- నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంట్ గ్రీన్ సిగ్నల్
- సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు
- తదుపరి ఆదేశాలు వొచ్చేవరకు కౌంటింగ్ నిలిపివేత
- ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధప్రతేశ్లో మండల,జడ్పీ పరిషత్ ఎన్నికలు గురువారం యధావిధిగా జరుగుతాయి. పరిషత్ ఎన్నికలకు ఆంధప్రదేశ్ హై కోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టేసింది. యథావిధిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో నేడు పరిషత్ ఎన్నికలు జరగ నున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్ నిలిపివేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరం వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఎస్ఈసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సీవీ మోహన్ రెడ్డి.. పిటిషన్ వేసిన వర్ల రామయ్యకు ఎన్నికలతో సబంధం లేదని తెలిపారు. 28 రోజుల కోడ్ నిబంధన ఎన్నికలకు వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్ రెడ్డి హై కోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ఇరు పక్షాల వాదలను విన్న బెంచ్ పరిషత్ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ సందరర్భంగా పరిషత్ ఎన్నికలు ఆపేందుకు నాకు ఎలాంటి కారణమూ కనిపించలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తేల్చేశారు. ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ అంటూ… ఒకటే తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది కరోనా కారణంగా నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ… కోడ్ మాత్రం అమలులో ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల వాయిదా విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిరవధికంగా కోడ్ అమలులో ఉండ కూడదని… పోలింగ్ తేదీకి 4వారాల ముందు నుంచి తిరిగి అమలులోకి తేవాలని స్పష్టం చేసింది. వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అనేక వివాదాలు అలుముకున్నాయి.
ఎప్పుడో ఏడాది కిందట ఆగిపోయిన ఎన్నికల పక్రియ ఇది. అప్పట్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు జరిగిన తీరును వివరించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో పలువురు మరణించారు. కొందరు పార్టీలు మారారు. వీటన్నింటి నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల పక్రియను మొదటి నుంచి జరపాలన్నది విపక్షాల డిమాండ్. దీనిపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఎన్నికలు జరుపుకోవచ్చని తీర్పునించింది. దీంతో గురువారం యధావిధిగా ఎన్నికల నిర్వహణకు కమిషన్ చర్యలు తీసుకుంది.