Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌హెచ్చరికల నేపథ్యం

  • ముందస్తు ఏర్పాట్లలో ఎపి ప్రభుత్వం
  • సిఎం జగన్‌ ఆదేశాలతో అధికారుల అప్రమత్తం

అమరావతి: కోవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లనూ చేసుకోవడం మొదలుపెట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సిఎం జగన్‌ ‌తరచూ సక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. థర్డ్ ‌వేవ్‌ ‌కోసం కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ‌ప్లాన్‌లో భాగంగా ఏపీకి రూ. 696 కోట్ల మేర కేంద్రం అంచనా వేసింది. అందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించనున్నాయి. రూ. 101.14 కోట్ల వ్యయంతో 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్‌ ‌కేర్‌ ‌యూనిట్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ. 188.72 కోట్ల వ్యయంతో మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు శరవేగంగా ఏర్పాటవు తున్నాయి. రూ. 5 కోట్లతో గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ప్రారంభిస్తారు. రూ. 185 కోట్ల ఖర్చుతో 1,145 పీహెచ్‌సీల్లో, 208 సీహెచ్‌సీల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. 100 పడకల ఆస్పత్రికి రూ. 7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంది.

రూ. 8.38 కోట్ల వ్యయంతో టెలీమెడిసిన్‌ను బలోపేతం చేస్తారు. ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్‌ ‌స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి ఖర్చు చేయనుంది. కోటి ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు. కోవిడ్‌ ‌సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్‌ ‌పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్‌ ‌చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్‌ ‌విద్యార్థులను 4 నెలల ప్రతిపాదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ఇ-సంజీవని సేవలు జరుగుతున్నాయి. 540 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున పీడియాట్రిక్‌ ‌కేర్‌ ‌యూనిట్‌లు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో యూనిట్‌లో 42 పడకలు ఉంటాయి.

ఇందులో 12 పడకల ఐసీయూ యూనిట్‌ ‌కూడా ఉంటుంది. మరో 196 జిల్లాల్లో 32 పడకల పీడియాట్రిక్‌ ‌కేర్‌ ‌యూనిట్‌లు ఉంటాయి. ఇక్కడ 8 పడకల ఐసీయూ వార్డు ఉంటుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్‌ ఐసొలేషన్‌ ‌పడకలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 20 శాతం కేవలం పీడియాట్రిక్‌ ‌పడకలే ఉండాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకలు, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో 20 పడకలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు నిర్దారణ పరీక్షలు కూడా చేయాలి. ఈ కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్‌ ‌సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

Leave a Reply