
తెలకపల్లి : తెలకపల్లి మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో పత్తి రైతులు ఎక్కువగా ఉన్నారని కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల రైతులు వివిధ ప్రాంతాలకు పతి ని తీసుకెళ్లి ప్రయాణం ఖర్చుతో నష్టపోతున్నారని అన్నారు మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఉంటే తక్కువ ఖర్చుతో రైతుల పత్తి విక్రయించి నష్టపోకుండా ఉంటారని అన్నారు.
సీసీఐఅధికారులకు ముందుచూపు లేకపోవడం వల్ల రైతులు ఇతర ప్రాంతాలకు ప్రతి విక్రయాలకు వెళ్లి రోజుల తరబడి కాటన్ మిల్లు వద్ద రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే తెలకపల్లి లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలకపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు మండల కేంద్రానికి చేరుకున్న జెడ్పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతికి వినతి పత్రం అందజేశారుఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జి లక్ష్మణ్ విజయ్ గౌడ్ అర్జున్ నిరంజన్, శివ ,లక్ష్మయ్య అబ్బాస్ జగదీష్ కాశన్న వినోద్ కుమార్ శేఖర్ తో పాటు రైతులు పాల్గొన్నారు.
Tags: Cotton buying center,established,thalakapalli mandala,telangana