేయబడతాయి. ప్రస్తుతం వైద్యశాలలలో, క్లినికల్‌ ‌వర్కులో ప్రామాణిక రక్షణ చర్యలు తగినంతగా లేవు అని చెప్పవచ్చు. కానీ కోవిడ్‌ -19 ‌వ్యాధి వ్యాప్తి నివారణలో, ముఖ్యంగా రోగులు ఇంక్యూబేషన్‌ ‌పీరియడ్‌ ‌లో వున్నపుడు వ్యాధి సోకినట్లు తెలియదు. కాబట్టి అవసరమైన ప్రభావవంతమైన, ప్రామాణిక చర్యలు తీసుకోవడం అత్యవసరం.

ప్రభావవంతమైన సంక్రమణ నియంత్రణ – నిర్వహణ నియమాలు
కొరోనా వైరస్‌ ‌మహమ్మారి వ్యాప్తి చెంతుతున్న కాలంలో ప్రతి వ్యక్తి ఉష్ణోగ్రతలను కొలవడం, రికార్డు చేయడం, ఒక సాధారణ ప్రక్రియగా దంత వైద్యశాలలలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కోవిడ్‌ -19 ‌వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలలో అత్యవసరమైన, తీవ్రమైన బాధతో వున్నరోగులకు విద్య సేవలను అందించాలి,  మిగతావాటిని వాయిదా వేయాలి.
నోటిని పరీక్షించడం (Oral Examination)) రోగి నోటిని పరీక్షించే ముందు, శస్త్ర చికిత్సకు ముందు  సూక్ష్మ జీవ నాశకాలతో నోటిని శుభ్రం చేయడం వల్ల నోటి కుహరంలోని సూక్ష్మ జీవులను నశింపచేయవచ్చు. దగ్గును ప్రేరేపించే విధానాలని నివారించాలి. తుంపర్లని ఉత్పత్తి చేసే 3 వే సిరెంజి వంటి విధానాల వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించాలి. ఇంట్రా ఓరల్‌ ఎక్స్ – ‌రే(Intra Oral X – Ray ) పరీక్ష డెంటల్‌ ఇమేజింగ్‌ ‌లో అత్యంత సాధారణ రేడియోగ్రాఫిక్‌ ‌విధానం. కానీ ఇది లాలాజల స్రావాన్ని, దగ్గు ను ప్రేరేపిస్తుంది. అందువల్ల పనోరమిక్‌  ‌రేడియోగ్రాఫ్స్ ‌మరియు కానీ భీం సి. టి. వంటి ఎక్సట్రా ఓరల్‌ ‌డెంటల్‌ ‌రేడియోగ్రాఫ్‌, ‌కోవిడ్‌ – 19 ‌వ్యాప్తి సమయంలో తగిన ప్రత్యామ్నాయాలు.
చేతి – పరిశుభ్రత  (Hand — Hygiene)సూక్ష్మ జీవులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి చేతి పరిశుభ్రత ఒక అత్యంత ముఖ్యమైన విధానంగా పరిగణించబడుతుంది. క్లినిక్‌ ‌కు వచ్చే వ్యక్తులు చేతులను శుభ్రం చేసుకునే విధంగా హ్యాండ్‌ ‌వాష్‌ ‌ను, శానిటైజర్‌ ‌ను అందుబాటులో ఉంచాలి. వైద్యులు కూడా ప్రతి రోగిని పరీక్షించిన అనంతరం చేతి పరిశుభ్రత పద్దతులను పాటించాలి.
