Take a fresh look at your lifestyle.

క్వారంటైన్‌లో ఉన్న వారిలో మానసికస్థైర్యం కలిగించండి

మంత్రి ఈటలకు కోవిడ్‌ 19 అడ్వొకసీ లాక్‌డౌన్‌ ‌కలెక్టివ్‌ ‌ప్రతినిధుల లేఖ
ద్‌ : ‌కొరోనా వైరస్‌ ‌సోకి ఉండవచ్చన్న అనుమానంతో క్వారంటైన్‌ ‌చేసిన వ్యక్తులలో రాష్ట్ర ప్రభుత్వం మానసిక స్థైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని కోవిడ్‌ 19 అడ్వొకసీ లాక్‌డౌన్‌ ‌కలెక్టివ్‌ ‌ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు అన్వేషి రీసర్చ్ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌వుమెన్‌ ‌స్టడీస్‌ ‌ప్రతినిధి డాక్టర్‌ ‌సునీత, డాక్టర్‌ శ్రీ‌వత్సన్‌, ‌లక్ష్మి కుట్టీ, డాక్టర్‌ ‌మిథున్‌ ‌సోమ్‌, ‌డాక్టర్‌ ‌రాణి రోహిణి రామన్‌, ‌తేజస్విని మాడభూషి, యుగంతర్‌, ‌మహిళా కిసాన్‌ అధికార్‌ ‌మంచ్‌ ‌ప్రతినిధులు ప్రతినిధులు ఆశాలత, డాక్టర్‌ ‌సీతామహాలక్ష్మి, దళిత్‌ ‌బహుజన్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రతినిధి పి.శంకర్‌ ‌తదితరులు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు, వైరస్‌ ‌సోకిన వ్యక్తులతో మాట్లాడిన అంశాల ఆధారంగా వారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు గురువారం లేఖ రాశారు. ప్రస్తుతం అవలంబిస్తున్న క్వారంటైన్‌ ‌పద్దతుల ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ కన్నా ఈ వార్డులలో ఉన్న ప్రజలలో, వారి టుంబాలలో…భయాందోళనలు, అయోమయంతో కూడుకున్న అలజడి బాగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంతో పాటు ఆరోగ్య శాఖ, వైద్యులు కోవిడ్‌ ‌వ్యాధి గురించి దానిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై సరైన సమాచారం ఇవ్వకపోవనమేనని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా క్వారంటైన్‌లో ఉన్న వారికి అక్కడ ఎన్ని రోజులు ఉంచుతారో, ఎప్పుడు ఇంటికి పంపుతారో చెప్పకపోతే ఏమీ తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పైగా వారికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా, టెస్టులు ఎందుకు చేస్తున్నారో, వాటి ఫలితాలు ఏమిటో, వారి క్వారంటైన్‌ ఇం‌కా ఎన్ని రోజులో తెలియక మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. దీనికి తోడు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ముస్లింలు మాత్రమే వ్యాధి వ్యాప్తికి కారణమైనట్లు మీడియాలో జరిగిన ప్రచారం కారణంగా మొత్తం ముస్లిం సమాజంపై నిఘా పెరిగి వారిపై వివక్ష పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్వారంటైన్‌కు సంబంధించిన కచ్చితమైన నిబంధనలు, నియమాలు ప్రకటించి వాటిని అన్ని భాషలలో ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేయడమే కాకుండా అన్ని స్థాయిల్లో అమలు జరిగేలా చూడాలని మంత్రి ఈటలకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply