Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా 5.5 కోట్లు దాటిన కోవిడ్‌ ‌టీకాలు

  • 24 గంటల్లో 23 లక్షలకు పైగా టీకాలు
  • అయిదు రాష్రాల్లో పెరుగుతున్న కొరోనా కేసులు

పిఐబి, న్యూదిల్లీ : దేశంలో కోవిడ్‌ ‌టీకాల పంపిణీ కార్యక్రమం వేగం పుంజుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 9,01,887 శిబిరాల ద్వారా ఐదున్నర కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో  ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు 80,34,547, రెండో డోసులు  51,04,398. కోవిడ్‌ ‌యోధులకిచ్చిన మొదటి డోసులు 85,99,981, రెండో డోసులు 33,98,57, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళు పైబడ్డ వారి డోసులు 55,99,772 , 60 ఏళ్లు పైబడ్డవారి డోసులు 2,47,67,172 ఉన్నాయి.
మొత్తం టీకాలలో 60% ఆ ఎనిమిది రాష్ట్రాలలోనే..
బుధవారం 40,595 శిబిరాల ద్వారా 23 లక్షలకు పైగా టీకా డోసులివ్వగా అందులో 21,54,934 మంది లబ్ధిదారులు మొదటి డోస్‌ అం‌దుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్‌ ‌యధులు, 2,03,797 మంది రెండో డోస్‌ ‌తీసుకున్న ఆరోగ్యసిబ్బంది, కోవిడ్‌ ‌యోధులు ఉన్నారు. గత 24 గంటలలో ఇచ్చిన కోవిడ్‌ ‌టీకా డోసులలో 10 రాష్టాల వాటా దాదాపు 70% ఉంది. రోజువారీ కొత్త కోవిడ్‌ ‌కేసులు ఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర, పంజాబ్‌, ‌కర్నాటక, చత్తీస్‌ ‌గఢ్‌, ‌గుజరాత్‌ ‌లో ఎక్కువగా వొస్తన్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 59,118 కొత్త కొవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికసంఖ్యలో నమోదవటం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో అక్కడ 35,952 కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న పంజాబ్‌లో 2,661, కర్నాటకలో  2,523 కేసులు వొచ్చాయి.

ఫిబ్రవరి మధ్యలో అత్యంత దిగువకు చేరిన కోవిడ్‌ ‌బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతూ చికిత్సలో ఉన్న కోవిడ్‌ ‌కేసుల సంఖ్య పెంచుతోంది. ప్రస్తుతం అది 4,21,066 కి చేరింది. దీనివల్ల గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా  25,874 పెరుగుదల నమోదు చేసుకుంది.  చికిత్సలో ఉన్నవారిలో 73.64% మంది కేవలం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌ ‌రాష్ట్రాలవారే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్‌ ‌నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,12,64,637 కు చేరింది. కోలుకున్నవారి శాతం 95.09%గా నమోదైంది. గత 24 గంటలలో 32,987 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకున్నారు. 257 మంది కోవిడ్‌ ‌వల్ల చనిపోయారు.  ఇందులో 78.6% మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 111 మంది, పంజాబ్‌లో 43 మంది చనిపోయారు. పద్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో కోవిడ్‌ ‌మరణం ఒక్కటి కూడా నమోదుకాలేదు.  రాజస్థాన్‌, ‌జమ్మూ-కశ్మీర్‌, ‌జార్ఖండ్‌, ఒడిశా, పుదుచ్చేరి, లక్షదీవులు, సిక్కిం, డామన్‌-‌డయ్యూ, దాద్రా-నాగర్‌ ‌హవేలి, లద్దాఖ్‌, ‌మణిపూర్‌, ‌త్రిపుర, మిజోరం, అండమాన్‌-‌నికోబార్‌ ‌దీవులు, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లలో కోవిడ్‌ ‌కారణంగా ఒక్క మరణం కూడా సంభవించ లేదు.

Leave a Reply