Take a fresh look at your lifestyle.

ఆగస్టులో పిల్లలకు కోవిడ్‌ ‌టీకా ..!

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ ‌మాండవియా

ఆగస్టు నెల మొదట్లో 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్‌-19 ‌టీకాలు అందుబాటులోకి వొస్తాయని, ఈ టీకా ఆమోదం పొందిన తరువాత పిల్లలకు టీకా వేసే విధానాన్ని రూపొందిస్తామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వొచ్చే నెల పిల్లలకు ప్రభుత్వం కోవిడ్‌ -19 ‌కు టీకాలు వేయడం ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ ‌మాండవియా మంగళవారం నిర్వహించిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు.  టీకా ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరిస్తుందని, మరిన్ని కంపెనీలకు టీకా ఉత్పత్తి లైసెన్సులు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు.

డీఎన్‌ఏ ‌టీకాలను అభివృద్ధి చేస్తున్న జైడస్‌ ‌కాడిలా, 12-18 ఏళ్లలోపు వారిపై పరీక్షలను ముగించిందని, చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి, సమీప భవిష్యత్తులో ఈ పిల్లల టీకా అందుబాటులోకి రావొచ్చని కేంద్రం తెలిపింది. అలాగే, 2-18 ఏళ్ళ వయసు వారికి క్లినికల్‌ ‌టీకా ట్రయల్స్ ‌నిర్వహించడానికి కోవాక్సిన్‌ ‌తయారీదారు భారత్‌ ‌బయోటెక్‌కు డ్రగ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఫైజర్‌ ‘ఎం ఆర్‌ఎన్‌ఏ’ ‌టీకా 12-15 సంవత్సరాల వయస్సులో ఉన్న కౌమారదశలో వాడటానికి యూరోపియన్‌ ‌యూనియన్‌లో పరీక్షించబడింది మరియు ఆమోదించబడింది. ఏదేమైనా, పిల్లలలో ఇంకా పరీక్షించబడుతున్న కోవాక్సిన్‌ ‌తయారీకి భారతదేశ స్వదేశీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. ఇలా ప్రభుత్వం యోచించటానికి కారణం ఫైజర్‌-‌బయోఎంటెక్‌ ‌టీకా సరఫరా పిల్లల కోసం పూర్తిగా ఉపయోగించినప్పటికీ అవసరానికి చాలా తక్కువగా ఉంటుందని ప్రభుత్వ అధికార అంచనా.

వాస్తవానికి ఫైజర్‌ ‌టీకాలు భారతదేశానికి ఎంత త్వరగా వొస్తాయనే దానిపై కూడా అనిశ్చితి ఉంది. 80 శాతం కవరేజ్‌ ‌స్ట్రాటజీ ప్రకారం, 104 మిలియన్ల మంది పిల్లలకు సమర్థవంతంగా రక్షించడానికి ప్రభుత్వం తగినంత టీకాలు వేయాలని యోచిస్తుంది. కనుక రెండు-మోతాదుల టీకా వేయటానికి కనీసం 208 మిలియన్‌ ‌మోతాదులు అవసరం. మూడు-మోతాదుల టీకా విషయంలో, టీకాల అవసరం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా మాట్లాడుతూ, పిల్లలకు కోవిడ్‌ -19 ‌టీకా అందుబాటులో ఉంచడం ఒక మైలురాయి సాధనగా ఉంటుందని. పాఠశాలలు తిరిగి తెరవడానికి పిల్లలు బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. పిల్లలలో ఎక్కువగా కోవిడ్‌-19 ‌తేలికపాటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పటికీ, కొంతమంది లక్షణరహితంగా వుంటున్నారు. ఐతే పిల్లలు సంక్రమణ వ్యాప్తి  యొక్క వాహకాలుగా వుండే అవకాశం ఉందని అయన నొక్కి చెబుతున్నారు. కొరోనా మహమ్మారి వలన గత ఒకటిన్నర సంవత్సరాల్లో చదువుకి పెద్ద నష్టం జరిగిందని నొక్కిచెప్పిన ఎయిమ్స్ ‌చీఫ్‌ ‘‌పాఠశాలలు తిరిగి తెరవబడాలి….అందుకు పిల్లలకి వేసే టీకా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, టీకా అనేది మహమ్మారి నుండి బయటపడే ఏకైక మార్గం’’ అన్నారు.

Leave a Reply