Take a fresh look at your lifestyle.

ఆక్స్‌ఫర్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రెండోదశ క్లినికల్‌ ‌ట్రయల్స్

‌సరీం ఇండియాతో కలసి ప్రారంభించే అవకాశాలు

కొరోనాతో సతమతమవుతున్న భారతీయులకు ఓ శుభవార్త అందనుంది. క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌విజయవంతమైతే ఈ ఏడాది చివరి నాటికి అత్యంత సమర్థవంతమైన టీకాల్లో ఒకటిగా భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్ ‌వ్యాక్సిన్‌ ‌భారత్‌లో కొవిషీల్డ్ అం‌దుబాటులోకి రానుంది. సీహెచ్‌ఏడీఓఎక్స్ 1‌గా పిలిచే ఈ ఆక్స్‌ఫర్డ్ ‌టీకా రెండో క్లినికల్‌ ‌ట్రయల్స్‌ను దేశీయ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా ఈ వారంలో ముంబైలోని కేఈఎం, నాయర్‌ ‌దవాఖానల్లో ప్రారంభించనుంది. కొవిడ్‌-19‌ను అడ్డుకునే సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రీయ ప్రయత్నంలో ఆక్స్‌ఫర్డ్ ‌జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆక్స్‌ఫర్డ్ ‌గ్రూప్‌ ‌పరిశోధకులు ముందంజలో ఉన్నారు.
చింపాంజీ అడెనోవైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వెక్టర్‌ అయిన సీహెచ్‌ఏడీఓఎక్స్1 ‌వ్యాక్సిన్‌ ‌కొవిడ్‌-19 ‌కు వ్యతిరేకంగా పనిచేయగల ఆశాజనక టీకాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఎస్‌ఐఐ ‌దేశంలోని 17 సైట్లలో 18 ఏళ్లు పైబడిన 1,600 మందిపై ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసి పంపిణీ చేసేందుకు పుణెకు చెందిన ఎస్‌ఐఐ ‌బిట్రీష్‌ ‌డ్రగ్‌ ‌దిగ్గజం ఆస్టాజ్రెన్‌కాతో ఒప్పందం చేసుకుంది. అలాగే, భారతదేశం, తక్కువ ఆదాయంగల దేశాలకు 100 మిలియన్‌ ‌మోతాదుల సంభావ్య కొవిడ్‌-19 ‌వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ పక్రియను వేగవంతం చేసేందుకు ఇటీవల  బిల్‌ / ‌మెలిండా గేట్స్ ‌ఫౌండేషన్‌, ‌మరియు గవి సంస్థలతో ఎస్‌ఐఐ అ‌గ్రిమెంట్‌ ‌కుదుర్చుకుంది. 2020 చివరి నాటికి 400 మిలియన్‌ ‌మోతాదుల ఆక్స్‌ఫర్డ్ ‌వ్యాక్సిన్‌ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు ఎస్‌ఐఐ ‌వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply