Take a fresh look at your lifestyle.

దిద్దుబాటు చర్యలు ..!

“ఏదైతేనేం, అన్నీ కాకపోయినప్పటికీ కొన్ని అంశాలలో ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసి వచ్చింది. ఇప్పటికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన వివిధ అంశాల పట్ల, ముఖ్యంగా ప్రజా భాగస్వామ్యం, అవగాహన పెంచే కార్యక్రమాలు, మద్దతు వ్యవస్థల మీద సానుకూలంగా మరింత దృష్టి సారించగలిగితే అతి తొందరలోనే వైరస్ కట్టడిలో తెలంగాణ విజయం సాధించగలుగుతుంది.జర్మనీ లాంటి దేశాలలో అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు ఆరోగ్య వసతులు సంపూర్తిగా కల్పించి, ఏ విధమైన వివక్షా లేకుండా రోగులందర్నీ ఒకే విధంగా చూసుకున్నచోట మరణాల సంఖ్యను బాగా కట్టడి చేయగలిగారు. ఇలాంటి సానుకూల పద్ధతులను అధ్యయనం చేయాలి.”

k sajayaకరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదంటే అవును కాబోలనుకున్నారు ప్రజలందరూ! రెండున్నర నెలల లాక్ డౌన్ తర్వాత నిజంగా ఎవరైనా ఆశించేది ఏమిటి? వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టటం. కానీ, అలా జరగకపోగా, దేశమంతా కూడా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువయిపోయింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి కారణం ఎవరు?  ప్రభుత్వాలు నిర్లజ్జగా ప్రజల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెబుతోంది. పైగా, సామాజిక మాధ్యమాలలో, ‘వైరస్ బారిన పడిన వారి సంఖ్య 250 వున్నప్పుడు ప్రజలు ‘పానిక్ మోడ్’(భయం) తో వుంటే, ఇప్పుడు రెండున్నర లక్షల మంది వైరస్ పాజిటివ్ వుంటే ‘పిక్నిక్ మోడ్’(ఉల్లాసం)లో

కరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదంటే అవును కాబోలనుకున్నారు ప్రజలందరూ! రెండున్నర నెలల లాక్ డౌన్ తర్వాత నిజంగా ఎవరైనా ఆశించేది ఏమిటి? వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టటం. కానీ, అలా జరగకపోగా, దేశమంతా కూడా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువయిపోయింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి కారణం ఎవరు?  ప్రభుత్వాలు నిర్లజ్జగా ప్రజల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెబుతోంది. పైగా, సామాజిక మాధ్యమాలలో, ‘వైరస్ బారిన పడిన వారి సంఖ్య 250 వున్నప్పుడు ప్రజలు ‘పానిక్ మోడ్’(భయం) తో వుంటే, ఇప్పుడు రెండున్నర లక్షల మంది వైరస్ పాజిటివ్ వుంటే ‘పిక్నిక్ మోడ్’(ఉల్లాసం)లో వున్నారనే’ తప్పుడు సంకేతాలతో మెసేజులు చలామణి అవుతున్నాయి. అంటే, వైరస్ తగ్గుముఖం పట్టకపోవటానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని నెపం మోపుతున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టక పోవటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎక్కడా లేదా? ఈ ప్రశ్నలు మాత్రం ఎవరూ వేయకూడదు? వేసిన వాళ్లు ప్రభుత్వ వ్యతిరేకులు, ఇంకా చెప్పాలంటే దేశద్రోహులు కూడా అయిపోతారు!

కులం, మతం, వర్గాలకి అతీతంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ వ్యాపితంగా గణాంకాలు ఘోషించినా,ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా కానీ, మనదేశానికి వచ్చేసరికి ఈ జాడ్యాలన్నీ అంటుకుని చెప్పరానంత నష్టాన్ని కలుగజేశాయనటంలో అసలు సందేహమే అవసరం లేదు. ఎంత టెలిఫోన్ రింగ్ టోనుల్లో ‘కరోనా వైరస్ బాధితులకు అండగా వుండటం మన బాధ్యత’ అని పదే పదే చెప్పినప్పటికీ వాస్తవానికి జరిగేది మాత్రం బాధితుల పట్ల తీవ్రమైన వివక్షే. ఇప్పటికీ ఇవన్నీ ప్రజల రోజువారీ జీవితాల్లో ప్రతిఫలిస్తూనే వున్నాయి. దేశం మొత్తం మీద అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ (15జూన్, 2020) కోవిద్-19 వ్యాధికి  గురైనవారు మూడు లక్షల ముప్ఫైమూడు వేలకు దగ్గరగా వున్నారు. ఈ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య దగ్గర దగ్గర పదివేలకు చేరుకుంటోంది. ఒకలక్షా డెబ్భై వేలమంది దాకా కోలుకున్నారు. ఇంకా ఒకలక్షా యాభైవేలమంది వైరస్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వరకూ చూస్తే (14జూన్, 2020) దగ్గరదగ్గర ఐదువేలమంది వ్యాధి బారిన పడితే, చనిపోయినవారి సంఖ్య నూటా ఎనభై ఐదు, కోలుకున్తున్నవారి సంఖ్య రెండువేల మూడువందల పైన వుంటే, ఇన్ఫెక్షన్తో ఇంకా బాధ పడుతున్నవారి సంఖ్య రెండువేల ఐదువందల మందికి దగ్గరలో వున్నారు.

అయితే, తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు తక్కువ చేస్తున్నారనే అంశం కూడా చర్చలో వుంది. ప్రజల్లో అపోహలు తగ్గి అవగాహన పెరగాలంటే పరీక్షలు పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం వుంటుంది. లేకపోతే సమూహ వ్యాప్తి లోకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మరింత విషమించడం తప్పించి చేయగలిగింది ఏమీ వుండదు. దీనికి ఒకటే పరిష్కారం, వైద్యవ్యవస్థను పటిష్ట పరిచటం, వైద్యసిబ్బందికి వొత్తిడి లేకుండా పనిచేసే వాతావరణాన్ని కల్పించడం. రాష్ట్రం మొత్తం భారాన్ని ఒక గాంధీ హాస్పిటల్ మీదే పెట్టడం అంటే, అక్కడి వ్యవస్థని కుప్పకూలేటట్లు చేయటమే. ఎప్పుడైతే పనిగంటల ఒత్తిడి పెరుగుతుందో, వైద్య సిబ్బంది కూడా తమ అసహనాన్ని బాధిత రోగుల మీద చూపిస్తారు. నిజానికి బాధిత రోగులకు మనస్థైర్యాన్ని అందించవలసిన అవసరం ఎన్నో విధాలుగా వుంటుంది. వారిని ముందుగా భయం నుంచీ బయటపడవేయాలి. వైరస్ పాజిటివ్ రోగులను అందరికీ దూరంగా విడదీసి ఉంచాల్సి వచ్చినపుడు వారి మానసిక స్థితి మరింత దిగజారుతుంది. అలాంటప్పుడు వారికి ధైర్యం చెప్పే ఒక కౌన్సిలర్ వ్యవస్థ వుండాలి. ఇన్ఫెక్షన్ బారి నుండి తొందరగా కోలుకోవటానికి బలవర్ధకమైన ఆహారం, వారి వారి ఆహార అలవాట్లకు అనుగుణంగా  వుండాలి. ఇలాంటి సౌకర్యాలు, పరిస్థితులు కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. కానీ దురదృష్టవశాత్తూ తెలంగాణాలో ఈ రకమైన వ్యవస్థ రూపొందలేదు. ఐసోలేషన్ వార్డుల్లో కానీ, క్వారంటైన్ సెంటర్లలో కానీ ఎక్కడా కూడా ప్రజల ఆహార అలవాట్లను అనుసరించి ఆహారం ఇవ్వలేదు. నిజానికి, ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా కోలుకోవాలంటే బలవర్ధకమైన, అలవాటైన ఆహారం వుండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. వీటితో పాటు వైరస్ వ్యాప్తి మీద అవగాహన కన్నా అపోహలు, భయం మాత్రమే ఉండటం, వైరస్ బారిన పడ్డారన్న అనుమానం ఉన్నవారిని పోలీసు నిర్బంధంతో తీసుకెళ్లటం, వైరస్ లేదని నెగటివ్ గా పరీక్షల్లో తేలినాగానీ వారిపట్ల చుట్టుపక్కలవారి అనుమానాస్పద చూపులు, వెలివేసినట్లు ప్రవర్తించడం అన్నీకూడా బాధితులను మరింత కుంగతీశాయి.

వైద్య వ్యవస్థకి ప్రజా సమూహాలకీ మధ్య అనుసంధానంగా పనిచేయవలసిన సహాయ వైద్యబృందాలను, వాలంటీర్ వ్యవస్థను పెంపొందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పరిమితమైన పారామెడికల్ సిబ్బంది మీదే ఆధార పడ్డారు. ఈ రకమైన నిర్ణయంవల్ల ఆ సిబ్బంది మీద కూడా అపరిమితమైన ఒత్తిడి పడింది. వైద్య, సామాజిక రంగాల్లో పరిశోధన చేస్తున్నపౌరబృందాల సలహాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ బృందాలు, మే 5వ తారీఖున అనేక సూచనలతో ఆరోగ్య శాఖా మంత్రిని కలిసి మెమొరాండం ఇచ్చారు. దానిలో ముఖ్యాంశాలు:ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించినట్లు కొరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చెయ్యాలి. కొరోనా లక్షణాలు వున్న వారికి పరీక్షలు సులువు చెయ్యాలి. వైద్య సిబ్బందికి తగినన్ని రక్షణ కవచాలు అన్ని స్థాయిల్లో ఏర్పర్చి ప్రజారోగ్య వ్యవస్థని బల పరచాలి. ప్రజలకి క్వారంటైన్,ఐసోలేషన్ గురించిన భయాలు పోగొట్టాలి.రోగులకు, క్వారంటైన్లో వున్న వ్యక్తులకి అవసరమయ్యే ఆన్లైన్ సహాయ వాలంటీర్ వ్యవస్థని పౌర సమాజ సహకారంతో ఏర్పాటు చెయ్యాలి. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, అన్నార్తులకి రాత్రి పగలు చేయూత నందిస్తున్న తెలంగాణ పౌర సమాజ ప్రయత్నాల్ని ఇప్పటికయినా గుర్తించి ఆరోగ్య అవగాహన పెంచటంలో వారి సలహాలని స్వీకరించాలి. కోలుకున్నవారి అనుభవాలను మీడియా ద్వారా అందరికీ అందించగలిగితే ప్రజల్లో భయంపోయి, అవగాహన పెరుగుతుంది.పౌరులందరినీ సమానంగా, వివక్ష లేకుండా చూడాలనే తన రాజ్యాంగ బాధ్యతలని మాటలలో కాకుండా, చేతలలో చూపించాలి.

ఈ సలహాలతో పాటు పౌరసమూహాల నుంచీ ఆరోగ్య పరమైన అంశాల్లో సహాయ పడగలుగుతామని చెప్పినప్పటికీ వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ఆరోగ్యపరంగా సూచనలు అందించడానికి ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టకపోవడం ఏం సూచిస్తుంది?నిజానికి, ఈ సూచనలను అందించినప్పుడు పరిస్థితి ఇప్పుడున్నంత తీవ్రంగా లేదు. ఇంకా మరణాల సంఖ్య రెండంకెలలోనే వుంది. ఈ సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకున్నట్లుగా తర్వాత ఏ సమాచారమూ లేదు. దీన్ని ఏమనుకోవాలి? వేల పడకల ఆస్పత్రి, వేలసంఖ్యలో వెంటిలేటర్లు వంటి ఆర్భాటపు ప్రకటనల్లో, అసలు క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది కనీసం రక్షణ కవచాలు కూడా కొరతేననే విషయం గాలిలో కలిసిపోయింది. వాటిగురించి ఎవరైనా సిబ్బంది మాట్లాడినా, జర్నలిస్టులు మాట్లాడినా గానీ వారి నోరునొక్కే ప్రయత్నమే చేశారు కానీ, ఆ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరికి గాంధీ ఆసుపత్రి లో సమాచారం అందించనందుకు జూన్ 10న డాక్టర్ల మీద తిరగబడ్డ పేషంట్ల బంధువుల అసహనం, ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ మరణం, అనేక విషయాలను బయటకు తీశాయి.

భౌతికంగా డాక్టర్ల మీద దాడి జరగటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. కానీ, ప్రభుత్వం చేయగలిగి వుండి కూడా నిర్లక్ష్యంగా వదిలివేసిన ఎన్నో విషయాలను ఈ అంశం బయటకు తీసింది. నాలుగు కోట్ల మంది జనాభా వున్న రాష్ట్రంలో ఒకే ఒక హాస్పిటల్ కరోనా పేషంట్లకు ఎలా సరిపోతుందని జూనియర్ వైద్యులు వేసిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు. మళ్లీ పౌర సమాజం నుంచీ, ఒకప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఆరోగ్యశాఖ కార్యదర్శులుగా పనిచేసిన  విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రాక్టీసులో వున్న వైద్యులు, ఇతర సమూహాల ప్రతినిధులు చొరవ తీసుకుని ఒక బహిరంగలేఖ రాశారు.అందులో ముఖ్యాంశాలు, “గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషంట్ల చికిత్స కొరకు తక్షణం సౌకర్యాలను పెంచడం, వ్యవస్థను బలోపేతం చేయాలి. వైరస్ కట్టడికి మొత్తం వొత్తిడి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా  జిల్లా, మండల స్థాయి వరకూ కూడా సౌకర్యాలను పెంచి వికేంద్రీకరణ వైపుగా చర్యలు తీసుకోవాలి. ప్రకటించిన గచ్చిబౌలి ఆసుపత్రిని యుద్దప్రాతిపదిక మీద అన్ని సౌకర్యాలతో పనిచేయించడం ప్రారంభించాలి. అవసరమైన వైద్య సిబ్బంది నియామకాలు జరపాలి. ఈ రంగంలో వైద్య నిపుణులను నియమించాలి. వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది మీద వొత్తిడి పడకుండా విడతల్లో డ్యూటీలు ఉండేట్లు, వారికి తగినంత విశ్రాంతి తీసుకునేవిధంగా సౌకర్యాలు ఉండేట్లు ప్రణాళిక తయారు చేయాలి.వైద్య, సహాయ సిబ్బంది అందరికీ తగినన్ని నాణ్యమైన రక్షణ కిట్లు(పిపిఈ), ఎన్-95 మాస్కులు అందించాలి. పారిశుద్ధ్య సిబ్బందితో సహా! వీరి సంఖ్య ఎక్కువగా ఉండేట్లు చూడాలి. వారిపట్ల గౌరవంతో వ్యవహరించాలి. సెక్యూరిటీ సిబ్బందికి కూడా రక్షణ కిట్లు అందించాల్సిన అవసరం వుంది.పరిస్థితుల మీద అవగాహన కోసం సమస్యతో సంబంధంలేని వైద్య నిపుణులను కాకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ఆరోగ్య మంత్రిత్వ సలహా బోర్డులో తీసుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులను కూడా వైరస్ కట్టడిలో భాగస్వాములను చేయాలి, అయితే ప్రజలు భరించలేనంత ఫీజులు వసూలు చేయకుండ కటినమైన నిబంధనలు విధించాలి.”

