Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌ప్రభావం ..పెరుగుతున్న బాల్య వివాహాలు ..!

“గత రెండు సంవత్సరాలుగా తరగతి గదిలో అడుగు పెట్టకుండానే, ఆయా తరగతులకు సంబంధించిన కనీస సామర్ధ్యాలు నేర్చుకోకుండా నే పై తరగతులకు ప్రమోట్‌ ‌కావడం విద్యాభివృద్ధికి ప్రమాదకరం. రెండు తరాలకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారవుతుంది. భవిష్యత్తు సమాజం కోసం ఆదర్శవంతమైనటువంటి పౌరులు గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం విచారకరం. అంతేకాకుండా ఆన్లైన్‌ ‌విద్యావిధానం వల్ల చాలా అనర్థాలు తలెత్తుతున్నాయి.”

ఆటపాటలతో పాఠశాలలో హాయిగా తోటి విద్యార్థులతో ఆనందంగా తమ బాల్యాన్ని గడపాల్సిన బాలికలు పెండ్లిపీటలెక్కి బరువు బాధ్యతలతో మెట్టినింట అడుగుపెడుతున్న దుస్థితి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐదుగురి ఆడపిల్ల లో ఒకరికి 18 సంవత్సరాలు నిండకముందే వివాహం జరుగుతుంది. మన దేశంలో ఏటా 15 లక్షల మంది అమ్మాయిలకి బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయి ., కొరోనా ప్రభావానికి ముందు బాల్యవివాహాలు కొంతమేరకు తగ్గాయి. గడిచిన పదేళ్లలో ప్రపంచంలో బాల్య వివాహాలు 15 శాతం తగ్గాయి. కానీ కొరోనా తలకిందులు చేసింది. ప్రపంచ వ్యాప్తంగానే కాదు, మన తెలంగాణ లోనే బాల్యవివాహాలు 27 శాతం పెరిగాయి. బడి ,కాలేజీల బాట పట్టాల్సిన అమ్మాయిలు, అవి మూతబడి ఉండటంతో అత్తారింటికి దారి పడుతున్నారు. బాల్య వివాహాలు పెరగడానికి కారణం కొరోనా మహమ్మారి వల్లనే అని యూనిసెఫ్‌ ‌వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఒక అసాధారణ పరిస్థితి నెలకొని ఉంది. గత 14 నెలలుగా మహమ్మారి విశ్వరూపం తో ప్రపంచం మొత్తం గడగడలాడిస్తోంది. ఆర్థిక వ్యవస్థల తో సహా అన్ని రకాల వ్యవస్థలను అల్లకల్లోలం చేసింది. మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసిన , చేస్తున్న సందర్భంలో పూర్తిగా అస్తవ్యస్తంగా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న రంగం విద్యారంగం. విద్యావ్యవస్థ స్వరూపాన్ని, రెండు సంవత్సరాల విద్య అకడమిక్‌ ‌క్యాలెండర్‌ ‌లను కొరోనా మహమ్మారి తుడిచి పెట్టింది.. కొరోనా మహమ్మారి రెండవ విడత విలయతాండవం తర్వాత, కాస్త సద్దుమణగడంతో రాష్ట్రంలో ప్రత్యక్ష బోధనతో అన్ని రకాల విద్యా సంస్థలు ప్రారంభించడం జరుగుతుందని ప్రకటన వెలువడటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషంతో ఆ రోజు ఎప్పుడు వస్తుందా ?….అని ఎదురు చూస్తున్న తరుణంలో కొరోనా మూడో విడత ముప్పు ముంచుకొస్తుందని జూలై ఒకటవ తేదీ నుండి ఆన్లైన్‌ ‌తరగతులు ప్రారంభించడం తో విద్యార్థులంతా నిరు త్సాహంతో ఆన్‌లైన్‌ ‌తరగతులు పట్ల విముఖత చూపిస్తుండటంతో నేటి విద్యా విధానం ఆసక్తి లేని ఆన్‌లైన్‌ ‌విద్యగా తయారైంది.

. ఇటీవల ప్రభుత్వం జూలై నెల నుండి ప్రత్యక్ష బోధన జరుగుతుందని, అన్ని రకాల విద్యా సంస్థలు ప్రారంభమవుతాయని ప్రకటించడం జరిగింది కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రణాళిక ,కార్యాచరణ ఏది కూడా లేకపోవడంతో , మాటల ద్వారానే ఉచ్చరించడం తో న్యాయస్థానాలు భావి భారత పౌరుల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం యూటర్న్ ‌తీసుకున్నది. దీంతో గత సంవత్సరం లో వలె ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్‌లైన్‌• ‌తరగతులు ప్రారంభించడం జరిగింది. . గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు విద్యార్థులు ప్రత్యక్ష బోధన పట్ల మానసికంగా సంసిద్ధులై ఉన్నారు. ఈ సమయంలో మళ్లీ ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహిస్తుండడంతో వారిలో పూర్తిగా ఆసక్తి సన్నగిల్లింది. ఆన్లైన్‌ ‌తరగతులు అనగానే విద్యార్థులు తల్లిదండ్రులు తేలికగా తీసుకుని సెలవుల మాదిరిగానే భావిస్తున్నారు. దీనికితోడు క్షేత్రస్థాయిలో క్లాసులు వచ్చే సమయంలో కరెంటు సమస్య, ఇంటర్నెట్‌ ‌సమస్య , మొబైల్‌ ‌ఫోన్‌ అం‌దుబాటులో లేకుండా పోవడం, టీవీలో రీఛార్జ్ ‌లేకపోవడం, గ్రామాల్లో ఉన్న కేబుల్‌ ఆపరేటర్లు టి సాట్‌ ‌ఛానల్‌ ‌చూపించ లేక పోవడం, వాటికి తగ్గ సెటప్‌ ‌బాక్స్ ‌లు కొనుక్కో లేకపోవడం, టీవీ చూసే వాతావరణం లేకపోవడం లాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి విద్యార్థి టీవీ ముందు కూర్చుంటే వచ్చే పాఠాలు అర్థమయ్యేరీతిలో లేవని, పిల్లలు ఏకాగ్రతతో టీవీ చూడటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు..

ఫోన్‌ ‌లు ఉన్నాయని చెప్పిన విద్యార్థులందరికీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూసినట్లయితే అవి వారికి ఉపయోగపడటం లేదు. అవి వాళ్ళ తోబుట్టువులో, తల్లిదండ్రులో వెంట తీసుకెళ్లడం, ఉపయోగించడం జరుగుతుంది. క్లాస్‌ ‌వచ్చే సమయానికి ఆ ఫోన్‌ ‌వీళ్లు దగ్గర ఉండటం కష్టసాధ్యం గానే ఉంది. 104 మంది విద్యార్థులు ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో గత వారంలో ఒకరోజు ఆరవ తరగతిలో 8/17, ఏడవ తరగతి లో8/26మంది,ఎనిమిదవ తరగతిలో 10/26, తొమ్మిదో తరగతి లో 09/22 మరియు పదోతరగతి 08/13 మాత్రమే వీక్షించడం జరిగింది. అనగా ఆ పాఠశాలలో 41 శాతం మాత్రమే ఆన్లైన్‌ ‌తరగతులకు హాజరయ్యారు. మిగతా 59 శాతం వివిధ పనులకు వెళ్లడం జరిగింది. పదకొండు గంటల తరువాత పిల్లలు అందరూ వారి పశువుల వెంట, తల్లిదండ్రుల వెంట పొలం పనులకు వెళుతున్నారు. ఉపాధ్యాయులు అవగాహన కల్పించినప్పటికీ లాభం లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. అందుకని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి కోవిడ్‌ ‌నిబంధనలను అనుసరించి ప్రత్యక్ష బోధన చేయడానికి వసతులు పెంచడానికి ప్రత్యేక నిధులు కేటాయించి సమగ్రమైన ప్రణాళికను తయారు చేసి పాఠశాలలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. లేనిచో గత రెండు సంవత్సరాలుగా తరగతి గదిలో అడుగు పెట్టకుండానే, ఆయా తరగతులకు సంబంధించిన కనీస సామర్ధ్యాలు నేర్చుకోకుండా నే పై తరగతులకు ప్రమోట్‌ ‌కావడం విద్యాభివృద్ధికి ప్రమాదకరం. రెండు తరాలకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారవుతుంది. భవిష్యత్తు సమాజం కోసం ఆదర్శవంతమైనటువంటి పౌరులు గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం విచారకరం. అంతేకాకుండా ఆన్‌లైన్‌• ‌విద్యావిధానం వల్ల చాలా అనర్థాలు తలెత్తుతున్నాయి.

1). ఆన్‌లైన్‌• ‌తరగతులు వీక్షించడానికి ప్రత్యేక సెల్‌ ‌ఫోన్లు కొనివ్వడం తో అశ్లీల వినోదానికి అలవాటుపడి అసాంఘిక అనైతిక పనులు చేయడం ఎక్కువయింది .
2). ఆన్‌లైన్‌ ‌తరగతులు పేరిట సెల్‌ ‌ఫోన్‌ ‌ను ఉపయోగిస్తూ ఆన్లైన్‌ ‌గేమ్స్ ‌కు అలవాటుపడి మానసిక అనారోగ్యంతో చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది.
3). చిన్నపిల్లలు తదేకంగా సెల్‌ ‌ఫోన్‌ ‌స్క్రీన్‌ ‌చూస్తుండటంతో కంటి చూపు సమస్యలు అధికం అవుతున్నాయి.
పిల్లలందరూ పొద్దంతా ఇంటి వద్దనే ఉండటం వలన, తోటి విద్యార్థుల సహచర్యం లేక పోవడం వలన, ఒంటరిగా ఫీల్‌ అవుతూ మానసికంగా కుంగిపోతూ అనారోగ్యం పాలవుతున్నారు.
4). పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మూసివేయడం వలన చాలా మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఎత్తుకు తగిన బరువు లేకుండా చాలా బలహీనంగా ఉన్నారు.

దేశంలో పోషకాహార లోపంతో 9 లక్షల 27 వేల 606 మంది చిన్నారులు బాధపడుతున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలలో బాలామృతం లాంటి పోషకాహార విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం జరిగేది.కొరోనా విలయతాండవం తో గత రెండు విద్యా సంవత్సరాలలో పాఠశాల అంగన్‌ ‌వాడి కేంద్రాలు మూతబడి ఉన్నాయి. కొరోనా ప్రభావం వలన సామాన్య కుటుంబాలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నాయి. ప్రపంచంలో కొరోనా కంటే ఆకలి అధిక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. కొరోనా వల్ల నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే, ఆకలి వల్ల 11మంది తమ ప్రాణాలను కొల్పుతుం డడం హృదయ విదారకం.

ప్రత్యక్ష బోధన దూరంగా ఉన్న విద్యా సంస్థల మూసివేత వల్ల వాటి మీద ఆధారపడ్డ వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, బడ్జెట్‌ ‌పాఠశాలల యాజమాన్యాలు, పాఠశాలలో పనిచేసే సిబ్బంది., పాఠశాల వాహనాల డ్రైవర్లు, పాఠశాలల ముందు తినుబండారాల వ్యాపారులు, బుక్‌ ‌స్టాల్‌ ‌వాళ్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వారికి సరుకులు అందించే కిరాణా దుకాణ దారులు, కోడిగుడ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, స్కావెంజర్‌ ‌లు, వాచ్‌ ‌మెన్లు విద్యా వాలంటీర్లు, ఎలక్ట్రీషియన్‌ ‌లు, దోబీ లు తదితరులు ఎంతోమంది ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డారు. తిండి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అనేకం కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. మొత్తంగా తరగతిగది తన పాత్రను నిర్వర్తించ పోవడం వల్ల సమాజమంతా సంక్షోభంలో కూరుకుపోయింది. తరగతి గది అభివృద్ధికి తొలిమెట్టుగా భావించి భవిష్యత్తు సమాజం కోసం భావితరాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి, ప్రస్తుత తరుణంలో నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను ప్రారంభించి, విద్యార్థులందరికీ తక్షణమే వ్యాక్సినేషన్‌ ‌గావించి ,వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించి, పకడ్బందీ విధివిధానాలను రూపొందించి బాలల భవితవ్యం కోసం సమాన విద్యను, ప్రత్యక్ష బోధన ద్వారా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అటువైపుగా ప్రభుత్వాలు అడుగులు వేసి ఆదుకుంటా యని ఆకాంక్షిద్దాం…..

Leave a Reply