Take a fresh look at your lifestyle.

చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి కోవాగ్జిన్‌

2-18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. దీనితో 525 తక్కువ మంది 2-18 ఏళ్ల వారిపై టీకా భారత్ బయోటెక్ ప్రయోగించనున్నది. రెండు, మూడో దశలో 2-18 ఏళ్ల మధ్య వారిపై కొవాగ్జిన్‌ (కొవిడ్‌ టీకా) క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు, ఆ టీకా ఉత్పత్తి సంస్థ భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్‌కు డ్రగ్స్ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (‍డీసీజీఐ‌) అనుమతినిచ్చింది. దీని కోసం  క్లినికల్‌ ట్రయల్‌  గతంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) ప్రతిపాదన కేంద్రానికి సమర్పించింది.
దీనిపై సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ (ఎస్‌ఈసీ) చేసిన సిఫారసును సమగ్రంగా పరిశీలించిన డీసీఐజీ బుధవారం ఆమోదిందం తెలిపిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌ ఈ ప్రతిపాదనపై కేంద్రం వేగంగా స్పందించి, ఎస్‌ఈసీలో చర్చించినట్లు తెలిపింది. సమగ్ర చర్చ తర్వాత, క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి మంజూరు చేయాలని ఎస్ఈసీ సిఫారసు చేసినట్లు పేర్కొంది. కమిటీ సూచించిన షరతులకు లోబడి ఈ ప్రయోగాలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, క్లినికల్ ట్రయల్స్ లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 525 ఆరోగ్యవంతులకు ప్రయోగాత్మకంగా బీబీఐఎల్ ఈ టీకాను ఇవ్వనుంది. ప్రయోగంలో భాగంగా…  ఫస్ట్ డే, 28వ డే టీకాను కండరాల ద్వారా శరీరానికి ఎక్కించనున్నారు.

Leave a Reply