Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ హాస్పిటల్స్ కు కార్పోరేట్‌ ‌హంగులు

  • మౌలిక సదుపాయాలల్లో రాజీలేకుండా చర్యలు
  • నిర్వహణ, శుభ్రత విషయంలో జాగ్రత్తలు
  • నిధుల కొరతా రాకుండా..పరికరాలు లేవనకుండా చూసుకోవాలి
  • నాడు-నేడు సమీ క్షలో అధికారులకు సిఎం నిర్దుష్ట ఆదేశాలు

‌ప్రభుత్వ హాస్పిటల్స్ ను పటిష్టంగా తయారుచేసి, పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉండాలని పేర్కొన్నారు. ఆ తరహా నాణ్యమైన సేవలు అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఎస్‌ఓపీలను తయారుచేసి, వాటిని అమలు చేయాలన్నారు. మంగళవారం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమం, వైఎస్సార్‌ ‌హెల్త్ ‌క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటల్స్ , వైద్య కళాశాలల్లో అభివృద్ది కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ… వైద్యం, విద్యా రంగాల్లో నాడు- నేడు కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. నాడు – నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మనం హాస్పిటల్స్ కు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీకూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో పేదవాడికి లభ్యం కావాలన్నారు. బెడ్‌షీట్ల దగ్గరనుంచి, శానిటేషన్‌ ‌సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు.

పేషెంట్‌కు ఇచ్చిన గది, పడక దీంతోపాటుహాస్పిటల్ వాతావరణం, అలాగే రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో మార్పులు కచ్చితంగా కనిపించాలని తెలిపారు. ఎక్కడా కూడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదన్నారు. ఈమేరకు తీసు కోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్‌ఓపీలను తయారుచేయాలని తెలిపారు.

Leave a Reply