Take a fresh look at your lifestyle.

అం‌తా మా ఇష్టం

  • నాసిరకంగా చేపడుతున్న  అభివృద్ధి పనులు పట్టించుకోని అధికారులు
  • ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు

పరిగి మున్సిపాలిటీ పట్టణం రోజుకో అభివృద్ధి తో ముందుకు సాగుతుంటే పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో కాంట్రాక్టర్‌ ‌పగ్గాలను పట్టుకునే వారే కరువైయ్యారు. కాంట్రాక్టర్‌ ‌చిన్న స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ముడుపులు అందిస్తూ తన ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు . పరిగి మున్సిపాలిటీలో నాసిరకంతో రోడ్లు వేసి కోట్ల రూపాయలు దోచుకుంటుంటే దానికి సంబందిత అధికారులు వత్తాసు పలుకుతున్నారు. 100% ఇసుకను వాడకుండా డస్టును వాడుతూ ,దానితో పాటు నాట్‌ ‌ఫర్‌ ‌రీటెల్‌ ‌సెల్‌ ‌సిమెంట్‌ ‌వాడుతున్నాడు కాంట్రాక్టర్‌.‌రోడ్డు సైడున ఉన్న పెద్ధ పెద్ద చెట్లను నరికి అమ్ముకుంటున్నారు. పరిగి పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మున్సిపాలిటీ కి చెందిన సుమారు 15 కోట్ల రూపాయలు విడుదల అయ్యయి . అందులో 10 కోట్ల టెండర్‌ ‌పక్రియ పూర్తయ్యింది.

ఈ ప్రాజెక్టులో మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుంచి పోస్టాఫిస్‌ ‌వరకు, పోస్టాఫిస్‌ ‌నుంచి తుంకుల్‌ ‌గడ్డ వరకు ,గాంధీ విగ్రహం నుంచి గంజ్‌ ‌రోడ్డు మీదుగా అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు ,కోర్టు చౌరస్తా నుంచి తహసీల్దార్‌ ‌కార్యలయం మీదుగా పోలీస్టేషన్‌ ‌నుండి శ్రీనివాస కాలని వరకు ఈ రోడ్ల పనులు జరుగుతున్నాయి . వీటికోసం సుమారుగా 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. మున్సిపల్‌ ‌నిధులతో డబల్‌ ‌రోడ్లు ,తుంకుల్‌ ‌గడ్డ సింగిల్‌ ‌రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్లపనుల్లో నాయకుల అండదండలు ఉన్నాయనే ధీమాతో అధికారులను తన చేతిలో పెట్టుకొని డబ్బులు మిగిలించుకునే ప్రయత్నంలో నాసిరకంగా పనులు చేపడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి , కాంట్రాక్టర్‌ అరవింద్‌ ‌రెడ్డి పై విమర్షల వర్షం కురుస్తుంది. మీడియా మున్సిపల్‌ ఏఈ ‌రాయుడు ని వివరణ తోపాటు రోడ్డు ఇష్టీమెంట్‌ ‌కావలని అడగగా సరైన సమాధానం ఇవ్వకుండా తనకు పని ఉందని తప్పించుకుంటుంన్నాడు.

corruption in Parigi municipality

అసలు విషయాన్ని దాచిపెడుతున్నాడు, రోడ్డు ఇష్టీమెంట్‌ ‌ప్రకారం సీసీ రోడ్డు మొత్తం 100% ఇసుకతో వెయ్యాలి సైజు ప్రకారం కంకర వెయ్యాలి,నాణ్యమైన సిమెంట్‌ ‌వాడలి అలా వాడకుండా ఒక్క డస్టూ మాత్రమే వాడుతూ , నాట్‌ ‌ఫర్‌ ‌రిటేల్‌ ‌సెల్‌ ‌సిమెంట్‌ ‌వాడుతున్నాడు, ఈ నాట్‌ ‌ఫర్‌ ‌రిటేల్‌ ‌సెల్‌ ‌సిమెంట్‌ ఎక్కడి నుంచి తెచ్చాడో కాంట్రాక్టర్‌. అదేవిధంగా బీటిరోడ్లో పాతరోడ్డును తొలగించాలి తొలగించకుండా పనులు చేపడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజ ధనాన్ని నిలువునా దోచుకుంటుంన్నాడు కాంట్రాక్టర్లు. గతంలో ఉన్న పాత రోడ్డును పూర్తిగా తొలగించాలి ఆతర్వాత రోడ్డు పనులు చేపట్టాలి ,పాత రోడ్డును వదిలేసి సైడ్‌ ‌రోడ్డును తవ్వి అక్కడ మాత్రమే కంకర వేసి రోడ్డు పనులను చేపడుతున్నాడు కాంట్రాక్టర్‌ అరవింద్‌ ‌రెడ్డి.

corruption in Parigi municipality

అదే విధంగా రోడ్డు పక్కల ఉన్న చెట్లను కొట్టి వాటిని అమ్ముకుంటుంన్నారు. అధికారులు కాసులకు కక్కుర్తి పడి పనులు జరిగే సమయాల్లో చుట్టపు చూపులుగా వచ్చి వెళ్తున్నారు.నాసిరకం పనులపై పలువురు పిర్యాదు లు చేసిన కాంట్రాక్టర్‌ ‌తో కుమ్మక్కై నాసిరకం పనులపై జోప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం జరగకుండా రోడ్లు ,సైడ్‌ ‌డైనేజ్‌ ,ఇతరాత్ర పనులు నాణ్యతగా ఉండేలా మున్సిపాలిటీ అభివృద్ధి కి తోడ్పడాలని పరిగి పట్టణ ప్రజలు కోరుతున్నారు.

corruption in Parigi municipality

Leave a Reply