వ్యక్తిగత రక్షణ పరికరాలు (Personnel Protective Equipment – PPE))ముసుగులు, చేతి తొడుగులు, గౌన్స్, ‌గాగుల్స్ , ‌పేస్‌ ‌షీల్డస్ ‌తో సహా వ్యక్తిగత రక్షణ పరికరాల వాడకం చాలా అవసరం. చర్మం, శ్లేష్మం సోకినా రక్తం, రక్త స్రావం నుండి రోగ వ్యాప్తిని నిరోధించడానికి ఇవి సిఫారసు చేయబడ్డాయి. వైరస్‌ ‌వ్యాప్తి ప్రసారం ప్రధానంగా శ్వాసకోశ బిందువులు కాబట్టి దంత వైద్యం కోసం నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ‌ఫర్‌ ఆక్యుపేషనల్‌ ‌సేఫ్టీ • హెల్త్ ‌నిర్ధారించిన,FFP• 2 ప్రామాణిక ముసుగులు, ప్రామాణీకరించిన N- 95 ముసుగులు సిఫారసు చేయబడ్డాయి.
నాలుగు చేతుల విధానం  (Four Handed Technique)వ్యాధి సంక్రమణము నియంత్రించడానికి నాలుగు చేతుల విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. లాలాజల ఎజెక్టర్లను ఉపయోగించడంలో ఎక్కువగా ఈ విధానం ఉపయోగించడం వల్ల బిందువులు, తుంపర్ల ఉత్పత్తిని తగ్గించవచ్చు.
అత్యవసర కేసులు – చికిత్స Treatment of Emergency Cases)దంత అత్యవసర కేసులు తక్కువే కానీ తక్కువ వ్యవధిలో మరింత తీవ్ర తరం అవుతుంది. అందువల్ల తక్షణ చికిత్స అవసరమౌతుంది. రబ్బర్‌ ‌డ్యామ్స్ ((Rubber Dams) మరియు అధిక పరిమాణం కల లాలాజల ఎజెక్టర్లు, దంత ప్రక్రియలో ఏరోసోల్స్ ‌ను చెదరగొట్టడానికి సహాయపడతాయి. ఇంకా వాటర్‌ ‌స్ప్రే , స్పీడ్‌ ‌డ్రిల్లింగ్‌ ‌వాడకంలో పేస్‌ ‌షీల్డస్ , ‌గాగుల్స్ అవసరపడతాయి.

కోవిడ్‌ -19 ‌వ్యాధి వ్యాప్తి సమయంలో పిప్పి పన్ను ((Carious teeth)) గల వ్యక్తి తీవ్రమైన నొప్పిని కలిగి ఉండి, కోలుకోలేని పాల్పిటిస్‌ (pulpitis) ) గా రోగ నిర్ధారణ అయితె రబ్బర్‌ ఐసొలేషన్‌ ‌కింద కేమో – మెకానికల్‌ ‌క్షయాల తొలగింపుతో గుజ్జును బహిర్గతం చేయవచ్చు. మరియు లోకల్‌ అనేస్తేషియా, తక్కువ లేదా అధిక పరిమాణం లాలాజల ఎజెక్టర్‌ ‌నొప్పిని తగ్గించి, గుజ్జును డి వైటలైజషన్‌ ((devitalization)చేసి, నింపే పదార్థాన్ని డి వైటలైజింగ్‌ ఏజెంట్‌ ‌లేకుండా సున్నితంగా భర్తీ చేయవచ్చు.
దంత పగుళ్లు, లక్షెషన్‌ (luxation) లేదా అవుల్సిన్‌ ((avulsion) కు చికిత్స రోగి వయస్సు, దంత కణజాల బాధ తీవ్రత, దంతాల అవుల్సిన్‌  (avulsion)) వ్యవధి ఫై ఆధారపడి ఉంటుంది. దంతాలను తీయాల్సి వస్తే కుట్లకు ((Sutures)) ప్రాధాన్యత ఇవ్వవలసివస్తుంది. నోటిలోని మృదుకణజాల సంక్రమణ వున్న రోగులకు కణజాలంను తీసివేసి,  (debridement) )  శుభ్రపరచి, కుట్లు(suturing) వేయాలి. గాయాన్ని నెమ్మదిగా కడిగి, పిచికారీ (•జూతీ••) చేయకుండా ఉండడానికి లాలాజల ఎజేక్టార్‌ ‌ను ఉపయోగించడం  శ్రేయస్కరం.
