Take a fresh look at your lifestyle.

కొరొనా వైరస్ ఎప్పటికీ ఈ భూమండలాన్ని వదిలి పోక పోవచ్చు ..! ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ వైరస్ మన సమాజాలలో మరొక స్థానిక వైరస్ గా కొనసాగవచ్చు. హెచ్ఐవి వంటి వ్యాధులకు మందు లేదు. అయితే  ప్రజలు ఈ వ్యాధితో జీవించడానికి వీలుగా సమర్థవంతమైన చికిత్సలు అభివృద్ధి చేయబడ్డాయి “అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర చీఫ్ మాట్లాడుతూ, కరోనావైరస్ భూమి మీద సదా కొనసాగటానికి  ఉండటానికి అవకాశం ఉంది. ఈ మహమ్మారి ఎప్పుడు నియంత్రించబడుతుందో ఊహించలేము అన్నారు. ఈ వైరస్ ఎప్పటికీ అంతరించి పోదు అని డాక్టర్ మైఖేల్ ర్యాన్ బుధవారం ఒక మీడియా  సమావేశంలో అన్నారు. కోవిద్ -19 బారిన పడిన వారి సంఖ్య ఇప్పటివరకు చాలా తక్కువగా ఉందని కూడా ఆయన తెలిపారు. వ్యాక్సిన్ లేకుండా, ప్రపంచ జనాభాకు తగిన స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చని కూడా   డాక్టర్ మైఖేల్ ర్యాన్ వెల్లడించారు. ఈ నిజం అందరికి తెలియటం అవసరం అని స్పష్టం చేసారు.
డాక్టర్ ర్యాన్ మాట్లాడుతూ, సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడుతుందనే ఆశ ఉంది, అయితే అప్పుడు కూడా, వాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ఈ వాక్సిన్ తీసుకోవడానికి  సిద్ధంగా ఉన్న ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి.ప్రతి దశ సవాళ్లతో నిండి ఉందని ఆయన అన్నారు. కోవిద్ -19 వ్యవహారాలలో  WHO సాంకేతిక నాయకురాలుగా వ్యవహరిస్తున్న మరియా వాన్ కెర్ఖోవ్, కొంతమంది ప్రజలు నిరాశకు గురవుతున్నారని తాము గుర్తించామని తెలుపుతూ.. వైద్య జోక్యం లేకుండా కరోనా వైరస్ ను ఆపడం  అసాధ్యమని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిలుపుదల చేయటం మన చేతుల్లో ఉందని మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. కొన్ని దేశాలు కరోనా వైరస్‌ను అదుపులోకి తీసుకు వచ్చాయి అని తెలిపారు.

Leave a Reply