Take a fresh look at your lifestyle.

పాడి, మాంసం ఎగుమతులకు కరోనా దెబ్బ

coronavirus,damage,dairy,meat,exportsప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న   కరోనా వైరస్ మన దేశాన్ని కూడా దెబ్బతీసింది. గత నెలలో మన దేశం నుంచి ఎగుమతులు పడిపోయాయి.  ప్ర పంచ ఆహార సంస్థ   (ఎఫ్ ఏఓ)   ఆహార ధర సూచి   జనవరి లో ఒక శాతం తగ్గింది.   వంటనూనెలు,  మాంసం,  తృణ ధాన్యాల ఎగుమతులు   తగ్గినట్టు నమోదు అయింది.

భారత  పాడి, మాంస,  తృణధాన్యాల ఎగుమతులు    ఫిబ్రవరిలో కరోనా వైరస్ కారణంగా   తగ్గుదల నమోదు అయినట్టు ఎఫ్ ఏఓ  పేర్కొంది.  ఎఫ్ ఏఓ   ఆహార ధర సూచి  (ఎప్ పిపిఐ)  నెలనెలా మారుతూ ఉంటుంది.  అంతర్జాతీయ ధరవరలను బట్టి మారుతూ ఉంటుంది.  ఫిబ్రవరి నెలలో సగటున  180.  5 పాయంట్లుగా నమోదు అయింది. జనవరి నెల కన్నా ఒక శాతం తక్కువ.  ఎఫ్ ఏఓ    గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం    వంటనూనెలు,  మాంసం, తృణధాన్యాల ఎగుమతులు   వరుసగా ,  10.3 శాతం, 2 శాతం,  0.9 శాతం  జనవరి నుంచి తగ్గాయి.  పాడి, చక్కెర   ఎగుమతులు  4.6 శాతం 4.5 శాతం పెరిగాయి.     ఎఫ్ పిపిఐ పతనం  మొదటి నాలుగు నెలల్లో  ఇదే మొదటి సారి సూచి సంవత్సరం ప్రాతిపదికన పెరుగుతూ ఉంటుంది.

భారత్ ఏ విధంగా    దెబ్బతింది. .

కొన్ని వస్తువులు  భారత ఎగుమతుల్లో చాలా ముఖ్యమైనవి.   అంతర్జాతీయ స్థాయిలో వాటి ధరల తగ్గుదల  ప్రభావం మన దేశం పై  కూడా ఉంటుంది. ఎఫ్ ఏఓ   పాడి ధరల సూచి  ఫిబ్రవరిలో వరుసగా నాలుగవ నెలలో  పెరుగగా,    ఫిబ్రవరిలో అంతర్జాతీయంగా కరోనా వైరస్  ప్రబలిన కారణంగా  ఎగుమతులు పడిపోయాయి.   పాలపొడి ఉత్పత్తులపై కూడా దాని ప్రభావం పడింది.

వెన్న తీసిన పాల పౌడరు   సంపూర్ణ పాల పౌడర ల  కొటేషన్లు    చైనాలో కొనుగోళ్ళలో పతనం వల్ల  తగ్గాయి.  ప్రపంచంలో పాలపొడిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం చైనా,   రేవుల లో  సరకుల రవాణాలో జాప్యం,  కరోనా వైరస్ కారణంగానే జరిగినట్టు ఎఫ్ ఏఓ పేర్కొంది.

వెన్నతీసిన పాలపొడి ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2018-19లో   మన దేశం నుంచి పాడి ఉత్పత్తుల ఎగుమతులు   126 శాతం పెరిగి  1,23,677  మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి.   వీటి విలువ   దాదాపుగా  2,700 కోట్లు  ఈ ఏడాది   వెన్న తీసిన పాలఉత్పత్తుల ఎగుమతులు  292 శాతం పెరిగాయి.  2017-18లో  16,616 మెట్రిక్ టన్నులు ఉంగదా 2018-19లో  46,137 మెట్రిక్ టన్నులకు పెరిగింది.

మన దేశం నుంచి  మాంసం ఎగుమతులు    పడిపోయాయి. ఫిబ్రవరిలో అంతర్జాతీయ  మార్కెట్ లో    గొర్రె   మాంసం ధర తగ్గడానికి కోవిడ్ -19 కారణం.  మొక్క జొన్న ఎగుమతులు కూడా బాగా తగ్గాయి.  2918-19లో మ దేశం 10,51, 277.95   మెట్రిక్ టన్నుల  మొక్క జొన్న గుమతి చేయగా,   ఈ ఏడాది పంట బాగా ఉన్నప్పటికీ కోవిడ్-19  వల్ల ఎగుమతులు తగ్గవచ్చు.  ఎద్దు మాంసం ఎగుమతులు  2 శాతం తగ్గవచ్చు.  మన దేశంలో ఈ ఏడాది గోధుమ దిగుబడులు బాగాఉండవచ్చు.,ఈ ఏడాది  5.68-7.64 శాతం  నుంచటి  108-110  మిలియన్  టన్నులకు రబీ సీజన్ లో పెరగవచ్చు.

Tags: coronavirus,damage,dairy,meat,exports

Leave a Reply