Take a fresh look at your lifestyle.

కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ హోం కిట్లు..!

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,మే 20:త్వరలో కొరోనా టెస్టులు మీకు మీరే చేసుకోవచ్చు. ఇందుకు గాను మార్కెట్ లోకి ‘కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ హోం కిట్లు’ అందుబాటులోకి రానున్నాయి అని ఐసీఎంఆర్ డీజీ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ హోం కిట్లు మనకి మనమే సొంతంగా కోవిడ్ టెస్ట్ చేసుకునే లాగా మార్కెట్ లో టెస్ట్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఒక కంపెనీకి తొలిసారి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మరో రెండు కంపెనీల అనుమతుల ప్రక్రియ ప్రాసెస్ లో ఉందన్నారు. ప్రస్తుతం ఈ కిట్ ఖరీదు  250 రూపాయలు అని తెలిపారు. అయితే, కంపెనీలను బట్టి ప్రైజ్ మారుతుందన్నారు. గురువారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో  మెడికల్ షాపులో కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్టు దొరుకుతుందని చెప్పారు.
కిట్ పై ఉన్న సూచనలను పాటిస్తూ సెల్ఫ్ గా కరోనా టెస్ట్ లు చేసుకోవచ్చన్నారు. అలాగే, జూన్ చివరి నాటికి దేశంలో రోజువారి కరోనా టెస్ట్ సంఖ్యను 45 లక్షలకు పెంచే టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. బుధవారం ఒకే రోజు  అత్యధికంగా  20 లక్షల టెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇది గ్లోబల్ రికార్డు గా నిలిచిందన్నారు. మే చివరి వారం వరకు 25 లక్షల టెస్ట్ లు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముందస్తు పరీక్షలు, పాజిటీవ్ అని తేలితే ఐసోలేషన్ కావడం, వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో డైలీ టెస్ట్ ల సంఖ్యను పెంచాలని ఐసీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రతి రోజు 12 లక్షల ఆర్టీ పీసీఆర్ టెస్ట్ లు, 17 లక్షల ర్యాపిడ్ ఆంటిజెన్ టెస్ట్ లు జరుగుతున్నాయన్నారు. వర్క్ ఫోర్స్ తో పని చేస్తోన్న ల్యాబ్ సిబ్బందిపై వైరస్ సోకినప్పటికీ… ల్యాబ్ లు 24 గంటలు నిరంతరం పని చేస్తున్నట్లు చెప్పారు.
2 డీజీ డ్రగ్ ను గతంలో క్యానర్స్ కు ఉపయోగించాం..
డీఆర్ డీఓ తయారు చేసిన 2 డీజీ డ్రగ్ ను గతంలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం వినియోగించినట్లు బలరాం భార్గవ్ చెప్పారు. 2 డీజీ గ్లూకోజ్ గా పిలుస్తారన్నారు. శరీరంలోని సెల్స్ ఈ గ్లూకోజ్ ను తీసుకొని మరణిస్తాయన్నారు. తిరిగి వినియోగిస్తున్న మెడిసిన్ అన్నారు. గతంలో ఇతర వ్యాధులకు ఈ మెడిసిన్ వినియోగించినట్లు చెప్పారు. ఈ మెడిసిన్ వినియోగంపై చేసిన ట్రయల్స్ ప్రస్తుతం  డీసీజీఐ వద్ద ఉన్నాయని, వాటిని బహిర్గతం చేయలేదని చెప్పారు. మెడిసిన్ పనితీరుపై రిజల్ట్స్ వచ్చాక, వాటిని పరిశీలించి స్పందిస్తామని చెప్పారు.
8 రాష్ట్రాల్లో  లక్షకు పైగా కేసులు: లవ్ అగర్వాల్
దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.  కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఏపి, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, యూపి లు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. ఇందులో  అత్యధికంగా అత్యధికంగా కర్నాటక లో 5. 59 లక్షల కేసులు, మహారాష్ట్రలో 4. 04 లక్షలు, కేరళ లో 3.32 లక్షలు, తమిళనాడు లో 3. 53 లక్షలు, ఏపిలో 2. 09 లక్షల కేసులు ఉన్నట్లు చెప్పారు. అలాగే, తొమ్మిది రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష లోపు కేసులు, 19 రాష్ట్రాల్లో 50 వేల లోపు యాక్టీవ్ కేసులు ఉన్నాయన్నారు.

Leave a Reply