Take a fresh look at your lifestyle.

బయటి దేశాలనుంచి వొచ్చిన వారు 28 రోజుల వరకు శ్రీ వారి దర్శనానికి రాకండి..: కరోనా ఎఫెక్ట్

భారతీయులు గానీ, విదేశీయులు గానీ ఇతర దేశాల నుండి భారతదేశంలోకి అడుగుపెట్టిన రోజు నుండి 28 రోజుల పాటు తిరుమల సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం నుండి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

తిరుమలలో నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు ఉంటారు కావున కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా వైరస్ ఒకరి నుండి అనేక మందికి సులభంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది. ఈ కారణం వల్ల ఎక్కువ మంది భక్తుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని విదేశాల నుండి వచ్చే భక్తుల విషయంలో టిటిడి జాగ్రత్తలు పాటిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply