Take a fresh look at your lifestyle.

95 శాతం పాజిటివ్ కేసుల్లో కొరోనా లక్షణాలు కనిపించడం లేదు

  • వ్యాక్సినేషన్‌ ‌పక్రియను సమర్థంగా నిర్వహిస్తున్నాం
  • ప్రైవేటు హాస్పిటల్స్ ‌మానవతా ధృక్పథంతో సేవలందించాలి
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయనీ, అయితే, గతంలో 85 శాతం మంది బాధితుల్లో లక్షణాలు లేకుండా ఉంటే ప్రస్తుతం 95 శాతం మందిలో ఆ లక్షణాలు కనిపించడం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామనీ, ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా చికిత్స తీసుకోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్స్ ‌యాజమాన్యాలు వ్యాపార కోణంలో కాకుండా మానవతా ధృక్పదంతో ఆలోచించి ప్రజలకు ధైర్యం చెప్పి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌నిర్ధారణ అయిన బాధితులకు లక్షణాలు ఉంటే వెంటనే కొరోనా కిట్‌ ఇచ్చి వారిని హోం ఐసోలేషన్‌కు తరలిస్తున్నామనీ, లక్షణాలు ఉన్న వారికి హాస్పిటల్స్‌కు పంపించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం బుధవారం కోఠిలోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో కొరోనా నియంత్రణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రపంచం, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం గమనిస్తోందనీ, అందుకు తగిన విధంగా జాగత్త్రలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల మందికి వ్యాక్సినేషన్‌ అం‌దజేస్తున్నామనీ, ఈ సంఖ్యను త్వరలోనే 1.50 లక్షలకు పెంచుతామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ ‌పక్రియను ఓవైపు కొనసాగిస్తూనే టెస్టుల సంఖ్యను సైతం లక్ష దాకా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలోని పిహెచ్‌సిల వరకు ర్యాపిడ్‌ ‌టెస్టులు అందుబాటులో ఉన్నాయనీ, దీంతో ఫలితం వెంటనే అందుబాటులోకి వస్తుందన్నారు.

గతంలో ఆర్టిపిసిఆర్‌ ‌టెస్టుల ఫలితం రావడానికి చాలా సమయం పట్టేదనీ, ఇప్పుడు ఫలితాలు త్వరగానే వస్తున్నందున కాంటాక్ట్ ‌ట్రేసింగ్‌ ‌సులభమవుతోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 22 దవాఖానాలలో పెద్ద మొత్తంలో ఆక్సీజన్‌ ‌సిలిండర్లు, 11 వేల ఆక్సీజన్‌ ‌బెడ్లు ఏర్పాటు చేశామనీ, ఐసీయూల సంఖ్యను కూడా అవసరమైన సంఖ్యలో పెంచుతున్నట్లు చెప్పారు. కోవిడ్‌ ‌బాధితుల కోసం జిల్లాల వారీగా ప్రభుత్వ ఐసోలేషన్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, ఈ కేంద్రాలలో అన్ని రకాల మందులు సామాగ్రి సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామనీ, మహారాష్ట్రలో కోవిడ్‌ ‌కేసులు భారీ సంఖ్యలో ఉన్న దృష్ట్యా సరిహద్దు జిల్లాలలో పూర్తి స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply