Take a fresh look at your lifestyle.

మోడీ సన్నిహిత కార్పొరేట్లు దేశాన్ని దోచుకుంటున్నారు…

  • అక్టోబర్ 2 న వ్యవసాయ బిల్లు కి వ్యతిరేకంగా నిరసనలు ..కాంగ్రెస్ పార్టీ
  • సంగారెడ్డి లో పాల్గొననున్న ఇంచార్జి మణికం టాగూర్ ..
  • అక్టోబర్ 2 నుండి 31 వరకు రైతులతో సంతకాల సేకరణ .
  • నవంబర్ 14 న 2 కోట్ల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం

గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకున్న విదంగానే నేడు మోడీ సన్నిహితులైన కార్పొరేట్ వ్యాపారులు దేశాన్ని దోచుకుంటున్నారని ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ ఛైర్మెన్ సచిన్ రావ్ విమర్శించారు.రోజు రోజుకు ప్రజల ఆస్తులు, దేశ సంపద తరిగి పోతుంటే మోడీ సన్నిహితులైన గౌతమ్ ఆధాని, అంబానీల ఆస్తుల విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోపించారు. బుధవారం జూమ్ యాప్ ద్వారా సిడబ్ల్యుసి సభ్యులు సచిన్ రావ్, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ తో తో పాటు వందలాది మంది నాయకులు ట్రైనింగ్ విభాగం మీటింగ్ లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాల పై చర్చించరు.జూమ్ యాప్ లో సచిన్ రావు పవర్ పాయింట్ పర్సెంటేషన్ ద్వారా దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నాయకులకు వివరించారు.గౌతమ్ ఆధాని ఒక్కరోజుకు 59 కోట్లు సంపదిస్తుంటే, ముకేశ్ అంబానీ రోజుకు 210 సంపాదిస్తున్నారని ఆయన అన్నారు.వారి ఒక్కరోజు సంపాదన దేశంలో కోట్లాది ఉపాధి హామీ కార్మికుల దినసరి వేతనంతో సమానమని , మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవన పరిస్థితులు రోజు రోజుకు దిగజరిపోతున్నాయని కానీ కార్పొరేట్ వ్యాపారుల ఆదాయం విపరీతంగా పెరుగుతుందని అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలి అన్నారు.

అన్ని సంస్థలను వ్యాపారుల చేతిలో పెట్టిన మోడీ ప్రభుత్వం నేడు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టి రైతాంగ భవిష్యత్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకే ప్రస్తుతం మూడు వ్యవసాయ బిల్లులు ఆమోదం చేసుకొని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టి రైతుల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని వివరించారు.ఈ విషయాలను నాయకులు గ్రామ స్థాయి వరకు తీస్కెళ్లాలని ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ..కేంద్రం అమలు చేయనున్న వ్యవసాయ వ్యతిరేక బిల్లుల విషయంలో ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు, ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రైతులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ టాగూర్ సంగారెడ్డి లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.అక్టోబర్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రైతుల సంతకాల సేకరణ చేసి నవంబర్ 14వ తేదీన రెండు కోట్ల సంతకాలతో రాష్ట్రపతి కి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమాలను అన్ని ప్రాంతాలల్లో నాయకులు తప్పనిసరిగా చేపట్టాలని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply