Take a fresh look at your lifestyle.

‌ప్రైవేట్‌ హాస్పిటల్స్  దందాపై  ఆగ్రహం

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ
శాసనసభలో ప్రకటించిన సిఎం కెసిఆర్‌
‌ప్రైవేట్‌ హాస్పిటల్స్  దందాపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఇంతగనం ప్రజలను దోచి వారు ఏం చేస్తారని మండిపడ్డారు. కొరోనాపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడుతూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్ ‌ఫోర్స్ ‌కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్  దందాపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కొన్ని హాస్పిటల్స్  కొరోనా ట్రీట్‌మెంట్‌ ‌పేరిట డబ్బు సంపాదించుకుంటున్నాయని మండిపడ్డారు. దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు లక్షలు పీడించడం సరికాదన్నారు. ఈ సమయంలోనూ ఇలా పీడించడం ఏంటని ప్రశ్నించారు. వాడు ఎవడైనా కానీ.. ఏ హాస్పిటల్స్  అయినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం. దుర్మార్గం కదా.. లోకం అల్లాడుతుంటే… ఈ సమయమే దొరికిందా? కాంగ్రెస్‌ ‌శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఇచ్చిన సలహాను పాటిస్తాం. టాస్క్ ‌ఫోర్స్ ‌కమిటీ వేస్తాం. ఆరోగ్యమంత్రి పర్యవేక్షణలో టాస్క్ ‌ఫోర్స్ ఉం‌టుంది. వారానికి ఓసారి రిపోర్ట్ అన్ని పార్టీలకు అందేలా చర్యలు తీసుకుంటాం అని కేసీఆర్‌ అన్నారు.  కొరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో కొరోనాపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొ రోనా కట్టడికి నిత్యం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Leave a Reply