Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్‌కు అడ్డ్డాగా.. క్షౌరశాలలు

  • భౌతిక దూరం సాధ్యమేనా ?
  • ఇవి ఎంత వరకు సురక్షితం
  • రక్షణ చర్యలు శూన్యం

కరోనా వైరస్‌ ‌కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 25 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ ‌విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ ‌మూలంగా దేశంలో స్వయం ఉపాధి ద్వారా జీవించే కోట్ల మంది ఉపాధి కొల్పోయారు. ఇందులో ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు ఒకరు. దేశవ్యాప్తంగా నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ అనేక మంది జీవిస్తున్నారు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ ‌మొదలైనప్పటి నుంచి నాయి బ్రాహ్మణులకు కష్టాలు దలయ్యాయి. ముఖ్యం హెయిర్‌ ‌సెలూన్‌ల యాజమానులు, అందులో పని చేసే రోజు వారి కూలీపై పని చేసే నాయి బ్రాహ్మణులకు ఉపాధి లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ వృత్తిలో జీవించేవారు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారే అధికం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సుమారు 55 రోజులు షాపులు మూసేసి బార్బర్‌ ‌షాపులకు దూరం ఉండాల్సి వచ్చింది. దీంతో అనేక మంది ప్రజలకు, పిల్లలకు పెరిగిన జుట్టుతో విసిగిపోయారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో కార్టూనిస్టులు పెరిగిన జుట్టు మీద విపరీతమైన కార్టూన్లు వేశారు. సోషల్‌ ‌మీడియాలో విపరీత•గా ప్రభుత్వాన్ని ట్రోల్‌ ‌కూడా చేశారు. రెండోసారి, మూడోసారి లాక్‌డౌన్‌ ‌పొడిగించిన తరువాత చాలా మంది యువకులు, ప్రజలు ఎవరికి వారు స్వంతంగా ట్రిమ్మింగ్‌ ‌చేసుకొవడం లేదా ఏకంగా గుండు చేసుకొవడం జరిగింది. కోపంతో రగిలిపోతూ సామాజిక మాధ్యమాల్లో కొంత మంది తమ గుండు పోటోలను షేర్‌ ‌చేసి కరోనా హెయిల్‌ ‌స్టైల్‌ అం‌టూ వ్యంగ్యంగా రాతలు రాసి నవ్వులు పూయించారు. క్రికెటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లికి అతన భార్య అనుష్క కటింగ్‌ ‌చేయడం సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయింది. పిమ్మట అనేక మంది బాలీవుడ్‌, ‌టాలీవుడ్‌ ‌నటులు కూడా విరాట్‌ను, అనూష్కను ఫాలో అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌నాలుగోసారి పొడిగిస్తూ గ్రీన్‌, ఆరెంజ్‌ ‌జోన్లలో నాయి బ్రాహ్మణులకు తమ వృత్తి కొనసాగించవచ్చని గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెయిల్‌ ‌సెలూన్‌లు తెరుచుకున్నాయి.

భౌతిక దూరం సాధ్యమేనా …
కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ముందస్తు జాగ్రత చర్యలు తీసుకుంటున్నాయి. అంతేగాకుండా అనేక మార్గదర్శకాలు కూడా జారీ చేశాయి. అయితే ప్రస్తుతం తెరచుకున్న హెయిల్‌ ‌సెలూన్లలో కొరోనా వైరస్‌ ‌నుంచి వినియోగదారులకు సెలూన్‌ ‌నిర్వహకులు చర్యలు తీసుకుంటున్నారా లేదా కొరోనా వైరస్‌ ‌వ్యాప్తికి హెయిల్‌ ‌సెలూన్లు అడ్డగా మారుతాయా అన్న అనుమానం అనేక మంది ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. కరోనా కట్టడికి ప్రభుత్వం మన చేతులతో మన ముక్కును, నోటిని తాకద్దు అని చెబుతుంది. నిరంతరం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించమని చెబుతుంది. అయితే హెయిర్‌ ‌సెలూన్‌లలో మాస్కులు ధరించిన కూడా, సెలూన్‌ ‌నిర్వహకులు కటింగ్‌ ‌చేసేటప్పుడు, షేవింగ్‌ ‌చేసేటప్పుడు, హెడ్‌ ‌మసాజ్‌ ‌చేసేటప్పుడు, హెయిర్‌ ‌కలర్‌ ‌వేసేటప్పుడు భౌతిక దూరం పాటించడం అసలు సాధ్యమవుతుందా? ఈ పనులు అన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళ పీల్చుకునే వదిలేసే శ్వాస మన శారీరానికి తాకుంది కదా! వినియోగదారులకు రక్షణ ఎక్కడుందని కొంత మంది వాధన.

