Take a fresh look at your lifestyle.

‌ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కొరోనా వైరస్‌

కొరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నది. రోజుకువేలమంది కి మహమ్మారి వైరస్సోకుతోంది. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గత నాలుగు నెలలుగా ప్రపంచం మొత్తం కంటికికనిపించనిశతృవులో పోరాడుతోంది. ఈ పోరాటం ఎలా కొనసాగించాలో తెలియక సతమతమౌతున్నది. ఈ పోరాటంలో యోధులూ, బాధితులూజనమే. అయితే మహమ్మారిపై ముందువరుసలో నిలబడిపోరాడే యోధులు వేరుగా ఉన్నారు. శతృవు కనిపించకపోయినా, ఆ రహస్య మహమ్మారి కబలించే ముప్పుఉందనితెలిసినా ప్రజల రక్షణ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకుని పోరాడుతున్నారు. కొరోనా పోరాట యోధులను ప్రపంచం మొత్తం వేనేళ్లకొనియాడుతోంది. సన్మానాలు,సత్కారాలతో అభినందనమాలలు వేస్తున్నది. అయితే ఒకవర్గం యోధులు మాత్రం ఎలాంటి గుర్తింపూ నోచుకోకుండానే తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. వారే పాత్రికేయులు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్యసిబ్బంది, పోలీసులు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తూ జనాన్ని అప్రమత్తం చేస్తున్న నేతలూ వీరందరూ అన్ని విధాలుగా రక్షణ కవచాల మధ్య ఉండి తన విధులను నిర్వర్తిస్తుంటూ… జర్నలిస్టులు మాత్రం ఎలాంటి రక్షణ ఆయుధాలూ (పీపీఈకిట్లు, సానిటైజర్లు, హెడ్‌ ‌మాస్కులు వంటివి) లేకుండానే కదనరంగంలో అంతా తామై కలయ తిరుగుతున్నారు. వైద్యులు తమ వద్దకు వచ్చిన రోగులకు చికిత్స చేస్తున్నారు. సానిటైజర్స్ ‌సిబ్బంది (పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వాలు, నేతలు ఇచ్చిన రక్షణ కవచాలు, ఆయుధాలు ధరించి పోరాటంలో ముందు వరుసలో ఉన్నారు. పోలీసులూ అంతే, అయితే జర్నలిస్టులు మాత్రం ఇటువంటి కవచాలూ, ఆయుధాలూ లేకుండానే యుద్ధం చేస్తున్నారు. మూడు నెలల పాటు జనం అంతా కలుగుల్లో (లాక్‌డౌన్‌ ‌నిర్బంధం)లోఉండి వైరస్‌ ‌నుంచి రక్షణ పొందితే… ఆ సమయంలో కూడా కరోనా మహమ్మారి వ్యాప్తి ముప్పు గురించి ప్రపంచానికి చాటేందుకు జర్నలిస్టులు పోరాట యోధులై ప్రమాదకర పరిస్థితుల్లో నిలబడి పని చేశారు. భారత్లోఅయితేగుర్తింపు లేని జర్నలిస్టులు తమఅమూల్య, అపూర్వసేవలకు ఫలితంగా చాలా మంది కరోనా మహమ్మారి కోరలకు చిక్కారు. వారిపట్లసానుభూతికానీ, వారికి మద్దతు కానీ ఇసుమంతైనా లభించలేదంటే అతిశయోక్తికాదు. ఒకరితరువాత ఒకరుగాకరోనాబారినపడి ఆసుపత్రులపాలౌతున్నా..

సహచరుల అనారోగ్యం, మరణం బాధిస్తున్నా, గుండెలను పిండేస్తున్నా మొక్కవోని ధైర్యంతో విది •నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు ఇప్పటికైనా జర్నలిస్టులకు కరోనా మహమ్మారినుంచితమను తాము కాపాడుకునేందుకు అవసరమైన పరికరాలను అందజేయాల్సిన బాధ్యతప్రభుత్వాలపై, ఆయా మీడియా సంస్థలపై ఉంది. జర్నలిస్టుసంఘాలు కోరుతున్నా ఇప్పటి వరకూ ఆవిషయంలో ఎటువైపునుంచీఎటువంటి సహకారం లభించలేదు. తాజాగా తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లంనారాయణ కరోనాబారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవడానికి్ర పభుత్వం ముందుకు వచ్చిందని ప్రకటించారు. కరోనాబారినప• •ఆసుపత్రిపాలైన జర్నలిస్టులకు పాతిక వేలరూపాయలు, క్వారంటైన్‌ అయిన జర్నలిస్టులకు పదివేలరూపాయల చొప్పున అందించారు. అయితే ఇది ఎంత మాత్రం చాలదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలబడేవిధంగా ప్రభుత్వంపైప్రెస్‌ అకాడమీ ఒత్తిడి తీసుకు రావాలి. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రావలసిన ఆదాయం కోల్పోయిన మీడియా సంస్థలు జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి. వేతనంలో కోత, సమయానికి ఇవ్వకపోవడం, అలాగేఉద్యోగాల నుంచి తొలగించడంవంటిచర్యలకుపాల్పడుతున్నాయి. ఈపరిస్థితిలో పత్రికయాజమాన్యాలనుతప్పుపట్టలేనిపరిస్థితిఉంది.

అందుకే ప్రభుత్వమే ముందుగా చొరవతీసుకుని మీడియాసంస్థలకు ప్రభుత్వ పరంగా అందాల్సి న నిధులను వెంటనే విడుదల చేయడమే కాకుండా,ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా కష్టకాలంలో జనానికి వార్తలు చేరవేసేందుకు నిర్విరామంగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఇబ్బందులు, కష్టాల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఇసుమంతైనా అలసత్వం ప్రదర్శించడం సరికాదు. ఈ విషయంలో జర్నలిస్టులను అన్నివిధాలుగాఆదుకుని, వారిలో మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకోవాల్సిన అవసరంఉంది. జనం కష్టాలు, బాధలను తమకలం బలంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి… వాటినితీర్చేలా ఒత్తిడి తెచ్చే జర్నలిస్టులు తమ కష్టాలు, బాధలు, ఇబ్బందులను మాత్రం పంటి బిగువున భరిస్తూ సమాజశ్రేయస్సే విద్యుక్తధర్మం అనిభావిస్తూ విధి నిర్వహణలో నిరాయుధులైన సైనికుడిగా మహమ్మారి వైరస్‌తో పోరాడుతున్నారు. కరోనాపై ప్రపంచం చేస్తున్నపోరులోఅ ందరికంటే ముందువరుసలో నిలుచున్న జర్నలిస్టులకే మహమ్మారి ముప్పు ఎక్కువగా ఉంది. కనుక జర్నలిస్టుల ఆరోగ్యరక్షణ కోసం పత్రికా యాజమాన్యాలు, ప్రభుత్వం అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపపట్టాలి.

డా।। మల్లేశ్వర్‌ ‌సంగాని
జర్నలిస్టు డిపార్ట్‌మెంట్‌ ‌హెడ్‌, ‌కాకతీయ యూనివర్సీటీ, వరంగల్‌, 9866255355

Leave a Reply