దంత విద్య – సిఫారసులు: (Recommendations for Dental Education)వైద్య, దంత కళాశాలలకు, వాటి అనుబంధ ఆసుపత్రులకు విద్యకు సంబంధించిన సవాళ్లు ముఖ్యమైనవి. విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలన సిబ్బంది మధ్య తరచూ సంభాషణలు పరస్పర విశ్వాసాన్ని పెంచుతుంది. మరియు తగిన సహకారాన్ని సులభతరం చేస్తుంది.
ప్రస్తుత సంక్రమణ నియంత్రణ ను, అంటువ్యాధుల గురించి మనం నిరంతరం తెలుసుకోవాలి. ముఖ్యంగా నూతన దంత విద్య విధానాలు, పద్ధతులు గురించి తెలుసుకోవాలి. కొన్ని వైరస్‌ ‌జాతులు లాలాజలంతో 29 రోజులవరకు ఉంటాయి.

SARS మరియు సంబంధిత అత్యంత వ్యాధికారక అంటువ్యాధుల సమయంలో అనుసరించవలసిన ప్రాధమిక విషయాలు:
– ప్రతి రోగిని లక్షణాలు లేకపోయినప్పటికీ సూక్ష్మంగా పరిశీలించాలి.
– ప్రతి రోగిని సంభావ్య లక్షణ రహిత కోవిడ్‌ – 19 ‌కారియర్‌ ‌గ పరిగణించాలి
– కోలుకున్న రోగులను, రికవరీ నిర్ధారణ తర్వాత కూడా 30 రోజులు సంభావ్య వైరస్‌ ‌కారియర్స్ ‌గ పరిగణించాలి.
– రోగి యొక్క అత్యవసర అవసరాన్ని గుర్తించాలి: తక్కువగా హానికర విధానాలతో నిర్వహించడంపై దృష్టి సారించాలి.
– అవసరమైన చికిత్స యొక్క ఆవశ్యకత మరియు చికిత్సకు సంబంధించిన ప్రమాదం, ప్రయోజనం ప్రకారం చికిత్సను వర్గీకరించడం
– ప్రతి రోగికి అవసరమైన దంత చికిత్స, ఆ చికిత్సలో కలిగే నష్టాలు, ప్రయోజనాలు తెలపడం
– వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE)) వినియోగించడం
చికిత్స – పరిగణలు:  (Treatment Considerations)- ఇంట్రా ఓరల్‌ ఇమేజింగ్‌ ‌ని పరిమితం చేయాలి. అధిక లాలాజలంను తగ్గించడానికి ఎక్స్ట్రా ఓరల్‌ ‌రేడియోగ్రాఫ్‌ ‌లను ఉపయోగించాలి. ఇంట్రా ఓరల్‌ ‌రేడియోగ్రాఫ్లతో సంబంధంవున్న గాగ్‌ ‌రీఫ్లక్స్  (gogreflux)) లను వినియోగించాలి.
– దంత ప్రక్రియకు ముందు కనీసం 15 సెకండ్ల వరకు 0.23 % పోవిడోనే – అయోడిన్‌ ‌మౌత్‌ ‌వాష్‌ ( (Povidone – Iodine Mouth Wash)) ఉపయోగించడం వల్ల రోగి యొక్క లాలాజలం లో వైరల్‌ ‌లోడ్‌ ‌ను తగ్గించవచ్చు.
– క్రాస్‌ ఇన్ఫెక్షన్‌ ‌రిస్క్ ‌ను తగ్గించడానికి, ఒకేసారి వినియోగించే సాధనాలను, డిస్పోసబుల్స్ ‌ను సాధ్యమైనపుడల్లా వినియోగించాలి.
– రబ్బర్‌ ‌డాం ను సాధ్యమైనపుడల్లా వాడడం మూలంగా సూక్ష్మజీవుల వ్యాప్తిని తగ్గించవచ్చు.
– దంత చికిత్సలు సాధ్యమైనంత తక్కువ హానికరంగా ఉండాలి.
– తుంపరలు (aerosols) ఉత్పత్తిచేసే విధానాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
– నొప్పి తీవ్రమైనపుడు, కోవిడ్‌ -19 అనుమానిత రోగులకు ఇబోప్రోఫెన్‌ ‌ను నివారించాలి. ఎందుకనగా ఇబోప్రొఫైన్‌ ‌శ్వాస కోశ పరిమాణంను తక్కువ చేస్తుంది.
– కోవిడ్‌ -19 ‌మహమ్మారి వ్యాప్తి సమయంలో దంత కార్యకలాపాలు వాయిదా వేయడం ఉత్తమం.. అత్యవసర చికిత్సలను మాత్రమే చేయాలి.
– దంత వైద్యంలో 4 దశలు కీలకమైనవి. రోగికి చికిత్స (Triage), రోగులు లోనికి రావడం, దంత చికిత్స మరియు చికిత్స తర్వాత నిర్వహణ.
– ఈ వైరస్‌ ‌వ్యాప్తిలో దంత వైద్యం, దంత సంరక్షణ యొక్క చాలా అంశాలను అందించడం కష్టం. అందువల్ల దంత వైద్యశాలలు మూసివేయబడ్డాయి.
లక్షణాలు లేని రోగులు కూడా వైరస్‌ ‌వ్యాప్తి చేసే అవకాశాలుంటాయి. ఇంకా దంత చికిత్స సమయంలో వైద్యులు, రోగుల మధ్య శారీరక దూరం ఉన్నప్పటికీ, దంత వైద్యులు, సహాయకులు అనుకోకుండానే వాహకులు ((Vectors) కావచ్చు.
ప్రస్తుత వైరస్‌ ‌వ్యాప్తి కాలంలో దంత సమస్యలున్నా చాలా మందికి వీడియో లేదా ఫోన్‌ ‌ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ విధమైన  వాస్తవిక సంప్రదింపులు (virtual consultations)) దంత వైద్యులకు, దంత సమస్యలను సురక్షితంగా పరీక్షించే అవకాశాన్ని కల్పిస్తాయి. రోగులు తమ ఇళ్లను, సౌలభ్యతను, భద్రతను వదలకుండా దంత నొప్పి, సంక్రమణ యొక్క తాత్కాలిక స్వీయ నిర్వహణ కోసం సలహాలను అందించడం జరుగుతుంది. చివరగా, ఈ మహమ్మారి సమయంలో , ముగిసిన తర్వాత కూడా సాధారణ వైద్యానికి కొంతకాలం వరకు వేచివుండాల్సిందే.
ఈ సమయంలో ఫ్లోరైడ్‌ ‌టూత్‌ ‌పేస్ట్ ‌తో రోజుకు రెండు సార్లు బ్రష్‌ ‌చేయడం ద్వారా మీ నోటిని జాగ్రత్తగా చూసుకోవడం, ఆరోగ్యంగా ఉండడం అవసరం. భోజన సమయంలో చెక్కెర, తీపిని తినే అలవాటును మానుకోవాలి.  ఇది ఫిల్లింగ్స్ ‌కు, పగుళ్ళకు కారణం కావచ్చు. దంతాలతో మూతలు  తెరవడం, కఠినంగా వుండే , పళ్లకు అంటుకునే ఆహారాన్ని నమలడం, నోటికి రక్షణ కవచాలు లేకుండా శారీరక క్రీడలు ఆడడం, ప్రమాదకర కార్యకలాపాలను నిర్వహించడం వంటివి చేయరాదు. ఈ చిన్న చిన్న చిట్కాలు ప్రతి ఒక్కరికి దంత సంరక్షణలో దోహదపడతాయని భావిద్దాం.

డా. సి.హెచ్‌. ‌రమ్యశ్రీ, ప్రాక్టీసింగ్‌ ‌డెంటిస్ట్, ‌హనంకొండ, వరంగల్‌.

Leave a Reply