Take a fresh look at your lifestyle.

మా పార్టీలోనూ కోవర్టులు..

  • సీనియర్‌ను అనికూడా చూడకండా తనకు బెదిరింపులు
  • రేవంత్‌కు పిసిసి పదవి ఇవ్వరాదనే తన నిశ్చితాభిప్రాయం
  • కాంగ్రెస్‌ ‌సీనియయర్‌ ‌నేత విహెచ్‌ అభిప్రాయం

‌కాంగ్రెస్‌ ‌పార్టీలో 42 సంవత్సరాలుగా ఉన్నాననని.. అలాంటి తనను తన పార్టీవాళ్లే తిడుతున్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. యూత్‌ ‌కాంగ్రెస్‌, ‌పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని తనను ఇప్పటి వరకూ ఏ పార్టీ వాళ్ళూ దూషించలేదన్నారు. కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి వర్గానికి చెందిన వాళ్లు తనను ఫోన్‌ ‌చేసి తిడుతున్నారన్నారు. తనను తిడితే గాంధీ భవన్‌లో జానారెడ్డి ఖండించారని వీహెచ్‌ ‌పేర్కొన్నారు. పీసీసీ మాత్రం ఖండించలేదన్నారు. తనకు రక్షణ కల్పించమని పోలీసులను కోరానన్నారు. రెడ్డిలకే పీసీసీ ఇవ్వాలి అనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

తాను బీసీలకి ఇవ్వమని చెబుతున్నానని.. ఒకవేళ రేవంత్‌కి పీసీసీ ఇస్తే గాంధీ భవన్‌కి రానియ్యరన్నారు. బహిరంగంగా వి•డియాలో తనను తిడితే క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. తాను చనిపోయే వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. తమ పార్టీలో కోవర్టస్ ఉన్నారని.. ముందు నుంచే తాను ఈ విషయం చెబుతున్నానని వీహెచ్‌ ‌పేర్కొన్నారు. ఇలా కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యవహార శైలిపై విహెచ్‌ ‌విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ‌నాయకుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డిపైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి పీసీసీ చీఫ్‌ ‌పదవి ఎలా ఇస్తారంటూ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్‌ ‌పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందా.? లేదా.? అని ఆయన నిలదీశారు.

తాను రేవంత్‌ ‌రెడ్డిని తిట్టలేదని, రేవంత్‌ ‌రెడ్డి వి•ద ఆరోపణలు ఉన్నాయని మాత్రమే చెప్పానని అన్నారు. ఇవాళ నన్ను తిట్టారు.. రేపు ఇంకొకరిని తిడతారని పరోక్షంగా రేవంత్‌ ‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో కోవర్టులు ఎక్కువయ్యారని, కోవర్టులు ఉన్నన్ని రోజులు పార్టీ బాగుపడదని మండిపడ్డారు.హైకమాండ్‌కు లేఖలు రాసిరాసి అలిసిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పి చేసి ఉంటే చెప్పండి పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తనకు పార్టీలో అవమానాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. ‘సోనియా గాంధీ బలిదేవత అన్నవాళ్లే ఇప్పుడు ఆమెకు దగ్గరయ్యారు. సీనియర్లు, జూనియర్లు కలిస్తేనే పార్టీ. రేవంత్‌ ‌పెద్ద నాయకుడు అంటారు, గ్రేటర్‌లో ఎన్ని సీట్లు గెలిపించాడని నిలదీశారు. రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయితే గాంధీ భవన్‌కు కూడా ఎవ్వరినీ రానివ్వడు. పీసీసీ చీఫ్‌ అయ్యాక రేవంత్‌ ‌జైలుకు వెళ్తే ఎలా.? పార్టీ జైలు చుట్టూ తిరగాలా ! అని ఘాటుగా విమర్శించారు.

Leave a Reply