కౌంటింగ్ కేంద్రాల్లో .. నేతల మోహరింపు
- గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించే యోచనలో టీఆర్ఎస్
- అధికార పార్టీ వలలో చిక్కకుండా కాపాడుకునే జాగ్రత్తలో కాంగ్రెస్, బీజేపీ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఎన్నికలలో విజేతలెవరో నేడు తేలనుంది. తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే సమయం దగ్గర పడటంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. శనివారం ఫలితాల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఆయా లెక్కింపు కేంద్రాలలో తమ నేతలను మోహరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుండటంతో బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూంల నుంచి మొదలుకుని మొత్తం ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల ఈనెల 27నజరుగనుంది.