Take a fresh look at your lifestyle.

సామాజిక దూరం పాటించడంతోనే కొరోనా కట్టడి ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు

ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా కొరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని గాంధీ ఆసుపత్రి జనరల్‌ ‌మెడిసిన్‌ ‌విభాగాధిపతి డాక్టర్‌ ‌వినయ్‌ ‌శేఖర్‌, అపోలో ఆసుపత్రి కన్సల్టెంట్‌ ‌డాక్టర్‌ ‌విష్ణు రావు ప్రజలకు సూచించారు. శుక్రవారం సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్‌ 19‌పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ‌వినయ్‌ ‌శేఖర్‌ ‌మాట్లాడుతూ కొరోనా వైరస్‌ ‌మిగతా అన్ని రకాల వైరస్‌ల వంటిదేననీ, ఈ వైరస్‌ ‌సోకిన ప్రతీ వంద మందిలో 85 శాతం మందికి ప్రమాదం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వృద్ధులకు వైరస్‌ ‌సోకినప్పుడు మాత్రమే ప్రమానం పొంచి ఉంటుందనీ, వీరు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ఈ వైరస్‌ ‌ప్రధాన లక్షణం జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి వంటివి కూడా రావొచ్చని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతి ఇస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించడం వంటివి చేయాలని చెప్పారు.

మనం ఈ వైరస్‌ను శ్వాసలోనికి పీల్చినప్పుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతు)తో ముట్టుకుని అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నప్పుడు కళ్లు, ముక్కు నోటి ద్వారా ఇది మన శరీరంలోనికి చొరబడుతుందని వివరించారు. తరచుగా చేతులను సబ్బునీటితో గానీ శానిటైజర్లతో గానీ, శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ స్వీయ నిర్బంధంలోనే ఇంట్లోనే ఉండాలనీ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. కొరోనా సోకిన వారికి ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా చాలా మంది కోలుకున్నారని పేర్కొన్నారు. డాక్టర్‌ ‌విష్ణురావు మాట్లాడుతూ వయసు ఎక్కువగా ఉన్న వారు ముఖ్యంగా కిడ్నీ, గుండె, లివర్‌ ‌వంటి వ్యాధులు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంపులో తిరిగేటప్పుడు మాత్రమే మాస్క్‌లు కేవలం ఒకసారి మాత్రమే వేసుకోవాలనీ, క్లోరోక్విన్‌ ‌వంటి మందులను వైద్యుల సలహా లేకుండా వేసుకోరాదన్నారు. అలాగే, మాంసాహారం ద్వారా కొరోనా వైరస్‌ ‌సోకదనీ, ఆహారాన్ని పూర్తిగా శుభ్రం చేసి సరిగా వండి స్వీకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉందన్నారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌నాగయ్య కాంబ్లే, జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌జగన్‌, ఇం‌చార్జి సీఐఇ విజయ్‌భాస్కర్‌ ‌రెడ్డి, ఉన్నతాధికారులు రాధాకిషన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply