Take a fresh look at your lifestyle.

ప్రజల సొమ్ము .. కంపెనీల పాలు ..!

“కొరోనా వాక్సిన్‌ ‌ల అవసరం విపరీతంగా ఉన్న నేపథ్యంలో దేశాలు ప్రమాదకర పెట్టుబడులు(రిస్క్ ఇన్వెస్ట్ ‌మెంట్స్) ‌పెట్టి వాక్సిన్‌ ‌లాభాలు ఆర్జించే కంపెనీలకి ముందస్తు ఆర్డర్లు ఇస్తూ పెట్టుబడులు సమకూరుస్తున్నాయి. ప్రజల నిధులు పెట్టుబడిగా ముందే దిగమింగి ప్రజా సేవ చేస్తున్నట్టు మందుల కంపెనీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి.”

Aruna journalist
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

భారత మెడికల్‌ ‌కంపెనీలు తమ గల్లా పెట్టెల నుంచి వాక్సిన్‌ ‌కోసం పెట్టుబడులు బయటకి తీయటానికి సిద్ధం కాకపోవటంతో భారత ప్రభుత్వం కూడా అమెరికా, ఇంగ్లాండ్‌ ఇతర దేశాల వలెనే వాక్సిన్‌ ఉత్పత్తి కోసం ముందే కంపెనీలకి పెట్టుబడి నిధులు సమకూర్చడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బయో లాజికల్‌ ఇ’‌స్‌ ‌కోవిడ్‌ -19 ‌వ్యాక్సిన్‌ ‘‘‌కార్బెవాక్స్’’ ‌లాంచ్‌ ‌కావడానికి ముందే 30 కోట్ల వాక్సిన్‌ ‌డోసులు బుక్‌ ‌చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దేశంలో సామూహిక రోగనిరోధకత సాధిం చటానికి ఈ నిర్ణయం అని ప్రభుత్వం చెబు తున్నది. ప్రభుత్వ ఈ వైఖరి వలన కంపెనీకి 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి నిధులు ముందస్తు ఆర్డర్‌ ‌రూపంలో అందింది. ఇప్పటివరకు టీకాల పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన మొదటి పెట్టుబడి ఇది. ఇంకా జాతీయ రెగ్యులేటరీ ఆమోదం పొందని కోవిడ్‌ -19 ‌వ్యాక్సిన్‌ ‌పై ప్రభుత్వం తన నిధులను ఇన్వెస్ట్ ‌చేయటం ఆశ్చర్యంగా అనిపించటం షరా మాములే. ‘‘కార్బెవాక్స్’’ అని పిలువబడే బయో ఇ రెండు- డోసుల వ్యాక్సిన్‌ ‌భారతదేశంలో లభించే చౌకైన కోవిడ్‌ -19 ‌వ్యాక్సిన్లలో ఒకటిగా ఉండబోతుంది అని చెబుతున్నారు. దీని ఉత్పత్తి పెంచడం సులభం అని కూడా చెబుతున్నారు.

కార్బెవాక్స్ ‌రికాంబినేన్ట్ ‌ప్రోటీన్‌ ‌ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రికాంబినేన్ట్ ‌ప్రోటీన్‌ ‌ప్లాట్‌ఫారమ్‌ను భారతదేశంలో మరే ఇతర వాక్సిన్లు ఉపయోగించటం లేదు. రికాంబినేన్ట్ ‌ప్రోటీన్‌ ‌ప్లాట్‌ఫారమ్‌ ‌టీకా ••=•-•శీ•-2 వైరస్‌ ‌నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని, ఇది శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో సహాయపడుతుంది అని చెబుతున్నారు. అంటే ఈ వాక్సిన్‌ ‌శరీరంలో స్పైక్‌ ‌ప్రోటీన్‌ ‌ను పెంచుతుంది.ఇతర టీకాలు కూడా శరీర కణాలను స్పైక్‌ ‌ప్రోటీన్‌ ‌తయారు చేయడానికి సూచనలు ఇవ్వడం ద్వారా స్పైక్‌ ‌ప్రోటీన్‌ను పెంచే లక్ష్యం పూర్తి చేస్తాయి. ఐతే కార్బెవాక్స్ ‌ప్రయోగశాలలో అమరిక ద్వారా పెంచిన క్లోన్‌ ‌చేసిన స్పైక్‌ ‌ప్రోటీన్ల నిర్దిష్ట మోతాదును శరీరంలోకి ఇంజెక్ట్ ‌చేయడం ద్వారా స్పైక్‌ ‌ప్రోటీన్‌ను పెంచే లక్ష్యం పూర్తి చేస్తుంది. ఇలా చేయటం వలన శరీరం స్పైక్‌ ‌ప్రోటీన్‌ను ముప్పుగా పరిగణించి రోగనిరోధక ప్రతిస్పందనను శరీరం తనంతట తానే అభివృద్ధి చేస్తుందని చెబుతున్నారు. హెపటైటిస్‌ ‌బి వంటి ఇతర వైరస్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొంది ంచడానికి ఇటువంటి ప్రక్రియ చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు.