ఏదైతేనేం, అన్నీ కాకపోయినప్పటికీ కొన్ని అంశాలలో ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసి వచ్చింది. ఇప్పటికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన వివిధ అంశాల పట్ల, ముఖ్యంగా ప్రజా భాగస్వామ్యం, అవగాహన పెంచే కార్యక్రమాలు, మద్దతు వ్యవస్థల మీద సానుకూలంగా మరింత దృష్టి సారించగలిగితే అతి తొందరలోనే వైరస్ కట్టడిలో తెలంగాణ విజయం సాధించగలుగుతుంది.జర్మనీ లాంటి దేశాలలో అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు ఆరోగ్య వసతులు సంపూర్తిగా కల్పించి, ఏ విధమైన వివక్షా లేకుండా రోగులందర్నీ ఒకే విధంగా చూసుకున్నచోట మరణాల సంఖ్యను బాగా కట్టడి చేయగలిగారు. ఇలాంటి సానుకూల పద్ధతులను అధ్యయనం చేయాలి.

కరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదంటే అవును కాబోలనుకున్నారు ప్రజలందరూ! రెండున్నర నెలల లాక్ డౌన్ తర్వాత నిజంగా ఎవరైనా ఆశించేది ఏమిటి? వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టటం. కానీ, అలా జరగకపోగా, దేశమంతా కూడా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువయిపోయింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి కారణం ఎవరు?  ప్రభుత్వాలు నిర్లజ్జగా ప్రజల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెబుతోంది. పైగా, సామాజిక మాధ్యమాలలో, ‘వైరస్ బారిన పడిన వారి సంఖ్య 250 వున్నప్పుడు ప్రజలు ‘పానిక్ మోడ్’(భయం) తో వుంటే, ఇప్పుడు రెండున్నర లక్షల మంది వైరస్ పాజిటివ్ వుంటే ‘పిక్నిక్ మోడ్’(ఉల్లాసం)లో వున్నారనే’ తప్పుడు సంకేతాలతో మెసేజులు చలామణి అవుతున్నాయి. అంటే, వైరస్ తగ్గుముఖం పట్టకపోవటానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని నెపం మోపుతున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టక పోవటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎక్కడా లేదా? ఈ ప్రశ్నలు మాత్రం ఎవరూ వేయకూడదు? వేసిన వాళ్లు ప్రభుత్వ వ్యతిరేకులు, ఇంకా చెప్పాలంటే దేశద్రోహులు కూడా అయిపోతారు!

కులం, మతం, వర్గాలకి అతీతంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ వ్యాపితంగా గణాంకాలు ఘోషించినా,ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా కానీ, మనదేశానికి వచ్చేసరికి ఈ జాడ్యాలన్నీ అంటుకుని చెప్పరానంత నష్టాన్ని కలుగజేశాయనటంలో అసలు సందేహమే అవసరం లేదు. ఎంత టెలిఫోన్ రింగ్ టోనుల్లో ‘కరోనా వైరస్ బాధితులకు అండగా వుండటం మన బాధ్యత’ అని పదే పదే చెప్పినప్పటికీ వాస్తవానికి జరిగేది మాత్రం బాధితుల పట్ల తీవ్రమైన వివక్షే. ఇప్పటికీ ఇవన్నీ ప్రజల రోజువారీ జీవితాల్లో ప్రతిఫలిస్తూనే వున్నాయి.

దేశం మొత్తం మీద అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ (15జూన్, 2020) కోవిద్-19 వ్యాధికి  గురైనవారు మూడు లక్షల ముప్ఫైమూడు వేలకు దగ్గరగా వున్నారు. ఈ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య దగ్గర దగ్గర పదివేలకు చేరుకుంటోంది. ఒకలక్షా డెబ్భై వేలమంది దాకా కోలుకున్నారు. ఇంకా ఒకలక్షా యాభైవేలమంది వైరస్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వరకూ చూస్తే (14జూన్, 2020) దగ్గరదగ్గర ఐదువేలమంది వ్యాధి బారిన పడితే, చనిపోయినవారి సంఖ్య నూటా ఎనభై ఐదు, కోలుకున్తున్నవారి సంఖ్య రెండువేల మూడువందల పైన వుంటే, ఇన్ఫెక్షన్తో ఇంకా బాధ పడుతున్నవారి సంఖ్య రెండువేల ఐదువందల మందికి దగ్గరలో వున్నారు.

అయితే, తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు తక్కువ చేస్తున్నారనే అంశం కూడా చర్చలో వుంది. ప్రజల్లో అపోహలు తగ్గి అవగాహన పెరగాలంటే పరీక్షలు పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం వుంటుంది. లేకపోతే సమూహ వ్యాప్తి లోకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మరింత విషమించడం తప్పించి చేయగలిగింది ఏమీ వుండదు. దీనికి ఒకటే పరిష్కారం, వైద్యవ్యవస్థను పటిష్ట పరిచటం, వైద్యసిబ్బందికి వొత్తిడి లేకుండా పనిచేసే వాతావరణాన్ని కల్పించడం. రాష్ట్రం మొత్తం భారాన్ని ఒక గాంధీ హాస్పిటల్ మీదే పెట్టడం అంటే, అక్కడి వ్యవస్థని కుప్పకూలేటట్లు చేయటమే. ఎప్పుడైతే పనిగంటల ఒత్తిడి పెరుగుతుందో, వైద్య సిబ్బంది కూడా తమ అసహనాన్ని బాధిత రోగుల మీద చూపిస్తారు. నిజానికి బాధిత రోగులకు మనస్థైర్యాన్ని అందించవలసిన అవసరం ఎన్నో విధాలుగా వుంటుంది. వారిని ముందుగా భయం నుంచీ బయటపడవేయాలి. వైరస్ పాజిటివ్ రోగులను అందరికీ దూరంగా విడదీసి ఉంచాల్సి వచ్చినపుడు వారి మానసిక స్థితి మరింత దిగజారుతుంది. అలాంటప్పుడు వారికి ధైర్యం చెప్పే ఒక కౌన్సిలర్ వ్యవస్థ వుండాలి. ఇన్ఫెక్షన్ బారి నుండి తొందరగా కోలుకోవటానికి బలవర్ధకమైన ఆహారం, వారి వారి ఆహార అలవాట్లకు అనుగుణంగా  వుండాలి. ఇలాంటి సౌకర్యాలు, పరిస్థితులు కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. కానీ దురదృష్టవశాత్తూ తెలంగాణాలో ఈ రకమైన వ్యవస్థ రూపొందలేదు. ఐసోలేషన్ వార్డుల్లో కానీ, క్వారంటైన్ సెంటర్లలో కానీ ఎక్కడా కూడా ప్రజల ఆహార అలవాట్లను అనుసరించి ఆహారం ఇవ్వలేదు. నిజానికి, ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా కోలుకోవాలంటే బలవర్ధకమైన, అలవాటైన ఆహారం వుండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. వీటితో పాటు వైరస్ వ్యాప్తి మీద అవగాహన కన్నా అపోహలు, భయం మాత్రమే ఉండటం, వైరస్ బారిన పడ్డారన్న అనుమానం ఉన్నవారిని పోలీసు నిర్బంధంతో తీసుకెళ్లటం, వైరస్ లేదని నెగటివ్ గా పరీక్షల్లో తేలినాగానీ వారిపట్ల చుట్టుపక్కలవారి అనుమానాస్పద చూపులు, వెలివేసినట్లు ప్రవర్తించడం అన్నీకూడా బాధితులను మరింత కుంగతీశాయి.

వైద్య వ్యవస్థకి ప్రజా సమూహాలకీ మధ్య అనుసంధానంగా పనిచేయవలసిన సహాయ వైద్యబృందాలను, వాలంటీర్ వ్యవస్థను పెంపొందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పరిమితమైన పారామెడికల్ సిబ్బంది మీదే ఆధార పడ్డారు. ఈ రకమైన నిర్ణయంవల్ల ఆ సిబ్బంది మీద కూడా అపరిమితమైన ఒత్తిడి పడింది. వైద్య, సామాజిక రంగాల్లో పరిశోధన చేస్తున్నపౌరబృందాల సలహాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ బృందాలు, మే 5వ తారీఖున అనేక సూచనలతో ఆరోగ్య శాఖా మంత్రిని కలిసి మెమొరాండం ఇచ్చారు. దానిలో ముఖ్యాంశాలు:ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించినట్లు కొరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చెయ్యాలి. కొరోనా లక్షణాలు వున్న వారికి పరీక్షలు సులువు చెయ్యాలి. వైద్య సిబ్బందికి తగినన్ని రక్షణ కవచాలు అన్ని స్థాయిల్లో ఏర్పర్చి ప్రజారోగ్య వ్యవస్థని బల పరచాలి. ప్రజలకి క్వారంటైన్,ఐసోలేషన్ గురించిన భయాలు పోగొట్టాలి.రోగులకు, క్వారంటైన్లో వున్న వ్యక్తులకి అవసరమయ్యే ఆన్లైన్ సహాయ వాలంటీర్ వ్యవస్థని పౌర సమాజ సహకారంతో ఏర్పాటు చెయ్యాలి. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, అన్నార్తులకి రాత్రి పగలు చేయూత నందిస్తున్న తెలంగాణ పౌర సమాజ ప్రయత్నాల్ని ఇప్పటికయినా గుర్తించి ఆరోగ్య అవగాహన పెంచటంలో వారి సలహాలని స్వీకరించాలి. కోలుకున్నవారి అనుభవాలను మీడియా ద్వారా అందరికీ అందించగలిగితే ప్రజల్లో భయంపోయి, అవగాహన పెరుగుతుంది.పౌరులందరినీ సమానంగా, వివక్ష లేకుండా చూడాలనే తన రాజ్యాంగ బాధ్యతలని మాటలలో కాకుండా, చేతలలో చూపించాలి.

ఈ సలహాలతో పాటు పౌరసమూహాల నుంచీ ఆరోగ్య పరమైన అంశాల్లో సహాయ పడగలుగుతామని చెప్పినప్పటికీ వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ఆరోగ్యపరంగా సూచనలు అందించడానికి ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టకపోవడం ఏం సూచిస్తుంది?నిజానికి, ఈ సూచనలను అందించినప్పుడు పరిస్థితి ఇప్పుడున్నంత తీవ్రంగా లేదు. ఇంకా మరణాల సంఖ్య రెండంకెలలోనే వుంది. ఈ సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకున్నట్లుగా తర్వాత ఏ సమాచారమూ లేదు. దీన్ని ఏమనుకోవాలి? వేల పడకల ఆస్పత్రి, వేలసంఖ్యలో వెంటిలేటర్లు వంటి ఆర్భాటపు ప్రకటనల్లో, అసలు క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది కనీసం రక్షణ కవచాలు కూడా కొరతేననే విషయం గాలిలో కలిసిపోయింది. వాటిగురించి ఎవరైనా సిబ్బంది మాట్లాడినా, జర్నలిస్టులు మాట్లాడినా గానీ వారి నోరునొక్కే ప్రయత్నమే చేశారు కానీ, ఆ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరికి గాంధీ ఆసుపత్రి లో సమాచారం అందించనందుకు జూన్ 10న డాక్టర్ల మీద తిరగబడ్డ పేషంట్ల బంధువుల అసహనం, ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ మరణం, అనేక విషయాలను బయటకు తీశాయి.

భౌతికంగా డాక్టర్ల మీద దాడి జరగటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. కానీ, ప్రభుత్వం చేయగలిగి వుండి కూడా నిర్లక్ష్యంగా వదిలివేసిన ఎన్నో విషయాలను ఈ అంశం బయటకు తీసింది. నాలుగు కోట్ల మంది జనాభా వున్న రాష్ట్రంలో ఒకే ఒక హాస్పిటల్ కరోనా పేషంట్లకు ఎలా సరిపోతుందని జూనియర్ వైద్యులు వేసిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు. మళ్లీ పౌర సమాజం నుంచీ, ఒకప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఆరోగ్యశాఖ కార్యదర్శులుగా పనిచేసిన  విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రాక్టీసులో వున్న వైద్యులు, ఇతర సమూహాల ప్రతినిధులు చొరవ తీసుకుని ఒక బహిరంగలేఖ రాశారు.అందులో ముఖ్యాంశాలు, “గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషంట్ల చికిత్స కొరకు తక్షణం సౌకర్యాలను పెంచడం, వ్యవస్థను బలోపేతం చేయాలి. వైరస్ కట్టడికి మొత్తం వొత్తిడి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా  జిల్లా, మండల స్థాయి వరకూ కూడా సౌకర్యాలను పెంచి వికేంద్రీకరణ వైపుగా చర్యలు తీసుకోవాలి. ప్రకటించిన గచ్చిబౌలి ఆసుపత్రిని యుద్దప్రాతిపదిక మీద అన్ని సౌకర్యాలతో పనిచేయించడం ప్రారంభించాలి. అవసరమైన వైద్య సిబ్బంది నియామకాలు జరపాలి. ఈ రంగంలో వైద్య నిపుణులను నియమించాలి. వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది మీద వొత్తిడి పడకుండా విడతల్లో డ్యూటీలు ఉండేట్లు, వారికి తగినంత విశ్రాంతి తీసుకునేవిధంగా సౌకర్యాలు ఉండేట్లు ప్రణాళిక తయారు చేయాలి.వైద్య, సహాయ సిబ్బంది అందరికీ తగినన్ని నాణ్యమైన రక్షణ కిట్లు(పిపిఈ), ఎన్-95 మాస్కులు అందించాలి. పారిశుద్ధ్య సిబ్బందితో సహా! వీరి సంఖ్య ఎక్కువగా ఉండేట్లు చూడాలి. వారిపట్ల గౌరవంతో వ్యవహరించాలి. సెక్యూరిటీ సిబ్బందికి కూడా రక్షణ కిట్లు అందించాల్సిన అవసరం వుంది.పరిస్థితుల మీద అవగాహన కోసం సమస్యతో సంబంధంలేని వైద్య నిపుణులను కాకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ఆరోగ్య మంత్రిత్వ సలహా బోర్డులో తీసుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులను కూడా వైరస్ కట్టడిలో భాగస్వాములను చేయాలి, అయితే ప్రజలు భరించలేనంత ఫీజులు వసూలు చేయకుండ కటినమైన నిబంధనలు విధించాలి.”

ఏదైతేనేం, అన్నీ కాకపోయినప్పటికీ కొన్ని అంశాలలో ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసి వచ్చింది. ఇప్పటికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన వివిధ అంశాల పట్ల, ముఖ్యంగా ప్రజా భాగస్వామ్యం, అవగాహన పెంచే కార్యక్రమాలు, మద్దతు వ్యవస్థల మీద సానుకూలంగా మరింత దృష్టి సారించగలిగితే అతి తొందరలోనే వైరస్ కట్టడిలో తెలంగాణ విజయం సాధించగలుగుతుంది.జర్మనీ లాంటి దేశాలలో అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు ఆరోగ్య వసతులు సంపూర్తిగా కల్పించి, ఏ విధమైన వివక్షా లేకుండా రోగులందర్నీ ఒకే విధంగా చూసుకున్నచోట మరణాల సంఖ్యను బాగా కట్టడి చేయగలిగారు. ఇలాంటి సానుకూల పద్ధతులను అధ్యయనం చేయాలి.

న్నారనే’ తప్పుడు సంకేతాలతో మెసేజులు చలామణి అవుతున్నాయి. అంటే, వైరస్ తగ్గుముఖం పట్టకపోవటానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని నెపం మోపుతున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టక పోవటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎక్కడా లేదా? ఈ ప్రశ్నలు మాత్రం ఎవరూ వేయకూడదు? వేసిన వాళ్లు ప్రభుత్వ వ్యతిరేకులు, ఇంకా చెప్పాలంటే దేశద్రోహులు కూడా అయిపోతారు!

Leave a Reply