‘మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం 1631-1648 మధ్య కాలంలో ఆగ్రాలో నిర్మించిన పాలరాయి సమాధి తాజ్ మహల్ ప్రపంచ టూరిస్టులను ఆకర్షించి భారతదేశనికి ఆదాయాన్ని సమకూర్చటమే కాకా విశ్వవ్యాప్తంగా ఆరాధించ బడుతున్న కళాఖండం తాజ్మహల్ శ్రామిక బ్రతుకులకు జీవనాధారం కూడా.. తాజ్ మహల్ వలన పది లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నది. తాజ్ మహల్ వలన ఢిల్లీ, ఆగ్రాలలో చాలా ట్రావెల్ ఏజెన్సీలు నడుస్తున్నాయి. ఈ ట్రావెల్ ఏజెన్సీల వలన ఒక లక్షా ఇరవై వేల మందికి ఉపాధి దొరుకుతున్నది. తాజ్ మహల్ చూడటానికి ఆగ్రా వెళ్లినవారు, అక్కడ దొరికే ప్రత్యేకమైన మిఠాయి ఆగ్రా పేట కొంటారు. ఈ ఆగ్రా పేట.. రెండు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది …’
- పర్యాటక రంగం కుంటు పడనున్నదా..?
- ‘తాజ్ మహల్ ‘ పై ప్రభావం ఎంత ..?
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారం దేశంలో ఉన్న పర్యాటక స్థలాలలో అత్యధిక ఆదాయం సమకూర్చే పర్యాటక స్థలం ఆగ్రా లోని తాజ్ మహల్ . దీని తర్వాత ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, అత్యధికంగా ఆదాయం సమకూరుస్తాయి.. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 2017లో ఈ ఐదు పర్యాటక స్థలాలు మెయింటెనెన్స్ ఇతర అన్ని ఖర్చులు పోను 146 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూర్చాయి. 2019 నవంబర్ 18నాడు అస్సాం ఎంపి బద్రుద్దీన్ అజ్మల్, తాజ్ మహల్ సమకూరుస్తున్న ఆదాయం ఎంత..? తాజ్ మహల్ మెయింటెనెన్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం..? అని పార్లమెంట్ లో ప్రశ్నిచారు. ఈ ప్రశ్నకి జవాబుగా సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సభకు ఈ సమాచారం ఇచ్చారు.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వెబ్ సైట్ ప్రకారం 2018-2019 సంవత్సరంలో 70 లక్షల తొంభై వేల రెండు వందల ఏడు మంది పర్యాటకులు తాజ్ మహల్ సందర్శించారు. వీరి వలన ఎనభై ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల తొంభై మూడు వేల నూరు రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 2017-2018లో అరవై ఐదు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఏడుగురు సందర్శకులు తాజ్ ని విజిట్ చేసి యాభై ఎనిమిది కోట్ల డెబ్భై ఆరు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూర్చారు. 2016-2017లో అరవై ఒక్క లక్షల డెబ్భై ఏడు వేల,నూటా తొంభై ఆరు పర్యాటకులు తాజ్మహల్ సందర్శించి యాభై ఐదు కోట్ల తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమాకూర్చారు.2015-2016లో, తాజ్ మహల్ యాభై లక్షల డెబ్భై వేల ఐదు వందల డెబ్భై మూడు మంది తాజ్ సందర్శకుల వస్తే వీరి వలన పదిహేడు కోట్ల తొంభై రెండు లక్షల ఇరవై ఏడు వేల,యాభై రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 2014-2015లో అరవై లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఒక్క సందర్శకులు వచ్చి తాజ్మహల్ విజిట్ చేసి ఇరవై ఒక కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ముప్ఫై రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చారు అని మంత్రి పార్లమెంటు లో వివరించారు.
అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ప్రేమలో ముంతాజ్ కోసం నిర్మించిన 17వ శతాబ్దపు కట్టడం తాజ్ మహల్ మెయింటెనెన్స్ కి అయ్యే ఖర్చు 2017-2018లో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు ఖర్చు అయితే 2018-2019లో,ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల ముప్పైనాలుగు వేల ఐదువందల ఎనభై రెండు రూపాయలు ఖర్చు అయింది. ఈ ఏడు మెయింటినెన్స్ ఖర్చు పెరిగింది. అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తాజ్మహల్ నిర్వహణకు కొంత ఖర్చు చేస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నది. 2016-2017లో, నాలుగు కోట్ల యాభై లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టగా.. 2015-2016లో మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ముపై నాలుగు రూపాయలు.. 2014-2015లో మూడు కోట్ల తొంభై లక్షల ఇరవై వేల నూటా తొంభై ఖర్చు చేసింది. ప్రభుత్వ లెక్కల పుస్తకంలో తాజ్మహల్ ప్రాధాన్యత ఇలా ఉంటే.. సామాన్య ప్రజల జీవితంలో కూడా తాజ్ మహల్ పాత్ర చాలా పెద్దది.. అదెలాగో చూద్దాం..మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆదేశం మేరకు తన భార్య జ్ఞాపకార్థం 1631-1648 మధ్య కాలంలో ఆగ్రాలో నిర్మించిన పాలరాయి సమాధి తాజ్ మహల్ ప్రపంచ టూరిస్టులను ఆకర్షించి భారతదేశనికి ఆదాయాన్ని సమకూర్చటమే కాకా విశ్వవ్యాప్తంగా ఆరాధించ బడుతున్న కళాఖండం తాజ్మహల్ శ్రామిక బ్రతుకులకు జీవనాధారం కూడా.. తాజ్ మహల్ వలన పది లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నది. తాజ్ మహల్ వలన ఢిల్లీ, ఆగ్రాలలో చాలా ట్రావెల్ ఏజెన్సీలు నడుస్తున్నాయి.
ఈ ట్రావెల్ ఏజెన్సీల వలన ఒక లక్షా ఇరవై వేల మందికి ఉపాధి దొరుకుతున్నది. తాజ్మహల్ చూడటానికి ఆగ్రా వెళ్లినవారు, అక్కడ దొరికే ప్రత్యేకమైన మిఠాయి ఆగ్రా పేట కొంటారు. ఈ ఆగ్రా పేట.. రెండు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. తాజ్ మహల్ కి చూడటానికి పోయినవారు, అక్కడి హ్యాండీక్రాఫ్టస్ కొనటం షరా మామూలే.. దీని వలన ఆగ్రా జూతి పేరుతో ఇక్కడ జోళ్ళు అమ్ముతూ ఉంటారు. రెండు వందల యాభై మిషన్లతో నడిచే జోళ్ళు ఫ్యాక్టరీలు ఉన్నాయి.అలాగే ఐదువేల కాటన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు నాలుగు లక్షల వరకు ఉంటారు వీరిలో రెండు లక్షల మంది కాంట్రాక్ట్ లేబర్ గా పని చేస్తున్నారు. మరో రెండు లక్షల మంది డైలీ వేజ్ లేబర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంగా ప్రపంచవ్యాపితంగా టూరిజం సెక్టార్ కుంటుపడింది. దీనితో టూరిస్టులు తమ సొంత దేశాలు వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనివలన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్మహల్ ని సందర్శించే వారు లేరు. కరోనా వైరస్ తర్వాత ఏ మేరకు వస్తారు..అనేది ప్రశ్నార్థకం అయ్యింది. కరోనా వైరస్ వలన టూరిజంపై ఆధారపడిన ఆగ్రా ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు.. ఉత్తరాఖండ్, హిమాచల్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం పడనుంది.