“2019లో 63 మంది రెవెన్యూ అధికారులు పట్టుబడినట్లు స్పష్టమైన ఆధారాలు తేటతెల్లం చేస్తున్నాయి. రెవెన్యూ అధికారులు లంచాలకు పాల్పడడం అలవాటుగా పెట్టుకున్నారు. రెవెన్యూ తహసీల్దార్లు అనేక భూవిషయాలలో ప్రత్యక్షంగా తలదూర్చి కోట్లు ఆర్జిస్తు, డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారు. రాజధానిలో కోట్లాది రూపాయల విలువైన భవనాలలో జీవిస్తూ, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పలుమార్లు రెవెన్యూ, అధికారులను అవినీతిపై హెచ్చ రిస్తున్నా వారి వ్యాఖ్యలను తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ కే చెడ్డపేరు తెస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారులు లంచాలకు పాల్పడుతున్నట్లు ఆధారాల ద్వారా స్పష్టమవుతున్నది. హైదరాబాద్ నగర శివార్లలో ,అన్ని జిల్లాల్లోనూ, మండలాలలొ భూముల ధరలు అధికంగా ఉండటం వల్ల రెవెన్యూ, శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.రెవెన్యూ శాఖ అధికారులు ఇకనైనా మారండి.ఈ అవినీతి అక్రమాలకు చరమగీతం పాడండి.ప్రభుత్వం కూడా అవినీతి అధికారులను ఉపేక్షించే కూడదు.”
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది అని చెప్పవచ్చు. చేయి తడపనిదే ఫైల్ కదిలే పరిస్థితి లేదు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒకవైపు లంచావతారుల భరతం పడుతున్న మరోవైపు నిస్సిగ్గుగా, బహిరంగంగానే లంచాలు తీసు కోవడానికి బరి తెగిస్థూ రెవెన్యూ శాఖను అప్రతిష్టపాలు చేస్తున్నారు.తాజాగా మేడ్చల్ జిల్లా కీసర తహసిల్దారు నాగరాజూ అదే మండలం రాంపల్లి దయార సర్వే నంబెర్ 604 నుండి 614 వరకు పూర్వీకుల నుండి ఒక కుటుంబానికి 44 ఎకరాల భూమి సంక్ర మించడం, అయితే భూ హక్కులపై ఆ కుటుంబ సభ్యుల మధ్య వివాదమై రగడ నడుస్తూ వుండటం, ఇటి విషయం నాగరాజూ దృష్టి కి పోవడం తాను డీలు చేస్తానని ఆందుకు రెండు కొట్లకి డీల్ మాట్లాడుకోని రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకి నేరుగా పట్టుపడటం రాష్ట్ర వ్యాప్తంగా గాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులు ఎవరు ఫిర్యాదు చే యకుండానే అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టి అతి పెద్ద కట్టల పాము,(అవినీతి అనకొండ ) అయిన నాగరాజూ ను చాక చక్యముగా పట్టుకోవడం అవినీతి నిరోధక శాఖ చరిత్ర లోనే మొట్ట మొదటి ఘటనగా చెప్పవచ్చు. తదుపరి వారి ఇల్లు, వ్యవసాయ భూములు తనీఖీ చేయగా సుమారు 200 కోట్ల ఆస్తులు కూడబెట్టడం జరిగిందని వారు తెలిపారు.గతంలో వివిధ ప్రాంతాలలో తహసిల్దారుగా పనిచేసినపుడు పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడ్డారని తెలుస్తుంది.నగరాలు, పట్టణ శివారు ప్రాంతములలో భూముల ధరలు అధికంగా పెరగడం, వివాదం వున్న భూముల వివరాలు తెలుసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారితో నేరుగా డీల్ కుదుర్చుకుని కోట్లాది రూపాయలు సంపాధించి విలాస జీవితం గడుపుతున్నారు.
సత్య డెవలపెర్ సంబంధించిన 28 ఎకరాల భూమి వ్యవహారమూలో ఈ భారీ అవినీతి కి తహసిల్దారు నాగరాజూ పాల్పడినట్లు తెలుస్తుంది. నాగరాజూ ని చూస్తె అమాయకంగా రాముడు మంచి బాలుడుగా కనిపిస్తూ వున్నాడు. రెండు నెలల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో బంజారాహిల్స్ భూవివాదం కేసులో లంచం తీసుకుంటూ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ లు పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంజారాహిల్స్ లో రూ.40 కోట్ల విలువైన భూమిని డీల్ చేయడంలో భాగంగా బాధితుడు నుండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ 30 లక్షలు డిమాండ్ చేయడం బాధితుడి ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ అధికారులు 15 లక్షల లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను, కేసు మాఫీ చేస్తామని మూడు లక్షలు డిమాండ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్టు చేయడం, ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే షేక్‌పేట మండల రెవెన్యూ అధికారి సుజాత ప్రమేయం ఉందని అదుపులోకి తీసుకుని విచారించి ,ఆమె ఇంటిపై దాడులు చేసి రూ.30 లక్షల నగదును, బంగారు ఆభరణాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.‘‘సత్యమేవ జయతే ‘‘ అనే నినాదంని కొందరు రెవెన్యూ అధికారులు అపవిత్రం చేస్తూ రెవెన్యూ శాఖాకి మచ్చ తెస్తున్నరు.రెవెన్యూ శాఖ పరువు,ప్రతిస్టలను మంట గలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు బహిరంగంగానే భూ వివాదాలలో తలదూర్చి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినవస్తూన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న తహసీ•ల్దార్లు ఇటీవల కాలంలో మరీ లంచాలకు బరితెగిస్తున్న ట్లు తెలుస్తుంది. గత సంవత్సరము జూలై నెలలో కేశంపేట తహసిల్దార్ ఇంటిపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.95 లక్షలు నగదును మరియు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగు నెలల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో సెక్షన్ అధికారి గా పనిచేస్తూన్న అధికారి 13 లక్షలు డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. 2018 సంవత్సరంలో రెవెన్యూ శాఖ లో సుమారు 50 మంది రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 2019లో 63 మంది రెవెన్యూ అధికారులు పట్టుబడినట్లు స్పష్టమైన ఆధారాలు తేటతెల్లం చేస్తున్నాయి. రెవెన్యూ అధికారులు లంచాలకు పాల్పడడం అలవాటుగా పెట్టుకున్నారు.
రెవెన్యూ తహసీల్దార్లు అనేక భూవిషయాలలో ప్రత్యక్షంగా తలదూర్చి కోట్లు ఆర్జిస్తు, డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారు. రాజధానిలో కోట్లాది రూపాయల విలువైన భవనాలలో జీవిస్తూ, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పలుమార్లు రెవెన్యూ, అధికారులను అవినీతిపై హెచ్చ రిస్తున్నా వారి వ్యాఖ్యలను తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ కే చెడ్డపేరు తెస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారులు లంచాలకు పాల్పడుతున్నట్లు ఆధారాల ద్వారా స్పష్టమవుతున్నది. హైదరాబాద్ నగర శివార్లలో ,అన్ని జిల్లాల్లోనూ, మండలాలలొ భూముల ధరలు అధికంగా ఉండటం వల్ల రెవెన్యూ, శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.రెవెన్యూ శాఖ అధికారులు ఇకనైనా మారండి.ఈ అవినీతి అక్రమాలకు చరమగీతం పాడండి.ప్రభుత్వం కూడా అవినీతి అధికారులను ఉపేక్షించకూడదు. అవినీతి అధికారులను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలి. వారి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఏసీబీ కేసులు లోని అవినీతి అధికారులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై నిర్ణీత కాలంలో ఏసీబీ నివేదికను రూపొందించినా, వారిపై శాఖాపరమైన విచారణ చేయకుండా సచివాలయంలోని సంబంధిత విభాగాలు జాప్యం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొరొనా నియంత్రణ లో తమ వంతుగా బాధ్యతలు నిర్వహించి శభాశ్ అనిపించుకున్నారు. కొంత మంది రెవెన్యూ అధికారులు. అవినీతి, అక్రమాలు నాగరాజు లాంటి లంచరాజుల వల్ల తెలంగాణా రెవెన్యూ శాఖ కి ప్రజలలో చెడ్డ పేరు వస్తూంది.అలాగే రెవెన్యూశాఖలో నిత్యం ఎవరో ఒకరి మీద ఆరోపణలు రావడం,అవినీతి నిరోధక శాఖ కి పట్టుపడడం సర్వ సాధారణం అయిపోయింది…అవినీతి నిరోధక శాఖ కి పట్టుపడిన రెవెన్యూ అధికారులను ఉద్యోగం నుండి శాశ్వతముగ తొలగించే చట్టం తేవాలి. వారి ఆస్తులను ప్రభుత్వము జప్తు చేయాలి.ప్రజలు రెవెన్యూ అనగానే ‘‘ ఛీ’’ కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలముల తహసిల్దారులు,సిబ్బందిపై నిఘా పెట్టాలి.రెవెన్యూ అధికారుల అవినీతి పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. సూర్యాపేట జిల్లా మటంపల్లి మాజీ తహసిల్దారు చంద్ర శేఖర్, ప్రస్తుత తహసీ•ల్దారు వేణుగోపాల్ లు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిన నేపధ్యం లో,ఈ ఉదంతం వెలుగు లోకి రావడంతో సూర్యాపేట జిల్లా పాలనాధికారి వారిని సస్పెండ్ చేయడం జరిగింది.ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి.అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ తహసీల్దారులను విచారిస్తే వారి అక్రమ బాగోతం బయటకు వచ్చే అవకాశం ఉంది.
