Take a fresh look at your lifestyle.

నేడు రెండు జిల్లాల్లో కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌డ్రైరన్

  • 10 ‌వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి
  • రోజూ 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ ‌వేసేలా ప్రణాళిక

‌రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా శనివారం హైదరాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలలో డ్రైరన్‌ ‌చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌, ‌నాంపల్లి ఏరియా హాస్పిటల్‌, ‌తిలక్‌నగర్‌ ‌యూపిహెచ్‌సి, సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో డ్రైరన్‌ ‌నిర్వహించనున్నారు. అలాగే, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలలోని ప్రభుత్వ దవాఖానాతో పాటు మరో ప్రైవేటు హాస్పిటల్‌లో డ్రైరన్‌ ‌చేపట్టనున్నారు. ఈనెల రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ ‌వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు వీలుగా ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు 10 వేల మందికి శిక్షణను పూర్తి చేశారు. ప్రతీ రోజూ పది లక్షల మందికి వ్యాక్సిన్‌ ‌వేసేలా ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌నగరాలలో భారీ నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ ‌స్టోరేజ్‌లను సిద్ధం చేసింది.

ప్రభుత్వ దవాఖానాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలలో వ్యాక్సిన్‌ ‌వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇక్కడ వ్యాక్సిన్‌ ‌వేసే సిబ్బందితో పాటు వ్యాక్సిన్‌ ‌తీసుకున్న ఎవరికైనా ఏవైనా సైడ్‌ ఎఫెక్టస్ ‌కలిగినట్లయితే, వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించడానికి, అవసరమైతే ఇతర అత్యవసర చికిత్సల నిమిత్తం నగరాలు, పట్టణాలకు తరలించడానికి నిపుణులైన వైద్యులతో పాటు అంబులెన్సులు, ఇతర రవాణా సదుపాయాలను కల్పించనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ముందుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీసు వాఖ, పారిశుధ్య్క కార్మికులకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ విభాగాలకు చెందిన వారందరికీ వ్యాక్సిన్‌ ‌వేయడం పూర్తయిన తరువాత గ్రామ స్థాయిలో కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

Leave a Reply