Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్‌ ‌విజృంభణ

  • ప్రపంచంలో కొరోనా దారికొస్తుందా?
  • వివిధ దేశాల్లో తగ్గుతున్న కేసులు
  • అమెరికాలో టెస్ట్ ‌ఫలితాల ఖచ్చితత్వంపై ఆందోళన
  • మే మొదటి వారం వరకు పలు దేశాల్లో కొనసాగనున్న లాక్‌డౌన్‌

కొద్ది రోజులుగా యూరోపియన్‌ ‌దేశాల్లో వైరస్‌ ‌విజృంభణ తగ్గుతూ వస్తోందని ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంటే, అమెరికాలో కూడా ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఆఫ్రికా ఖండం సహా ఇతర దేశాల్లో ప్రస్తుతం ఈ వ్యాధి వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సుమారు 16 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. కొరోనావైరస్‌ ‌బాధిత దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంక్షలను సడలించే విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ అధ్యక్షుడు డాక్టర్‌ ‌టెడ్రొస్‌ అద్నామ్‌ ‌గెబ్రియేసుస్‌ అన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతున్నప్పటికీ ఇటలీ, స్పెయిన్‌ ‌దేశాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. యూరోపియన్‌ ‌దేశాల్లో ఇప్పుడిప్పుడే కోవిడ్‌-19 ‌మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని జెనీవాలో జరిగిన వర్చువల్‌ ‌కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్‌ ‌వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఆంక్షల్ని సడలించే విషయంలో ఆయా దేశాలతో కలిసి డబ్ల్యూహెచ్‌ఓ ‌పని చేస్తోందని, అయితే ఇప్పటికిప్పుడు లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేసే పరిస్థితి లేదని అన్నారు. వెంటనే ఆంక్షల్ని సడలించడం వల్ల మహమ్మారి మరింత తిరగబెట్టవచ్చు’ అని డాక్టర్‌ ‌టెడ్రోస్‌ ‌హెచ్చరించారు. మరోవైపు పీసీఆర్‌ ఆధారితకరోనా టెస్టుల సంఖ్య పెరిగే గొద్దీ కొత్త సమస్య ఉత్పన్నమవుతుందని అమెరికాలో తాజాగా జరిగిన అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకూ ఓ వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనేది పీసీర్‌ ‌టెక్నాలజీ ఆధారిత పరీక్షల ద్వారా నిర్దారిస్తున్నారు. ఈ విధానంలో రోగి నుంచి సేకరించిన నమూనాల్లో కరోనా వైరస్‌ ‌కణాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. అయితే ఈ పద్ధతి ద్వారా ఎంత కచ్చితమైన ఫలితాలు వస్తాయి అనే అంశం ఎంతో ప్రాముఖ్యంతో కూడుకున్నది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దీని కచ్చితత్వాన్ని 90 శాతం వరకూ పెంచవచ్చు. ఈ టెస్టుల ద్వారా కరోనా బారిన పడ్డవాళ్లలో కేవలం 90 శాతం మందిలోనే కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించవచ్చు.

- Advertisement -

మిగిలిని పది శాతం మందికి కరోనా సోకలేదనే నిర్దారణకు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి తోడు కొందరు కరోనా వ్యాధి గ్రస్థుల్లో వ్యాధి లక్షణాలు కనిపించట్లదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టెస్టుల కచ్చితత్వం పట్ల మరింత అప్రమత్త వహించాలని అమెరికాలోని మయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నిర్దారణ సంఖ్య పెరిగే కొద్దీ ఫాల్స్ ‌నెగెటివ్‌ల ప్రభావం మరింత పెరిగి వ్యాధి కట్టడిలో అడ్డంకులు ఏర్పడవచ్చని చెబుతున్నారు. 40 మిలియన్ల జానాభా కలిగిన కాలిఫోర్నియాలో కేవలం ఒక్క శాతం మందికే ఈ కరోనా నిర్దారణ పరీక్షలు జరిపినా కూడా దాదాపు 20 వేల మందికి ఫాల్స్ ‌నెగెటివ్‌ ‌వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు కేవలం పీసీఆర్‌ ‌పరీక్షలపైనే ఆధారపడకుండా..అనుమాతుడి శరీర లక్షణాలు, అతడు ఏయే ప్రాంతాల్లో పర్యటించాడు, ఎవరెవరిని కలుసుకున్నాడు, అతడికి చేసిన ర్యాపిడ్‌ ‌యాంటీ బాడీ పరీక్షలు ఫలితాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాగా నష్టపోయిన స్పెయిన్‌ అత్యవసర సర్వీసులు కాని భవన నిర్మాణ రంగం, ఉత్పత్తి కర్మాగారాల్లో కార్మికుల్ని సోమవారం నుంచి విధులకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.తాజా గణాంకాల ప్రకారం కోవిడ్‌-19 ‌కారణంగా అక్కడ 15,843 మంది చనిపోయారు. సామాజిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తోంది. ఇటలీలో మే 3 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగించాలని ఇటలీ ప్రధాని గుసెప్పే కాంటే నిర్ణయించారు.

ఇన్ని రోజులుగా ఆంక్షలు పాటించడం వల్ల కల్గిన లాభాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని పిలుపునిచ్చారు. అదే సమయంలో మార్చి 12 నుంచి మూతపడ్డ చిన్న చిన్న వ్యాపారాలను మంగళవారం నుంచి తిరిగి తెరవనున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌మొదలైనప్పటి నుంచి కేవలం నిత్యావసరాలు, మందుల దుకాణాలను మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చారు. ఐర్లాండ్‌లో మే 5 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగనుంది. ఇస్తాంబుల్‌, అం‌కారా సహా మొత్తం 31 నగరాల్లో 48 గంటల కర్ఫ్యూని ప్రకటించింది టర్కీ ప్రభుత్వం. సరిగ్గా 2 గంటల ముందే ఈ నిర్ణయం ప్రకటించడంతో నిత్యావసరాల కోసం షాపుల్లో జనం ఎగబడ్డారు. పోర్చుగల్‌ ‌దేశంలో మే1 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుంది. లాక్‌ ‌డౌన్‌ ‌విషయంలో బ్రిటన్‌ ‌మల్లగుల్లాలు పడుతోంది. అయితే పరిస్థితి కుదుటపడేంత వరకు లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు కొనసాగుతాయని చెబుతోంది.లాక్‌ ‌డౌన్‌ను దక్షిణాఫ్రికా మరో 2 వారాలు పొడిగించింది. మొత్తంగా పరిస్థితి అనుకున్నంత మేలుగా మాత్రం లేదని అర్థం అవుతోంది.

Leave a Reply