మహమ్మారి ప్రారంభ కాలంలో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని బేలర్‌ ‌కాలేజ్‌ ఆఫ్‌ ‌మెడిసిన్‌ ‌పరిశోధకులు స్పైక్‌ ‌ప్రోటీన్‌ను తమ లక్ష్యంగా ఉపయోగించుకునే శరీర జన్యు క్రమాన్ని వెలుగులోకి తెచ్చారు. స్పైక్‌ ‌ప్రోటీన్‌ ‌కోసం జన్యువును ఈస్ట్‌లో పెంచి, ఆపై శుద్ధి చేసినట్లు బిసిఎం నేషనల్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌ట్రాపికల్‌ ‌మెడిసిన్‌ ‌ప్రొఫెసర్‌ ‌మరియు డీన్‌ ‌డాక్టర్‌ ‌పీటర్‌ ‌హోటెజ్‌ ‌తెలిపారు. ఆగస్టు 2020లో, బిసిఎం మరియు బయో ఇ కంపెనీలు భారతదేశంలో క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌ద్వారా ఈ టీకా అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు కంపెనీలు వాక్సిన్‌ ఉత్పత్తి చేసి ప్రపంచానికి వాక్సిన్‌ అమ్మకానికి ప్రణాళిక చేసుకున్నాయి. యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌మరియు యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు గత సంవత్సరం ఫైజర్‌ ‌మరియు ఆస్ట్రాజెనెకా చేత అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్లలో ప్రస్తుతం భారత్‌ ‌లాగే ప్రమాదకర పెట్టుబడులు (రిస్క్ ఇన్వెస్ట్ ‌మెంట్స్) ‌పెట్టాయి. కంపెనీల వాక్సిన్లు అభివృద్ధి దశలో ఉండగానే ఆర్డర్‌ ఇచ్చి ఆయా కంపెనీలకి ప్రభుత్వ నిధులతో వ్యాక్సిన్‌ ‌తయారీ కోసం పెట్టుబడి నిధులు అందించటం జరిగింది.

ఐతే భారతీయ బయోటెక్‌ ‌కో వ్యాక్సిన్‌ ‌మరియు సీరం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా (•××) కోవిషీల్డ్ ‌వాక్సిన్‌ ‌కు జనవరి 3 న జాతీయ రెగ్యులేటరీ పరిమిత అనుమతి ఇచ్చిన తరవాతే భారత ప్రభుత్వం తన మొదటి ఆర్డర్‌ ఇచ్చింది.మనం చూసాం కంపెనీలు వాక్సిన్‌ ‌కి ఉన్న డిమాండ్‌ ‌తీర్చడానికి..ఉత్పత్తి పెంచడానికి ముందుకు రావడం లేదు అనేది మనకు స్పష్టంగా కనిపించింది వాక్సిన్‌ ‌కొరత రూపంలో. గతంలో సీరం సీఈఓ అదార్‌ ‌పూనవల ఒక టెలివిజన్‌ ‌న్యూస్‌ ‌ఛానెల్‌తో మాట్లాడుతూ, ‘‘తమ సంస్థకు వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 3,000 కోట్ల నిధులు కావాలని తాము అంత పెట్టుబడి పెట్టి ఒత్తిడి తీసుకోలేమని అందుకే ప్రభుత్వం నుంచి నిధులు కోరుతున్నామని, నిధులు అందితే భారతదేశ వాక్సిన్‌ ‌డిమాండ్‌ను తమ సంస్థ తీర్చగలదని’’ చెప్పారు. సీరం సీఈఓ అదార్‌ ‌పూనవల ప్రకటన తరవాత వాక్సిన్‌ ‌సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరం కి రు .3వేల కోట్లు మరియు భారత్‌ ‌బయోటెక్‌కు 1,500 కోట్ల రూపాయలు ‘‘ముందస్తు చెల్లింపు’’ చేయడానికి ఏప్రిల్‌ 19 ‌న ఆర్థిక మంత్రిత్వ శాఖ నిబంధనలు సడలించింది. దీని తరవాత కూడా కూడా సీరం సీఈఓ అదార్‌ ‌పూనవల సంతృప్తి చెందలేదు. మళ్ళీ ఓ నెల తరువాత, పూనవల మరొక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వాక్సిన్‌ ‌తయారీ కోసం భారత ప్రభుత్వం కంపెనీకి చేసిన నిధుల కేటాయింపులో ఎక్కువ భాగం కోవిడ్‌ -19 ‌వ్యాక్సిన్‌ ‌కోసం భారత ప్రభుత్వం మునుపటి వాక్సిన్‌ ఆర్డర్లకి ఉపయోగించబడింది, కోవిషీల్డ్ ఉత్పత్తిని పెంచడానికి తగినంత ముందస్తు పెట్టుబడి నిధులు ప్రభుత్వం ఇవ్వకుండా సీరం సంస్థను ప్రభుత్వం వదిలివేసింది అని ఏకరువు పెట్టారు.

ఫైజర్‌-‌బయోఎంటెక్‌ ‌మరియు మోడెర్నా-ఎన్‌ఐఐఐడి అభివృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఎ ‌వాక్సిన్‌ ‌లతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో లభించే ఇతర వ్యాక్సిన్లను సేకరించడానికి ప్రభుత్వం చాలా కష్టపడుతోంది. మే 24 న, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌మాట్లాడుతూ, ఫైజర్‌ ‌మరియు మోడెర్నా కంపెనీల ఆర్డర్‌ ‌పుస్తకాలు ‘‘ఇప్పటికే నిండి ఉన్నాయి’’ అని చెప్పారు. కొరోనా వాక్సిన్‌ ‌ల అవసరం విపరీతంగా ఉన్న నేపథ్యంలో దేశాలు ప్రమాదకర పెట్టుబడులు పెట్టి వాక్సిన్‌ ‌లాభాలు ఆర్జించే కంపెనీలకి ముందస్తు ఆర్డర్లు ఇస్తూ పెట్టుబడులు సమకూరుస్తున్నాయి. ప్రజల నిధులు పెట్టుబడిగా ముందే దిగమింగి ప్రజా సేవ చేస్తున్నట్టు మందుల కంపెనీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి.

Leave a Reply