Take a fresh look at your lifestyle.

సామాజిక దూరం పాటిస్తే కొరోన కట్టడి సులువు

మహబూబ్‌నగర్‌, ఏ‌ప్రిల్‌ 30 ( ‌ప్రజాతంత్ర ప్రతినిధి) ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సామాజిక బాధ్యతతో సామాజిక దూరం పాటిస్తే తే మహమ్మారి వ్యాధి కట్టడికి సులువు అవుతుందని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ ‌పట్టణం లోని మెట్టుగడ్డ, బాయమ్మతోట కొత్త గుంజ్‌ ‌మార్కెట్‌ ‌యార్డ్ ‌వద్ద పేద ప్రజలకు మంత్రి వి.శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌నిత్యవసర సరుకులను అందించారు.

పట్టణంలోని మెట్టుగడ్డ వద్ద గిరిజన భవనం లో జిల్లా గిరిజన సే వా సంఘం, న్యూగంజ్‌ ‌మార్కెట్‌ ‌యార్డ్ ‌హమాలీలకు, బాయమ్మతోట లో మంజూర్‌ ఆధ్వర్యంలో రంజాన్‌ ‌పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని, ప్రతి పేద వారికి ఈ కష్ట కాలంలో ఎదో విధంగా దాతలు ముందుకు వచ్చి పప్పు, బియ్యం వంటి నిత్యవసర సరుకులను అందిస్తున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుంటే టెలి మెడిసిన్‌ ‌కాల్‌ ‌సెంటర్‌ ‌కు కాల్‌ ‌చేస్తే వారే మందులు మరియు వైద్య సహాయం అందిస్తారని మంత్రి తెలిపారు. ప్రజలకు అందుబాటులో రైతు బజార్లు, మొబైల్‌ ‌రైతు బజార్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌కేసి నర్సిములు, మునిసిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌గణేష్‌, ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ఆం‌జనేయులు, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌మోహన్‌ ‌లాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply