ప్రజాప్రతినిధులకు కొరోనా పాజిటివ్‌తో ఆందోళన
కొరోనాతో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
వైరస్‌ను జయించిన మాజీ ఎమ్మెల్యే చింతల
ఎర్రోల్ల శ్రీనివాస్ గన్‌మెన్‌కు పాజిటివ్‌తో చికిత్స
•ం క్వారంటైన్లో మంత్రి హరీష్‌రావు, కోమటిరెడ్డి
మేయర్ బొంతు రామ్మోహన్‌కు నెగెటివ్‌తో ఊరట
తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటి వరకు ప్రజల్లో మాత్రమే ఉన్న కరోనా ప్రజాప్రతినిధులకు కూడా సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే నిరంతరం ప్రజల్లో ఉండే వీరిని కలవరప రుస్తోంది. రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ముత్తిరెడ్డి ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా సోకడం ఇదే ప్రథమం. అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. చింతలతో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది. వారంతా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి ఇటీవలె డిశ్చార్జ్ అయ్యారు. వీరందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పర్యటిస్తున్న నేతలకు ఒక్కొక్కరికి ఇలా కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఇకపోతే సిద్దిపేట కలెక్టర్, మంత్రి హరీష్ రావులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఎంపి కోమటిరెడ్డి కూడా క్వారంటైన్లోకి వెళ్లారని సమాచారం. ఇక తన పేషీలోని అటెండర్, కార్ డ్రైవర్‌కు కరోనా సోకడంతో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండోసారి వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. నగర కమిషనర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మొన్న రామ్మోహన్‌తో పర్యటించారు. ఆయనకు కరోనా నెగెటివ్ రావడంతో ఇప్పుడంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు మంత్రి హరీష్ రావు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. సిద్దిపేటకు చెందిన హరీష్ వ్యక్తిగత సహాయకుడికి కరోనా సోకింది. దీంతో హైదరాబాద్‌లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్న మంత్రి నుంచి వైద్యులు నమూనాలను సేకరించారు. పరీక్షలకు పంపగా నెగిటివ్ అని తేలింది. సిద్దిపేట, హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయాల్లో పనిచేస్తున్న 32 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటీవ్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్ మన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గన్‌మన్ కు కరోనా రావడంతో ఎర్రోళ్ల •ంక్వారంటైన్కు వెళ్లారు. అంతేకాకుండా.. వారం రోజులపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇకపోతే మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండోసారి కూడా కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సబ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు శుక్రవారం మరోసారి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మేయర్ కు నెగెటివ్ గా నిర్దారణ అయ్యింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మేయర్ బొంతు రామ్మోహన్ నిత్యం పర్యటించారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న ఓ •టల్లో అధికారులతో కలిసి ఇటీవల టీ తాగారు. అయితే ఆ •టల్ లో పని చేసే వ్యక్తికి కరోనా వచ్చిందని తేలడంతో ముందుస్తు జాగ్రత్తగా వారం రోజుల క్రితమే మేయర్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ వచ్చింది. అయితే ఆయన కారు డ్రైవర్‌కు కరోనా నిర్దారణ కావడంతో మళ్లీ నిన్న కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు అయన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తన కారు డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా •ం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో దాదాపు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు.
జమ్మికుంట యూనియన్ బ్యాంక్‌లో కలకలం
మేనేజర్,క్యాషియర్లకు కరోనా పాజిటివ్
బ్యాంకు సిబ్బందికి కరోనా సోకిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికంటలో జరిగింది. స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్‌తో పాటు, బ్యాంక్ క్యాషియర్‌కు కూడా కరోనా సోకింది. క్యాషియర్‌కు కరోనా సోకడంతో అతని భార్యకు కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మేనేజర్ కు రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ గా వచ్చింది. అతని నుంచి క్యాషియర్‌కు సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. చికిత్స నిమిత్తం వారందరిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. కాగా.. బ్యాంక్ సిబ్బందికి కరోనా సోకడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకులో రెండు, మూడు రోజుల నుంచి లావాదేవీలు జరిపిన ఖాతాదారుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుకు వెళ్లిన వారంతా తమకు సోకితే ఎలా అన్న ఆందోళనలో ఉన్నారు.