Take a fresh look at your lifestyle.

దేశం – మనం – కరోనా

ఇం‌ట్లో కూర్చుని, పార్టీలు చేసుకుంటూ, కరోనా మీద మీమ్స్ ‌చేస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్న మనం, మన వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి, సేవ చేయలేకున్నా కనీసం, వైరస్‌ ‌కి వాహకాలుగా ఐనా మారకుండా ఉండాలి. మన భవిష్యత్తు తరాలకి మనం స్వచ్ఛమైన ప్రకృతి ఇవ్వలేదు, త్రాగే నీరు ఉంచలేదు, సుస్థిర అభివృద్ధి అనే భావనను కొంచెం కుడా ఆలోచించ లేదు.కానీ అవన్నీ ఇచ్చినా ఇవ్వకున్నా కనీసం ప్రాణాలైనా కాపాడుదాం.

కరోనా దెబ్బకు ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది, అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నాయి. కానీ కరోనా వైరస్‌ ‌పట్ల భారతదేశంలో మనం ఎలా  ప్రతిస్పందిస్తూ ఉన్నామంటే.. కొందరేమో గుళ్ళు మూత పడ్డాయి కాబట్టి దేవుడు భయపడి పారిపోయాడు అంటారు, మరి బడులు మూత పడ్డాయి కదా విద్య భయపడిందనా అర్థం..? షాపింగ్‌ ‌మాల్స్, ‌పబ్లిక్‌ ‌ప్లేస్‌ ‌లు, కంపెనీలు కూడా మూతపడ్డాయి కదా అభివృద్ధి భయ పడిందనా అర్థం..? ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఇంకా ఈ జనాలకి   అర్థం కావట్లేదు.

ఇక మరికొందరేమో ఈ మంత్రం చదివితే, ఈ పూజ చేస్తే ,దీన్ని చేస్తే , కరోనా రాదు అంటూ రాస్తున్నారు… మూర్ఖత్వంకి హద్దులు ఉండవని నిరూపిస్తున్నారు.కానీ ఒకటి నిజం.. సేఫ్టీ పాటించని ఎవరికయినా కరోనా వస్తుంది.ఇందులో కుల మతాలు, పేద ధనిక , ఆస్తిక నాస్తిక భేదాలు లేవు.ఇంకొందరేమో ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని విరుచుకు పడుతున్నారు. అసలు పౌరులుగా మనం ఏం చేస్తున్నామో అని ఆలోచిం చలేదు. ఇప్పటికీ కూడా మనం రోడ్ల మీద తిరగటం మానలేదు, చేతులు కడుక్కోవడంలేదు, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం లేదు, కనీసం మన చుట్టూ ఉన్న నలుగురు మనుషులకు అవగాహన కూడా కల్పించట్లేలేదు.కానీ చాలా తేలికగా ప్రభుత్వాన్ని, వ్యవస్థని, మతాన్ని, వ్యాఖ్యానిస్తూ విమర్శలు చేస్తూ ఉన్నాము.ఇంట్లో కూర్చొని టీవీ లో క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌చూస్తూ బ్యాటింగ్‌ ఇలా చేస్తే బాగుండు, ఫీల్డింగ్‌ ఇలా చేస్తే బాగుండు, అన్న ధోరణినే కరోనా పట్ల కూడా చూపిస్తున్నాము.

ఇప్పటికీ పెళ్లిళ్లు, పార్టీలు, మీటింగ్‌ ‌లు నడుస్తూనే ఉన్నాయి.చిత్రమేమిటంటే అన్నీ తెలిసిన వాళ్ళు,చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉండడం శోచనీయం, బాధాకరం.. బాధ్యత రాహిత్యానికి నిదర్శనం.ప్రజలకు అవగాహనా బాధ్యత లేనంత కాలం ఇదే విధానం, ఇదే సమస్య కొనసాగుతుంది.దానికి ప్రతిగా మనం ఏ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మరికొందరేమో మనుషులు చేసిన పాపానికి ఇలా అనుభవించాల్సిందే, ప్రకృతి పగ తీర్చుకుంటుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రకృతి ఏమి మనలా అహంకారం, అజ్ఞానంతో ఉన్న మనిషి కాదు కదా, పగ తీర్చుకోవడానికి. అయినా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ప్రకృతి మనకు ఇంకా ఇస్తూనే ఉంది, కానీ మనమే చాలా తేలికగా ఒకలాంటి మొండితనంతో అహంకారంతో ఏమీ కాదు అంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను.ఇంకా కొందరేమో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తీసుకురావటానికి చైనా చేసిన జీవ ఆయుధ వ్యూహం ఈ కరోనా అంటున్నారు. ఇది నిజమే కావచ్చు, కాకపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ పై కరోనా ప్రభావం అనేది వేరే కోణం లో ఆలోచించాల్సిన విషయం. ఆర్థిక ప్రభావాలు, సామాజిక మార్పులు, మానసిక అలజడులు ఇవ్వన్నీ అతి ముఖ్యమైన అంశాలే కానీ వీటన్నింటినీ ఆలోచించాలన్నా, ఏమైనా చేయాలన్నా మనం ప్రాణాలతో ఉండటం చాలా అవసరం.కానీ అతి ముఖ్యమైన ఈ విషయం పట్ల మనము ఇంకా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము.మన చుట్టూ ఉన్న వారికి, మన పిల్లలకి పనివాళ్లకి, వాచ్‌మెన్‌లకు, పాల వాళ్ళకి, పేపర్‌ ‌వాళ్లకి ఇంకా చాలా మందిని చైతన్యం చేయాలి.అది మన పట్ల, దేశం పట్ల కర్తవ్యం.మనమందరం మానసికంగా, ఒకరికొకరు ప్రేమిస్తూ చైతన్య పరుస్తూ ధైర్యం చెబుతూ.. శారీరకంగా తాకకుండా దూరాన్ని మెయింటెన్‌ ‌చేస్తూ ఉండాలి.గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఆరోగ్యం మన హక్కు , దేశం పట్ల బాధ్యత.

మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.భిన్నత్వంలో ఏకత్వం దీనికున్న  ప్రత్యేకమైన గొప్ప లక్షణం.ఇదే మన బలం. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇదే మన బలహీనత అవుతుందేమో అని నేను భావిస్తున్నాను. తమ దేశంలో పుట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఈ వైరస్‌ని చైనా నియంతృత్వంతో పూర్తి స్థాయిలో దాదాపు నియంత్రించగలిగిందికానీ మన దేశంలో అలా కుదరదు కాబట్టి, మన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యపరచడమే ప్రధాన అజెండాగా తీసుకున్నాయి.కానీ అతి త్వరలో మన స్టేడియాలు, ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లు, కాలేజీలు, ఆస్పత్రులుగా, ఐసోలేషన్‌ ‌వార్డులుగా మారే పరిస్థితి రావచ్చు. ఇంట్లో కూర్చుని, పార్టీలు చేసుకుంటూ, కరోనా మీద మీమ్స్ ‌చేస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్న మనం, మన వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి, సేవ చేయలేకున్నా కనీసం, వైరస్‌ ‌కి వాహకాలుగా ఐనా మారకుండా ఉండాలి. మన భవిష్యత్తు తరాలకి మనం స్వచ్ఛమైన ప్రకృతి ఇవ్వలేదు, త్రాగే నీరు ఉంచలేదు, సుస్థిర అభివృద్ధి అనే భావనను కొంచెం కుడా ఆలోచించ లేదు.కానీ అవన్నీ ఇచ్చినా ఇవ్వకున్నా కనీసం ప్రాణాలైనా కాపాడుదాం. ముందు తరాలకు కృతజ్ఞతగా, భవిష్యత్‌ ‌తరాలకు బహుమతిగా, మనకు మనం ఇచ్చుకొనే కానుకగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.ఆరోగ్యం పట్ల అవగాహన, చైతన్యం మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఔషధం, చికిత్స. సాధారణం గా మిగిలిన వ్యాధులకు నివారణంగా ఏం చేయాలో చెపుతారు, కానీ కరోనాకి ఒకటే నివారణ. ఏమి చేయకండి.. ఇంట్లోనే ఉండండి, అంతే.ఇది ఇలాగే కొనసాగితే వచ్చే దుష్పరిమాణాల  గురించి ఆలోచిం చకుండా, కొనసాగించకుండా ఏం చేయాలో ఆలోచిస్తూ ముందుకెళ్దాము. ఆయుష్మాన్‌ ‌భవ అంటూ ఆరోగ్య భారత్‌ని కాపాడుకుందాము…
– శ్రావణసంధ్య

Leave a Reply