Take a fresh look at your lifestyle.

13 ‌వరకూ వరవరరావుకు హాస్పిటల్‌లో చికిత్సకు కోర్టు అనుమతి

విరసం నేత వరవరరావు ఈ నెల 13 వరకు హాస్పిటల్‌లో చికిత్స పొందేందుకు బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వరవరావును గతేడాది నవంబరులో నానావతి హాస్పిటకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 13 వరకు ఆయన అక్కడే చికిత్స పొందవచ్చని జస్టిస్‌ ఎస్‌ ‌షిండే, జస్టిస్‌ ఎంఎస్‌ ‌కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

ప్రధాని మోడీ హత్యకు కుట్ర చేశారన్న భీమ కొరేగాన్‌ ‌కేసు లో 2018లో విరసం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్  ‌చేశారు. పూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. 2020, ఫిబ్రవరి నెలలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. అయితే తన భర్తకు బెయిలు ఇప్పించాలంటూ వరవరరావు భార్య హేమలత దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను 13న విచారించనున్నట్టు తెలిపింది. వరవరరావు ఆరోగ్యం కొంత మెరుగుపడిందని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో  పేర్కొంది.

Leave a Reply