మీ చెంతకే కోవిడ్• పరీక్షలు
సిద్ధిపేట వైద్య కళాశాలకు ఐసిఎంఆర్ అనుమతి
మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సిద్ధిపేటకు మొబైల్ టెస్టింగ్ బస్ ఏర్పాటు
నేటి నుండి ప్రజలకు అందుబాటులో రానున్న మొబైల్ కొరోనా టెస్టింగ్ బస్
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట ప్రజల ముంగిట్లోనే ఎన్నో సేవలు అందిస్తున్న స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కొరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం,నేను ఉన్నాననే భరోసాతో మరో ముందడుగు వేస్తూ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రజలకు వారి చెంతనే సులువుగా పరీక్షలు చేసేందుకు మొబైల్ బస్ ద్వారా పరీక్షలు నిర్వహించే సదుపాయాన్నా కల్పిస్తున్నారు. ఈ సదుపాయం వలన వ్యాధి లక్షణాలతో, జ్వరం,ఒంటి నొప్పులతో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు వ్యయ ప్రయాసలు ఉండవు. అంతే కాకుండా, ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న ఆటో కానీ, మరే ఇతర వాహనంలో ఇతరులకు వ్యాప్తి చెందదు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో మరికొన్ని గంటల వ్యవధిలోనే ఇది సాధ్యం కానున్నది. సిద్దిపేట ప్రజల ముంగిట్లో మెరుగైన ఆరోగ్య సేవల్లో భాగంగా సిద్దిపేట ప్రజలకు ఆత్మవిశ్వాసం నింపనున్నారు. సందర్భం ఏదైనా సరే ప్రతి మీటింగ్‌లో నేను ఉన్నాను అనే మాటతో సిద్దిపేట ప్రజలు అధైర్య పడకుండా కొరోనా నివారణకు దాదాపు నాలుగు నెలల నుండి.. తాను స్వయంగా , ప్రజాప్రతినిధులతో, ఆరోగ్య శాఖతో, ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటూ అందులో భాగంగా కొరోనా టెస్ట్‌లు ప్రజల ముంగిట్లోనే వారి చెంతకు తెచ్చారు.
మంత్రి హరీష్‌రావు చొరవ…ఐసిఎంఆర్ అనుమతి
ఇక హైదరాబాద్‌కు నమూనాలను పంపించే అవసరం లేదు…
‘నాకు కొరోనా వచ్చిందనే అనుమానం… టెస్ట్‌కు వెళ్లితే నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపాం. ఫలితాల కోసం వేచి ఉన్నాం అనే మాట నిన్నటి దాకా. కానీ, ఇక శుక్రవారం నుండి మనం ఇక్కడ టెస్ట్‌లు చేయించుకున్న 8 గంటల్లోనే మన సిద్దిపేట వైద్య కళశాలలో ఫలితాలు రానున్నాయి. మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆర్టీపిసిఆర్ టెస్ట్‌లకు ( వ్యాధి నిర్ధారణ ) అఖిల భారత ఇండియన్ వైద్య పరిశోధన (ఐసిఎంఆర్) అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటైన వైద్య కళశాలలో భాగంగా తొలి అనుమతి సిద్దిపేటకు వచ్చింది. ఇది సిద్దిపేట వైద్య కళశాల ఎన్సాన్‌పల్లిలో ఈ ల్యాబ్ ఏర్పాటు కానుంది. ఈ ల్యాబ్‌ను నూతన బస్ వాహనంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు.