Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌డ్రైరన్‌ ‌విజయవంతం

డమ్మీ వ్యాక్సిన్‌తో ఇబ్బందుల పరిశీలన
ప్రతీ రోజు 100 మందికి ఇచ్చేలా ఏర్పాట్లు
తిలక్‌నగర్‌లో డ్రైరన్‌ను పరిశీలించిన గవర్నర్‌ ‌దంపతులు

‌తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ ‌టీకా పంపిణి ముందస్తు సన్నాహాలలో భాగంగా నిర్వహించిన డ్రైరన్‌ ‌విజయవంతమైంది. శనివారం ఈ డ్రైరన్‌ను రాష్ట్రంలోని హైదరాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, తిలక్‌నగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, నాంపల్లి ప్రభుత్వ దవాఖాన, సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌, ‌మహబూబ్‌నగర్‌లో జిల్లా కేంద్ర దవాఖాన,  జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నేహా శైన్‌ ‌హాస్పిటల్‌లో ఈ డ్రైరన్‌ను నిర్వహించారు. డ్రైరన్‌లో భాగంగా ఒక్కో కేంద్రంలో 25 30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్తులను చేశారు.

కేంద్రంలోని టీకా పొందే వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం వరకూ అన్ని దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. డమ్మీ వ్యాక్సిన్‌ ఇవ్వడం వంటి కార్యక్రమాలన్నింటినీ డ్రైరన్‌లో నిర్వహించారు. ప్రతీ కేంద్రంలోనూ డ్రైరన్‌ ‌కార్యక్రమాన్ని రెండు గంటల్లో పూర్తి చేశారు. డమ్మి వ్యాక్సిన్‌ ఎలా ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ ‌పంపిణీలో ఇబ్బందులను పరిశీలించడంతో పాటు వారి వెరిపికేషన్‌, ‌డమ్మీ వ్యాక్సిన్‌ ఇచ్చిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. ప్రతీ రోజు వంద మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  ముందుగా, ఆరోగ్య కార్యకర్తలను గుర్తించడం, ఇమ్యునైజేషన్‌ ‌ప్రక్రియ గురించి వివరించి 30 నిమిషాల పాటు పరిశీలించడం డ్రైరన్‌లో భాగంగా జరిగింది. కాగా, కోవిడ్‌ను ఎదుర్కునేందుకు తయారు చేసిన తయారు చేసిన వ్యాక్సిన్‌ ‌సురక్షితమైనదనీ, తీసుకునేందుకు వెనుకాడవద్దని ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసౌ సౌందరాజన్‌ ‌సూచించారు. నగరంలో డ్రైరన్‌ ‌నిర్వహిస్తున్న తిలక్‌నగర్‌ ‌యూపిహెచ్‌సిని గవర్నర్‌ ‌దంపతులు సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, మెడికల్‌ ‌స్టాఫ్‌తోనూ, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలతోనూ మాట్లాడారు. కోల్డ్ ‌చెయిన్‌ ‌విధానం, వ్యాక్సినేషన్‌ ‌రూమ్స్ ‌తదితర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు డ్రైరన్‌ ‌ప్రారంభమైన తరువాత ఒక్కరు కూడా దుష్ప్రభావాలకు గురికాలేదన్నారు. వ్యాక్సిన్‌ ‌తీసుకునేందుకు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. కొరోనా బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని సూచించారు.

Leave a Reply