ప్రజలు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడాలని సిఐ శివశంకర్ అన్నారు. బుధవారం స్థానిక పొలీస్ స్టేషన్లో సిబ్బందితో కలిసి మాస్క్‌లు ధరించి పలువురికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు తాము మాస్క్‌లు ధరించి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమేనని తెలిపారు.
కరోనా వైరస్ రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ధరిచేరదన్నారు. తమ చుట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కరోనా వైరస్ గురించి సొషల్ మీడియాలో తప్పడు ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు బిక్షపతి, శ్రీనివాసులు, ఏడుకొండలు, నరేందర్‌రెడ్డి,ఏఎస్సై శంకర్, హెచ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.