Take a fresh look at your lifestyle.

పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యం

  • కొత్త హాస్పిటళ్ల నిర్మాణంతో అందుబాటులోకి
  • ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు
  • భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వొస్తాయని నిపుణులు చెప్తున్నారు
  • వైద్యరంగం పటిష్టతకు ప్రత్యేక చర్యలు
  • మతం క్యాన్సర్‌ ‌లాంటిది….ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • నగరంలో హాస్పిటళ్ల శంకుస్థాపన అనంతరం సభలో సిఎం కెసిఆర్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పేదలకు కార్పోరేట్‌ ‌స్థాయి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌నలుచెరుగులా మాస్పిటళ్ల ఏర్పాటుతో ఇక వైద్యానికి ఢోకా ఉండదన్నారు. వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ఎల్బీనగర్‌, ‌సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్ ‌హాస్పిటళ్లకు భూమిపూజ అనంతరం అల్వాల్‌లో ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడుతూ…భవిష్యత్‌లో కొరోనా మహమ్మారి లాంటి వైరస్‌లు వొస్తాయని నిపుణులు చెప్పారని పేర్కొన్నారు. ఆ సందర్భంలో ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ, ఒక నగరం గానీ ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు తక్కువ నష్టం నుంచి బయటపడుతారనీ, వ్యవస్థ ఎక్కడైతే బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారన్నారు. వైరస్‌లను పూర్తిగా నిర్మూలించే మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్‌ ‌చేసే వైద్య విధానం మాత్రమే ఉందన్నారు.

వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవీయ కోణంతో చాలా కష్టపడి.. పోరాడి..ఆరుదశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి.. దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్ట పరిచేందుకు సరైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ రోజు మిగతా పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయని, మనం మాత్రం కంటోన్మెంట్‌ ‌సికింద్రాబాద్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎవరు చనిపోయినా వారింటికి తీసుకెళ్లేలా వాహనాలు ఏర్పాటు చేశామని, 50, 60 వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య విధానాన్ని పటిష్ట పరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని, హెచ్‌ఎం‌డీఏ పరిధిలో 1.64 కోట్ల జనాభా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు హాస్పిటళ్లు ఉండాలని నిర్ణయించామని, వీటిలో అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు ప్రజలకు అందుతాయన్నారు. గ్రావి•ణ దవాఖానాల్లో పడకలు, సదుపాయాలు పెంచామన్న ఆయన.. హైదరాబాద్‌లోని హాస్పిటళ్లలో ఆరు వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అంతేకాదు.. మృతదేహాల తరలింపునకు ప్రత్యేక ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయిస్తామని సీఎం కేసీఆర్‌ ‌హావి• ఇచ్చారు.

ఎరగ్రడ్డ, అల్వాల్‌ ‌హాస్పిటళ్ల నిర్మాణానికి సిఎం భూమి పూజ
ఎల్బీనగర్‌ ‌హాస్పిటల్‌ ‌శంకుస్థాపన అనంతరం ఎర్రగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ‌సనత్‌నగర్‌ ‌చెస్ట్ ‌హాస్పిటల్‌ ‌ప్రాంగణంలో నిర్మించనున్న వేయి పడకల టిమ్స్ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ హాస్పిటల్‌ను 17 ఎకరాల్లో 14 అంతస్తుల్లో నిర్మిస్తారు. ఇందుకోసం సర్కారు 882 కోట్లు మంజూరు చేసింది. అనంతరం ఎర్రగడ్డ నుంచి అల్వాల్‌ ‌బయలుదేరిన ముఖ్యమంత్రి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అక్కడికి చేరుకున్నారు. అల్వాల్‌లో నిర్మించనున్న టిమ్స్ ‌హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ హాస్పిటల్‌ ‌కోసం రూ.897 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 28.41 ఎకరాల్లో జీ ప్లస్‌ 5 అం‌తస్తుల్లో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో హాస్పిటల్‌ను 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెయ్యి పడకల సామర్థ్యంతో సర్కారు నిర్మించనుంది. ఫలితంగా వైద్య విద్య కోసం పీజీ, సూపర్‌ ‌స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వొస్తాయని అంచనా వేసిన వైద్యారోగ్యశాఖ.. ఇందుకు తగిన ఏర్పాట్లు ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేసింది.

హాస్పిటళ్లకు అనుబంధంగా సూపర్‌ ‌స్పెషాలిటీ ఇన్‌ ‌నర్సింగ్‌, ‌పారామెడికల్‌ ‌విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకురానున్న టిమ్స్ ‌హాస్పిటళ్లకు ప్రభుత్వం ఇప్పటికే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ జీవో విడుదల చేసింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తుంది. అల్వాల్‌లో ఏర్పాటు చేసే హాస్పిటల్‌తో సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్‌ ‌జిల్లాల నుంచి వొచ్చే రోగులకు..ఎల్బీనగర్‌ (‌గడ్డి అన్నారం) హాస్పిటల్‌ ‌ద్వారా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల వారికి, గచ్చిబౌలి, సనత్‌నగర్‌ ‌హాస్పిటళ్లతో సవి•ప జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

Leave a Reply