ప్రతిసారి సానిటైజ్‌ ‌కుదురుతుందా…
సెలూన్‌ ‌షాపుకు వచ్చే వినియోగదారులకు వాటి యాజమానులు చేతులు కడుక్కోవడానికి సబ్బు, నీళ్ళు, శానిటైజర్‌ ఎన్ని షాపుల్లో అందుబాటులో ఉంచారు అనేది సమాధానం లేని ప్రశ్న. సెలూన్‌ ‌షాపుల్లో సాధారణంగా వాడే దువ్వెనలు, కత్తెరలు, ముఖాన్ని తుడిచే టవల్స్, ‌బ్రష్‌లు అందరికి వాడుతుంటారు. ప్రస్తుతం ఇప్పుడు వినియోగదారులకు వీటి నుంచి ఎంత వరకు రక్షణ ఉంటుంది? ఒకవేళ ప్రతిసారి దువ్వెనలు, కత్తెరలు, టవల్స్, ‌బ్రష్‌లు, ఇతర సామాగ్రి శానిటైజ్‌ ‌చేయడమో లేదా స్టేరిలైజ్‌ ‌చేయడమో సాధ్యమవుతుందా. సెలూన్‌ ‌షాపు వచ్చే వినియోగదారుల్లో అధిక శాతం మందికి పది నిమిషాలు ఆగే ఓపిక కూడా ఎవరికి ఉండదు అన్నది సుస్పష్టం. ఇక షేవింగ్‌ ‌విషయానికి వస్తే ఒకే రేజర్‌ (‌షేవింగ్‌ ‌కత్తి) వాడినా బ్లేడ్‌ ‌మార్చడం, రేజర్‌ను డెటాల్‌తో కడగడం చేయడం బాగానే ఉంది. కాని మళ్ళీ ఇక్కడ బాగా డైల్యూట్‌ ‌చేసినా డెటాల్‌ ‌నీళ్ళతో కడగడం మూలంగా కరోనా వైరస్‌ ‌నుంచి వినియోగదారునికి ఎంత వరకు మనకు రక్షణ ఉంటుంది? షేమింగ్‌ ‌తరువాత ముఖానికి సబ్బు రాసి లేదా క్రిమ్‌ ‌రాసి నీళ్ళు చల్లి ముఖాన్ని టవల్‌తో తుడవడం చాలా సర్వ సాధారణం. అయితే అదే టవల్‌తో ఆ రోజు ఎంత మంది వినియోగదారుల ముఖాలు తుడిచారో తెలియదు. ఆ రోజు మొత్తం అదే కుర్చీలో ఎంత మంది కూర్చున్నారో తెలియదు. అందులో ఒకవేళ కరోనా వైరస్‌ ‌వచ్చిన వ్యక్తి ఉంటే పరిస్థితి ఏమిటి? సెలూన్‌కు వెళ్ళిన పాపానికి మిగిలిన వారు వైరస్‌ను అటించికోవాల్సిందేనా? ఒకవేళ ఇదే జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? ఉపాధి కొరకు పని చేసుకుంటున్న సెలూన్‌ ‌నిర్వహకులదా? లేదా సెలూన్లకు సఢలింపులు ఇచ్చిన ప్రభుత్వానిదా? లేదా సెలూన్‌ ‌షాపుల్లో రక్షణ చర్యలు ఎలా తీసుకొవాలో నేర్పించని వైద్య ఆరోగ్యశాఖ అధికారులదా?

రక్షణ చర్యలపై శిక్షణ అవసరం…
దేశంలోని కొన్ని మెట్రోపాలిటన్‌ ‌నగరాల్లోని ఖరీదైన హెయిల్‌ ‌సెలూన్‌లలో, స్పాలలో ఇలా జరగకుండా ఒకరికి వాడిన దువ్వెన, కత్తెర, టవల్‌ ‌మరొకరికి వాడరు. ఒక మోస్తరు హెయిర్‌ ‌సెలూన్లలో ముఖాన్ని తుడిచేందుకు టవల్‌కు బదులుగా టిష్యు పేపరును వాడతారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తాము ప్రతిరోజు వాడే పరికరాలను ఏ విధంగా శానిటైజ్‌ ‌చేసుకొవాలో, రక్షణ పద్దతులు ఎలా పాటించాలో ఉచిత శిక్షణ ఇస్తే బాగుంటందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. లేకపోతే హెయిల్‌ ‌సెలూన్ల ద్వారా వైరస్‌ ‌ప్రబలే అవకాశం మాత్రం లేకపోలేదు. దేశంలో 600 మంది కరోనా అనుమానుతులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌విధించి ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీస్‌ ‌లాఠీ పవర్‌ను వినియోగించింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో లాక్‌డౌన్‌ 3.0‌లో సఢలింపులు ఇవ్వడం, పిమ్మట దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు తెర తీసి, దాన్ని సమర్థించుకోవడానికి ప్రధానమంత్రి , ముఖ్య మంత్రులు కొరోనాతో దేశప్రజలు కలిసి సహజీవనం చేయాల్సిందేనని చావు కబురు చల్లగా చెప్పారు. ఉన్న నాలుకుకు మందెస్తే కొండ నాలుక ఊడినట్లు… కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ‌విధించి ప్రయోజనం ఏముందని సోషల్‌ ‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం కష్టమైన సరే ఎంతో నిష్టగా ప్రభుత్వ సూచనలు పాటించిన ప్రజలు, సఢలింపుల మూలంగా వాటిని తుంగలో తొక్కె ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే కొరోనా వైరస్‌ ‌తిరిగి అనేక రకాలుగా విజృభించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. కరోనా వైరస్‌ ‌వ్యాప్తికి ప్రధానమైన అడ్డా మాత్రం హెయిల్‌ ‌సెలూన్‌లే అనడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదని అనేక మంది అభిప్రాయం.

Leave a Reply